Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

బీహార్‌లో పేలుడు.. 10 మంది మృతి!

బీహార్‌లో పేలుడు.. 10 మంది మృతి

  • ముజాఫర్‌పూర్ లో ఓ నూడుల్స్ త‌యారీ ఫ్యాక్టరీలో ఘ‌ట‌న‌
  • బాయిల‌ర్ పేలిపోయిన వైనం
  • మ‌రికొంత మందికి తీవ్ర‌గాయాలు

బీహార్ లోని ముజాఫర్‌పూర్ లో ఓ నూడుల్స్ త‌యారీ ఫ్యాక్టరీలో భారీ పేలుడు సంభవించి, 10 మంది మృతి చెందారు. ఫ్యాక్ట‌రీలోని బాయిలర్ పేలి పోవడంతోనే ఈ ప్రమాదం జ‌రిగిన‌ట్లు తెలిసింది. ఈ ప్రమాదంలో మరికొంత మందికి తీవ్ర‌గాయాలైనట్లు అధికారులు తెలిపారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.

ఈ ప్రమాదంపై స‌మాచారం అందుకున్న అగ్ని మాపక సిబ్బంది, పోలీసులు అక్క‌డ‌కు చేరుకుని మంటలను అదుపు చేస్తున్నారు. గాయాల‌పాలైన వారిని ఆసుప‌త్రుల‌కు త‌ర‌లిస్తున్నారు. బాయిలర్ పేలుడు శబ్దాలు భారీగా విన‌ప‌డిన‌ట్లు స్థానికులు చెప్పారు. ఈ ప్రమాదం కార‌ణంగా ఓ మిల్లుతో పాటు భవనం ధ్వంసమైందని తెలిపారు.

Related posts

బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావును అదుపులోకి తీసుకున్న పోలీసులు

Drukpadam

Thailand Earns Nearly 70 Awards in SmartTravelAsia.com

Drukpadam

బలహీనులకు అండగా సుప్రీంకోర్టు-అది వారికీ తెలుసు-ఛీఫ్ జస్టిస్ రమణ కామెంట్స్

Drukpadam

Leave a Comment