Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
సినిమా వార్తలు

‘ఆర్ఆర్ఆర్’ విడుదల వాయిదా… అభిమానుల్లో తీవ్ర నిరాశ!

‘ఆర్ఆర్ఆర్’ విడుదల వాయిదా… అభిమానుల్లో తీవ్ర నిరాశ!
దేశంలో మళ్లీ కరోనా కేసుల్లో పెరుగుదల
ఆంక్షల గుప్పిట్లోకి పలు రాష్ట్రాలు
థియేటర్ల మూసివేత
ఈ పరిస్థితుల్లో సినిమా విడుదల చేయలేమన్న చిత్రబృందం

ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసిన ఆర్ ఆర్ ఆర్ సినిమా వాయిదా పడడటంపై అభిమానుల్లో నిరాశ చేటు చేసుకుంది. దీనికోసం చిత్ర యూనిట్ దేశవ్యాపితంగా ప్రమోషన్ కూడా చేసింది. అగ్ర హీరోలు జూనియర్ ఎన్టీఆర్ , రాంచరణ్ , చిత్ర దర్శకుడు రాజమౌళిలు దీనికోసం పెద్ద హోమ్ వర్క్ చేశారు. కానీ సినిమా ప్రపంచవ్యాపితంగా జనవరి 7 విడుదల కావాల్సిన ఉండగా వాయిదా వేస్తున్నట్లు చిత్రం యూనిట్ ప్రకటించింది….

దేశంలో కరోనా రోజువారీ కేసుల్లో పెరుగుదల, ఒమిక్రాన్ కలకలం నేపథ్యంలో ఆర్ఆర్ఆర్ చిత్రబృందం కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్ఆర్ఆర్ విడుదలను వాయిదా వేస్తున్నట్టు ఓ ప్రకటనలో వెల్లడించింది.

వాస్తవానికి జనవరి 7న ఆర్ఆర్ఆర్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు అంతా సిద్ధమైంది. రాజమౌళి, ఎన్టీఆర్, రామ్ చరణ్ దేశవ్యాప్తంగా ప్రమోషన్ ఈవెంట్లలో పాల్గొంటూ ప్రచారం ముమ్మరం చేశారు. అయితే, గడచిన కొన్నిరోజులుగా దేశంలో కరోనా రోజువారీ కేసులు భారీగా పెరిగాయి. అటు ఒమిక్రాన్ సైతం ఆందోళనకర రీతిలో వ్యాపిస్తోంది. దాంతో అనేక రాష్ట్రాల్లో మళ్లీ ఆంక్షలు విధిస్తున్నారు.

ఈ నేపథ్యంలో, తమ చిత్రాన్ని విడుదల చేయకపోవడమే మేలని ఆర్ఆర్ఆర్ యూనిట్ భావిస్తోంది. “చిత్రం విడుదల కోసం మేం ఎంతో శ్రమించినా కొన్ని పరిస్థితులు మా నియంత్రణలో ఉండవు. అనేక రాష్ట్రాల్లో థియేటర్లు మూసివేస్తున్నారు. మీ ఉద్విగ్నతను మరికొన్నాళ్లు అట్టిపెట్టుకోవాలని చెప్పడం మినహా మాకు మరో మార్గం కనిపించడంలేదు. అయితే, భారతీయ సినిమా ఖ్యాతిని చాటి చెప్పేలా సరైన సమయంలో మీ ముందుకు వస్తాం” అంటూ ఆర్ఆర్ఆర్ చిత్రబృందం తన ప్రకటనలో పేర్కొంది.

Related posts

బలగం చిత్రానికి రెండు అంతర్జాతీయ అవార్డులు!

Drukpadam

సమయాన్ని పెంచండి.. సెకండ్ షో వేసుకుంటాం: జగన్ కు సినీ నిర్మాత నట్టి కుమార్ లేఖ!

Drukpadam

మా ఎన్నికలపై భిన్న స్వరాలూ ….మోహన్ బాబు తీవ్ర వ్యాఖ్యలు!

Drukpadam

Leave a Comment