Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

షర్మిల పార్టీ పేరు వైయస్ ఆర్ టీపీ నా …?

షర్మిల పార్టీ పేరు వైయస్ ఆర్ టీపీ నా …?
-జిల్లాల వారీగా వైయస్ అభిమానులను కొనసాగుతున్న చర్చలు
-పార్టీ జెండాలో ఆకుపచ్చ ,నీలం,పసుపు రంగులు
-ఖమ్మం లేదా హైదరాబాద్ లో పోటీ చేసే ఆవకాశం
-ఏప్రిల్ 9 న ఖమ్మం సభలో పార్టీ ప్రకటన
వైయస్ షర్మిల పార్టీ విషయంలో స్పీడ్ పెంచారు. వడివడిగా అడుగులు వేస్తున్నారు. అభిమానులను జిల్లాల నుంచి వచ్చిన నేతలను కలుస్తున్నారు. కీలకమైన వ్యక్తులతో పార్టీ విధివిధానాలపై చర్చలు జరుపుతున్నారు. వారి సలహాలు ,సూచనలు తీసుకుంటున్నారు. ఇప్పటికే పార్టీ పేరుపై ఒక క్లారిటీ కి వచ్చినట్లు సమాచారం . పార్టీ పేరు వైయస్ టీపీ గా నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది. తన తండ్రి ఆశయ సాధనకోసమే పార్టీ పెడుతున్నట్లు తెలిపిన షర్మిల అందుకనుగుణంగానే పార్టీ పెట్టబోతున్నారు. ఇప్పటికే జిల్లాల వారీగా కొనసాగుతున్న భేటీలలో వివిధ జిల్లాల నుంచి వచ్చిన నేతలతో సమావేశం అవుతున్నారు.వివిధ రంగాలు , సంఘాలు , సెలబ్రిటీలు ఆమెను కలిసి తమ మద్దతు తెలుపుతున్నారు. ఆమె పార్టీ వెనక ఎవరున్నారు. ఆమె ఎవరి వదిలిన బాణం అనేదానిపై ఇంకా రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి . కొన్నిమీడియా సంస్థలు ఆమెకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నాయనే అభిప్రాయాలూ ఉన్నాయి. అయితే అదెలా ఉన్న ఆమె పార్టీ ప్రకటనపై వైయస్ అభిమానుల్లో హర్షతి రేఖలూ వ్యక్తం అవుతున్నాయి. వరంగల్ సమావేశం తరువాత , కరీంనగర్ , నిజామాబాద్ జిల్లాల నేతలతో సమావేశం అవుతారని ఆమె సన్నిహితులు అంటున్నారు . షర్మిలను కలిసేందుకు వచ్చే వారితో లోటస్ పాండ్ లోని ఆమె నివాసం నిత్యం ప్రజల రద్దీతో కిటకిట లాడుతుంది.పార్టీ జెండా లో ఉండే రంగుల పై ,ఒక క్లారిటీ కి వచ్చారు.అందులో ఆకుపచ్చ, నీలం , తెలుపు రంగులు ఉండేలా చూస్తున్నారు.గుర్తు, పార్టీ విధివిధానాల పై నిర్ణయానికి రావాల్సిఉంది. దీనిపై ఇంకా కసరత్తు జరుగుతున్నట్లు తెలుస్తుంది . ప్రధానంగా రైతులు ,మహిళలు, యువకుల, విద్యార్థులు , కార్మికులను దృష్టులో పెట్టుకొని విధానాల రూపకలాపన చేయనున్నట్లు సమాచారం. పార్టీ నియమ నిబంధనలు కూడా రూపొందించారు. ఆ నిబంధనలతోనే పార్టీ ని ఎన్నికల సంఘం దగ్గర రిజిస్టర్ చేయించుకున్నట్లు తెలుస్తుంది. పార్టీ ప్రకటన ఏప్రిల్ 9 న ఖమ్మం లో జరిగే సభలో ప్రకటిస్తారని తెలుస్తుంది . ఆమె 2023 ఎన్నికల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ద పడుతున్నారు. ఖమ్మం లేదా హైద్రాబాద్ లనుంచి పోటీచేసే ఆవకాశాలు ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. ఖమ్మం లో భారీ బహిరంగ సభ ద్వారా పార్టీ సత్తా చాటాలనే ఉద్దేశంతో ఉన్నారు. లక్షమందికి పైగా ప్రజలను సమీకరించాలని ఖమ్మం జిల్లా నేతలతో షర్మిల అన్నట్లు సమాచారం. పార్టీ ప్రకటన పై సీరియస్ గానే పని జరుగుతున్నట్లు షర్మిల అభిమానులు పేర్కొంటున్నారు. అయితే ఇప్పటి వరకు పేరున్న నాయకులూ ఎవరు రాకపోయినా వారు ఆమె పార్టీకి ప్రజలలో ఉండే ఆదరణ గురించి ఆరా తీస్తున్నారు. ఆమె ఒక పక్క పెద్దనేతలకోసం ప్రయత్నాలు ప్రారంభిస్తూనే కొత్త తరం నాయకులను ప్రమోట్ చేయాలనే ఆలోచనతో ఉన్నట్లు ఆమె కదలికలు తెలియజేస్తున్నాయి.

 

 

Related posts

ఔరంగాబాద్‌ పేరు మార్పు …ఇక నుంచి శంభాజీ నగర్ రాష్ట్ర క్యాబినెట్ నిర్ణయం!

Drukpadam

ఏపీ రాజకీయాల్లో కౌన్సిలర్ కూడా బెదిరించేవాడే!: పవన్ కల్యాణ్

Ram Narayana

తిరుపతి రుయా ఆసుపత్రి వద్ద నిరసన … అడ్డుకున్న పోలీసులు…

Drukpadam

Leave a Comment