Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

సంజయ్ అరెస్ట్ అనంతర పరిణామాలపై రంగంలోకి దిగిన ప్రధాని ….

సంజయ్ అరెస్ట్ అనంతర పరిణామాలపై రంగంలోకి దిగిన ప్రధాని ….
బండి సంజయ్ కి ప్రధాని మోదీ ఫోన్… ఇటీవలి పరిణామాలపై సంభాషణ!
సంజయ్ అరెస్ట్ పరిణామాలపై ఆరా
సంజయ్ పోరాట స్ఫూర్తిని అభినందించిన ప్రధాని
తెలంగాణలో అనుకూల వాతావరణ ఉందన్న ప్రధాని
మీకు అండగా ఉంటామని వెల్లడి
ఇటీవల బండి సంజయ్ జాగరణ దీక్ష భగ్నం
అరెస్ట్ చేసిన పోలీసులు
బీజేపీ నేతల్లో తీవ్ర ఆగ్రహావేశాలు
టీఆర్ఎస్ సర్కారుపై దాడి

తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్ట్ తదనంతర పరిణామాలు తెలుసుకునేందుకు స్వయంగా ప్రధాని నరేంద్ర మోడీ ఫోన్ చేశారు . బండి సంజయ్ తో నేరుగా మాట్లాడారు . దాదాపు 15 నిముషాలు ప్రధాని సంజయ్ తో మాట్లాడారు . అరెస్ట్ జరిగిన తీరు అనంతర పరిణామాలు గురించి తెలుసుకున్నారు. 317 జి ఓ పై ఆరా తీశారు . తెలంగాణ లో రాజకీయ సూన్యత ఉందని అందువల్ల గో హెడ్ …మీ పోరాటం స్ఫూర్తిదాయకం అంటూ సంజయాని ప్రధాని అభినందించినట్లు తెలుస్తుంది.

తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ జాగరణ దీక్ష, అరెస్ట్, విడుదల తదితర అంశాలతో రాష్ట్రంలో రాజకీయ వేడి నెలకొంది. ఇదే అదనుగా బీజేపీ అగ్రనేతలు తెలంగాణ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శల దాడి చేస్తున్నారు. ఈ అంశాలన్నీ ప్రధాని నరేంద్ర మోదీ దృష్టికి వెళ్లాయి. ఇవాళ ఆయన బండి సంజయ్ తో స్వయంగా మాట్లాడారు. బండి సంజయ్ కి ఫోన్ చేసిన మోదీ దాదాపు 15 నిమిషాల పాటు సంభాషించారు. తెలంగాణలో తాజా రాజకీయ పరిణామాలను అడిగి తెలుసుకున్నారు. బండి సంజయ్ చేపట్టిన జాగరణ దీక్ష గురించి, అరెస్ట్ తదితర అంశాల గురించి చర్చించారు.

Related posts

చంద్రబాబు, పవన్ భేటీపై వైసీపీ నేతల విమర్శలు… సోమిరెడ్డి కౌంటర్!

Drukpadam

I.N.D.I.A కూటమి ఎంపీలు మణిపూర్ వెళ్లారు కదా.. చూసింది చెప్పాలి: కేంద్రమంత్రి నిర్మల

Ram Narayana

అమిత్ షా జీ, మీరు జోక్యం చేసుకోండి: ఖర్గే

Drukpadam

Leave a Comment