Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
క్రైమ్ వార్తలు

వామ్మో రాజు నీ వెనక ఇంత కథ ఉందా? రుణాలు వేగవేసి నీతులు చెబుతున్నావా?

వామ్మో రాజు నీ వెనక ఇంత కథ ఉందా? రుణాలు వేగవేసి నీతులు చెబుతున్నావా?
విద్యుత్ సంస్థను నెలకొల్పుతామంటూ కన్సార్షియం నుంచి రూ. 974.71 కోట్ల రుణాలు
రుణాల ఎగవేత కేసు.. ఎంపీ రఘురామ కృష్ణరాజుపై సీబీఐ చార్జ్‌షీట్ దాఖలు
తీసుకున్న నిధులను ఫిక్స్‌డ్ డిపాజిట్లుగా మళ్లింపు
రఘురామరాజు సహా 16 మంది చార్జ్‌షీట్

రుణాలు తీసుకోవడమే కాకా వారిని వేగవేసి రోజు నీతికథలు చెబుతూ పబ్బం గడుపుకుంటున్నారు నర్సాపురం ఎంపీ రఘురామా కృష్ణమరాజు ….గెలిచినపార్టీకి వెన్నుపోటుపొడిచేందుకు సిద్దపడి నిత్యం ఎదో ఒకేసమస్యమీద మాట్లాడుతుంటే నిజమే అనుకున్నారు కొందరు అమాయకులు . కానీ అసలు విషయం తెలిసి అవాక్కు అవుతున్నారు.జగన్ తప్పు చేశాడు ఇలాంటి వారికీ టికెట్ ఇచ్చే పెద్ద తప్పు చేసినమాట నిజమే అని ఇప్పుడు అంగీకరించక తప్పదు …జగన్ పార్టీలో గెలిచి వేరే పార్టీ వాళ్ళకు కన్ను గీటేవాళ్ళను ఏమంటారో చెప్పనక్కరలేదు . ఇప్పుడు రఘురామరాజు 900 కోట్లు తీసుకున్న ఋణం వేగవేయడం పై సిబిఐ ఛార్జ్ షీట్ దాఖలు చేయడం ఆశక్తిగా మారింది.

రుణాల ఎగవేత కేసులో నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు సహా 16 మందిపై సీబీఐ చార్జ్‌షీట్ దాఖలు చేసింది. ఢిల్లీలోని రోజ్ అవెన్యూ కోర్టుల సముదాయంలోని సీబీఐ కేసుల ప్రత్యేక న్యాయస్థానంలో ప్రత్యేక న్యాయమూర్తి ఎదుట చార్జ్‌షీట్ దాఖలు చేసినట్టు సీబీఐ తెలిపింది.

ఈ కేసు పూర్వాపరాల్లోకి వెళ్తే.. రఘురామకృష్ణరాజు చైర్మన్‌గా ఉన్న ఇండ్ భారత్ కంపెనీ తమిళనాడులోని ట్యటికోరిన్‌లో థర్మల్ విద్యుదుత్పత్తి సంస్థను నెలకొల్పుతామని చెబుతూ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ (పీఎఫ్‌సీ) ఆధ్వర్యంలోని రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఆర్‌ఈసీ), ఇండియా ఇన్‌‌ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్స్ కంపెనీ లిమిటెడ్ (ఐఐఎఫ్‌సీఎల్)తో కూడిన కన్సార్షియం నుంచి రూ. 974.71 కోట్ల రుణం తీసుకుంది.

రుణం తీసుకున్నప్పటికీ కంపెనీని మాత్రం పూర్తి చేయలేదు సరికదా, రుణ ఒప్పంద నిబంధనలు కూడా పాటించలేదు. తీసుకున్న రుణాలను బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూకో బ్యాంకులకు ఫిక్స్‌డ్ డిపాజిట్ల రూపంలో మళ్లించడంతోపాటు గ్రూపు పరిధిలోని ఇతర కంపెనీల కాంట్రాక్టర్లకు అడ్వాన్సులు చెల్లించారు. తీసుకున్న రుణాలను చెల్లించకపోవడంతో కన్సార్షియం రూ.947.71 కోట్లను నష్టపోయింది.

ఈ క్రమంలో 3 అక్టోబరు 2018న హైదరాబాద్‌కు చెందిన ఓ ప్రైవేటు కంపెనీ, దాని డైరెక్టర్లపై ఢిల్లీలోని ఈవోడబ్ల్యూ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. కేంద్రం ఆదేశాలతో ఆ సంస్థపై 29 ఏప్రిల్ 2019న సీబీఐ కేసు నమోదు చేసింది. విచారణలో ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయి. తాజాగా రఘురామకృష్ణరాజు, ఆయన కంపెనీ, అనుబంధ కంపెనీలు, కాంట్రాక్టర్లు, చార్టెడ్ అకౌంటెంట్లు కలిపి మొత్తం 16 మందిపై చార్జ్‌షీట్ దాఖలు చేసింది.

Related posts

హైద్రాబాద్ లో కాల్పుల కలకలం …

Drukpadam

తరగతి గదిలో విద్యార్థికి లవ్ ప్రొపోజ్ చేసిన ఉపాధ్యాయుడు ….

Drukpadam

తన అరెస్ట్ పై సవాల్ విసిరిన యోగాగురువు :బాబా రాందేవ్!

Drukpadam

Leave a Comment