Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

ఈనెల 24 న కాంగ్రెస్ గూటికి డి.శ్రీనివాస్ …

ఈనెల 24 న కాంగ్రెస్ గూటికి డి.శ్రీనివాస్ …
-హస్తానికి పూర్వవైభవం వచ్చేనా?
-ఎంపీ పదవికి రాజీనామా …టీఆర్ యస్ కు గుడ్ బై
-సోనియా సమీక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకోనున్న డీ ఎస్
-ఈ కార్యక్రమంలో పాల్గొన నున్న పలువురు రాష్ట్ర కాంగ్రెస్ నేతలు

గత కొన్ని రోజులుగా టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యులు డి.శ్రీనివాస్ మళ్లీ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారంటూ వ‌స్తున్న వార్తలు నిజం కాబోతున్నాయి. ఇప్పటికే దీనిపై అధిష్టానంతో కూడా చర్చలు జరిపారు. ఈనెల 24న కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ముహూర్తం ఫిక్స్ చేసుకున్నారు. ఢిల్లీలో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ సమక్షంలో చేరాలని డీఎస్ నిర్ణయం తీసుకున్నారు. హస్తం కండువా కప్పుకోక ముందే తన ఎంపీ పదవికి రాజీనామా చేయనున్నారు.

టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యులు డి.శ్రీనివాస్ ఈనెల 24న కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. ఢిల్లీలో పార్టీ అధినేత్రి సోనియాగాంధీ సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు. ఈ విషయాన్ని కాంగ్రెస్ పార్టీ నేతలు తెలిపారు. పార్టీలో చేరికపై ఇప్పటికే అధిష్టానంతో డీఎస్ పలుసార్లు చర్చలు జరిపారు. డీఎస్ రాకతో కాంగ్రెస్ పార్టీ మరింత బలపడుతుందని పేర్కొంటున్నారు. పార్టీలో చేరిక ముందే టీఆర్ఎస్ పార్టీ ద్వారా వచ్చిన రాజ్యసభ పదవికి రాజీనామా చేయనున్నారు.

కాంగ్రెస్ పార్టీలో 1989 నుంచి 2015 జులై వరకు డీఎస్ సుధీర్ఘంగా పని చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పలు కీలక పదవులు అనుభవించారు. పిసీసీ అధ్యక్షులుగా ఉండిన రెండు సార్లు కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు తీవ్రంగా కృషిచేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా ఆయన కాంగ్రెస్‌లోనే ఉన్నారు. అయితే టీ-కాంగ్రెస్‌లో జరిగిన పరిణామాలతో ఆ పార్టీకి రాజీనామా చేశారు. తర్వాత 2015 జూలై 8న సీఎం కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు.

టీఆర్ఎస్ పార్టీలో చేరిన డి.శ్రీనివాస్‌ను రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులుగా సీఎం కేసీఆర్ నియమించారు. తర్వాత రాజ్యసభ పదవిని కట్టబెట్టారు. అయితే నిజామాబాద్ జిల్లాకు చెందిన టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు ఆయనకు వ్యతిరేకంగా సీఎం కేసీఆర్‌కు ఫిర్యాదు చేశారు. దీనిపై వివరణ ఇచ్చేందుకు డీఎస్ అనేక సార్లు ప్రయత్నించారు. అయినా డీఎస్ కు కేసీఆర్ అపాయింట్ మెంట్ ఇవ్వకుండా దూరంగా పెట్టారు. అప్పటి నుంచి పార్టీ గులాబీ పార్టీకి దూరంగా ఉంటున్నారు డీఎస్..

నిజామాబాద్‌లో కేసీఆర్ కూమార్తె ఓటమికి డీఎస్ కారణమని టీఆర్ఎస్ నేతలు ఆయనపై గుర్రుగా ఉన్నారు. అధిష్టానికి కూడా ఫిర్యాదులు చేశారు. 2019లో జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో తన తనయుడు అర్వింద్ గెలుపు వెనుక డీఎస్ హస్తం ఉందని జోరుగా ప్రచారం నెలకొంది. తన రాజ్యసభ పదవికి ఈ ఏడాది జూన్ వరకు టైమ్ ఉంది. డీఎస్ పార్టీకి దూరంగా ఉన్న నేపథ్యంలో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ .. అదే జిల్లా నుండి మాజీ స్పీకర్ కేఆర్ సురేష్ రెడ్డికి రాజ్యసభ పదవిని కట్టబెట్టారు.

నిజామాబాద్‌లో కేసీఆర్ కూమార్తె ఓటమికి డీఎస్ కారణమని టీఆర్ఎస్ నేతలు ఆయనపై గుర్రుగా ఉన్నారు. అధిష్టానికి కూడా ఫిర్యాదులు చేశారు. 2019లో జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో తన తనయుడు అర్వింద్ గెలుపు వెనుక డీఎస్ హస్తం ఉందని జోరుగా ప్రచారం నెలకొంది. తన రాజ్యసభ పదవికి ఈ ఏడాది జూన్ వరకు టైమ్ ఉంది. డీఎస్ పార్టీకి దూరంగా ఉన్న నేపథ్యంలో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ .. అదే జిల్లా నుండి మాజీ స్పీకర్ కేఆర్ సురేష్ రెడ్డికి రాజ్యసభ పదవిని కట్టబెట్టారు.

అయితే డి.శ్రీనివాస్ తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరికపై ఆ పార్టీ నేతల్లో భిన్నాభిప్రాయలు వ్యక్తం అవుతున్నాయి. పార్టీని కష్టకాలంలో పార్టీని వదిలేసి వెళ్లారని పేర్కొంటున్నారు. కానీ మరికొందరు నేతలు డీఎస్ రాకను స్వాగతిస్తున్నారు. పార్టీకి పూర్వవైభవం తీసుకొచ్చేందుకు దోహదపడుతుందని పేర్కొంటున్నారు. గతంలోనూ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కూడా డీఎస్‌ను కలిసి పార్టీలోకి ఆహ్వానించారు. ఆయన చేరిక పలుమార్లు వాయిదా పడుతూ వచ్చింది. చివరకు ఈనెల 24న కాంగ్రెస్ పార్టీలో చేయాలని డిసైడ్ అయ్యారు .

Related posts

జన జాతరను తలపిస్తున్న భట్టి పాదయాత్ర!

Drukpadam

బీఆర్ యస్, కామ్రేడ్ల పొత్తు  కసరత్తు కొలిక్కి వచ్చేనా … …?

Drukpadam

కేసీఆర్ పెట్టిన కులాల కుంపటిని బీజేపీ అందిపుచ్చుకుంది: రేవంత్ రెడ్డి

Drukpadam

Leave a Comment