ఏపీ నుంచి రాజ్యసభ కు నలుగురు వైసీపీ సభ్యులకు అవకాశం !
-జూన్ లో టీడీపీకి చెందిన ఇద్దరు .ఒక బీజేపీ…వైసీపీ కి చెందిన విజయసాయి రిటైర్
-వారి స్థానంలో నలుగురు వైసీపీ సభ్యులు రాజ్యసభకు
-విజయసాయికి మళ్ళీ ఛాన్స్ …బీజేపీ అధిష్టానం ఒకపేరు సూచించనున్నదా?
-సినీనటుడు మోహన్ బాబు కు రాజ్యసభ అంటూ ప్రచారం
-పరిశీలనలో వైవి సుబ్బారెడ్డి , ఒక బీసీ ,ఒక ఎస్సీ
జూన్ లో ఏపీ కి చెందిన నలుగురు రాజ్యసభ సభ్యులు రిటైర్ కానున్నారు.వారిలో ఇద్దరు టీడీపీ నుంచి బీజేపీ లో చేరిన సుజనాచౌదరి , టీజీ వెంకటేష్ లు ఉన్నారు. వారు కాకా బీజేపీకి చెందిన సురేష్ ప్రభు , వైసీపీ కి చెందిన ఆ పార్టీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి ఉన్నారు. వీరిలో విజయసాయిరెడ్డి తిరిగి ఎన్నికయ్యే అవకాశం ఉంది. మిగతా ముగ్గురు ప్రస్తుతం బీజేపీ లో ఉన్నారు. బీజేపీకి ఇక్కడ రాజ్యసభకు పంపే బలం లేదు . అందువల్ల వైసీపీ ఎవరిని ఎంపికచేస్తే వారు సునాయాసంగా రాజ్యసభకు వెళ్లడం ఖాయంగా ఉంది. దీనితో విజయసాయి కాకుండా మిగతా ముగ్గురు ఎవరు అనేది చర్చనీయాంశంగా మారింది. సినీనటుడు మోహన్ బాబు పేరు ప్రచారంలో ఉంది. ఇటీవల చిరంజీవి పేరు కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరిగిన దాన్ని చిరంజీవి ఖండించారు. దీంతో రేసులో ఆయన లేరు . కానీ రాజకీయాల్లో ఏదైనా జరిగే అవకాశం లేకపోలేదని అభిప్రాయాలు ఉన్నాయి. మోహన్ బాబు ను రాజ్యసభకు పెంపడం వల్ల వచ్చే ప్రయోజనం ఏమిటని వైసీపీ శ్రేణులు వ్యక్తం చేస్తున్నాయి.అయితే మోహన్ బాబు ఎన్నికల్లో వైసీపీ కండువా కప్పుకుని ప్రచారం చేశారు . పైగా రాజశేఖర్ రెడ్డి అభిమాని , ఇప్పటికి ఆయనకు వైసీపీ అనే ముద్ర ఉంది. పైగా కమ్మ సామాజికవర్గానికి చెందిన వారు . అందువల్ల ఆకోటాలో అవకాశం ఉండవచ్చునని అంటున్నారు. మోహన్ బాబు కు ఇవ్వకపోతే మర్రి రాజశేఖర్ కు ఇచ్చే అవకాశం ఉండనే అభిప్రాయాలు ఉన్నాయి. మరో రెండు స్తనాల నుంచి బీసీ ,ఎస్సీ లేదా ఎస్టీ , ముస్లిం మైనార్టీ నుంచి ఎంపిక చేసే అవకాశాలు తోసిపుచ్చలేమని అంటున్నారు. బీజేపీ నుంచి సురేష్ ప్రభు గతంలో టీడీపీ మద్దతుతో రాజ్యసభకు వెళ్లారు .అయితే ఇప్పుడు కూడా తిరిగి బీజేపీ ఒకసీటు కోరే అవకాశం ఉందా? బీజేపీ కి , వైసీపీకి కూడా సంబంధాలు సరిగా లేవు . పైగా ఏపీలో బీజేపీ వైసీపీ పాలనపై వంటికాలుతో లేస్తుంది.అందువల్ల బీజేపీకి జగన్ అవకాశం ఇస్తారా ? అనే సందేహాలు కూడా ఉన్నాయి. అన్ని సామాజికవర్గాలు న్యాయం చేయాలనీ ఆలోచనతో ఉన్న సీఎం జగన్ ఎస్సీ , ఎస్టీల నుంచి ఇంతవరకు రాజ్యసభకు వైసీపీ పంపలేదు .మైనార్టీ లు కూడా లేరు . అందువల్ల ఆసామాజికవర్గాలనుంచి రాజ్యసభ సభ్యులను పంపితే రాజకీయంగా తమకు ఉపయోగం ఉంటుందని ఆలోచన కూడా వైసీపీ కి ఉంది. జూన్ నాటికీ మూడు సంత్సరాలు పూర్తీ చేసుకోబోయో జగన్ ప్రభుత్వం ప్రతి ఎంపికను ఆచితూచి ఇస్తుందనడంలో సందేహం లేదు …..