లైబీరియా చర్చిలో విషాదం.. తొక్కిసలాటలో 29 మంది దుర్మరణం!
- రాత్రి వేడుక సమయంలో దుర్ఘటన
- మారణాయుధాలతో ప్రవేశించిన దోపిడీ ముఠా
- భయంతో పరుగులు తీసిన ప్రజలు
లైబీరియా రాజధాని మొనోర్వియాలోని ఒక చర్చిలో విషాదం చోటు చేసుకుంది. తొక్కిసలాటలో 29 మంది మరణించారు. బుధవారం రాత్రి ఈ ఘటన జరిగింది. రాజధాని శివారులోని న్యూక్యూటౌన్ లో పెంతెకొస్తల్ చర్చ వద్ద రాత్రి వేడుక సమయంలో దోపిడీ ముఠా మారణాయుధాలతో ప్రవేశించినట్టు ప్రత్యక్ష సాక్షి కథనం. దీంతో అక్కడున్న వారు భయంతో పరుగులు తీశారు.
ఈ క్రమంలో కొందరు కింద పడిపోగా, మిగిలిన వారు వారిని తొక్కుకుంటూ వెళ్లారు. ఈ తొక్కిసలాటలో 29 మంది ప్రాణాలు కోల్పోయారు. కొంత మంది పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు ప్రకటించారు. లైబీరియాలో దోపిడీ ముఠాలు వేడుకలను లక్ష్యంగా చేసుకోవడం అక్కడ సాధారణమే.