Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

ఖమ్మం జిల్లా టీఆర్ యస్ అధ్యక్షుడిగా తాతా మధు… ఎవరి ఛాయస్ …

ఖమ్మం జిల్లా టీఆర్ యస్ అధ్యక్షుడిగా తాతా మధుఎవరి ఛాయస్
ఇటీవలనే ఎమ్మెల్సీగా ఎన్నికఇప్పుడు అధ్యక్షుడు డబల్ ధమాఖా
ఖమ్మం జిల్లా రాజకీయాల్లో నూతన శకం
మధు మారుస్తాడా ….మారతాడా
సీఎం కేసీఆర్ లుక్స్ లో గుడ్ బాయ్

ఖమ్మం జిల్లా టీఆర్ యస్ లో హేమాహేమీలు ఉన్నారు .వారినందరిని పక్కన బెట్టి ఖమ్మం జిల్లా రాజకీయాలతో కొద్దికాలంగా మాత్రమే పరిచయమున్న తాతా మధును జిల్లా అధ్యక్షుడిగా నియమించడం ఆశ్చర్యకరమే ! తాతా మధు ఎవరి ఛాయస్ సీఎం కేసీఆర్ దేనా లేక కేటీఆర్ దా? జిల్లా మంత్రి దా ? ఎంపీ దా ? పల్లా దా? అనే ఆశక్తికర చర్చ జరుగుతుంది. ఎవరికీ తగ్గట్లు వారు వాదనలు వినిపిస్తున్నారు . మధు సన్నిహితులు మాత్రం సీఎం కేసీఆర్ ఛాయస్ అంటున్నారు .సీఎం కేసీఆర్ ఖమ్మం జిల్లా భవిష్యత్ లీడర్ గా ఫోకస్ చేయబోతున్నారా ? అంటే కొట్టి పారేయలేము అంటున్నారు పరిశీలకులు . ఇప్పడు జిల్లాలో మంత్రి అజయ్ , ఎంపీ నామా ,తాతా మధు లు ఒకే సామాజికవర్గానికి చెందినవారు కావడం పై కూడా చర్చజరుగుతోంది. అసలు ఆయన్ను స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా కేసీఆర్ పోటీకి నిలుపుతాడని చాలామంది ఉహించి ఉండరు . కానీ అదిజరిగింది. ఇప్పుడు జిల్లాపార్టీలకు అధ్యక్షులను ప్రకటించారు. అందులో ఖమ్మం నుంచి తాతా మధు పేరు ప్రకటించారు. ఇటీవలనే స్థానిక సంస్థలకు జరిగిన ఎన్నికల్లో ఆయన ఖమ్మం నుంచి ఎమ్మెల్సీ గా ఎన్నికైయ్యారు . దీంతో కొద్దికాలంలోనే మధుకు డబుల్ ధమాకా లభించినట్లు అయింది. దీంతో పెద్ద నాయకులు మరోసారి కంగు తిన్నారు. తాతా మధు ఎవరి ఛాయస్ అనేది చర్చనీయాంశంగా మారింది. ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలోనే మధును అభ్యర్థిగా నిర్ణయించేటప్పుడు మధు కార్యదీక్ష , పట్టుదల , నిర్మాణం పై సీఎం కేసీఆర్ మధు గొప్పతనాన్ని ప్రశంసిస్తూ చాలామంచిగా కామెంట్ చేశారని ప్రచారం జరిగింది. అందువల్ల కచ్చితంగా మధు సీఎం కేసీఆర్ ఛాయస్ అయిఉంటుందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. జిల్లా మంత్రి ఛాయస్ గా ప్రస్తుతం టీఆర్ యస్ ఖమ్మం జిల్లా కార్యదర్శిగా పనిచేస్తున్న ఆర్జేసీ కృష్ణ ఉన్నారు. అందరు మంత్రి అండదండలు ఉన్నందున ఆయనకు జిల్లా అధ్యక్ష భాద్యతలు అప్పగిస్తారని భావించారు. ఆయన కాకపోతే ఖమ్మం నగర మాజీ అధ్యక్షుడు కమర్తపు మురళి మంత్రి ఛాయస్ గా అనుకున్నారు . కానీ అందుకు విరుద్ధంగా మధు పేరు రావడం కంగు తినిపించింది.ఆర్జేసీ సైతం జిల్లా అధ్యక్ష పదవిపై గంపెడు ఆశతో ఉన్నారు. అది దక్కకపోవడంతో నిరాశ చెందారు .

ఒకే సామాజికవర్గానికి అన్ని పదవులా?

ఖమ్మం జిల్లాలో ఒకే సామాజికవర్గానికి చెందిన మంత్రి పువ్వాడ , ఎంపీ నామా ఉండగా స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా అదే సామాజికవర్గానికి చెందిన తాతా మధు ను చేశారు .ఇది ఒకరకంగా మిగతా సామాజికవర్గాలలో అసంతృప్తికి దారితీసింది. ఇది ప్రజల మనస్సులో నుంచి తొలగక ముందే తిరిగి టీఆర్ యస్ జిల్లా అధ్యక్షుల నియామకం అందులో ఖమ్మం జిల్లా నుంచి తాతా మధు పేరు ప్రకటించడం పై సామజిక సమీకరణాల్లో తేడా కనిపిస్తుందనే అభిప్రాయాలు కలుగుతున్నాయి.

Related posts

సిరిసిల్ల జిల్లాలో కేటీఆర్ కు నిరసన సెగ…!

Drukpadam

క‌రోనా థ‌ర్డ్ వేవ్‌పై ప్ర‌ధాని మోదీ స్పంద‌న‌…

Drukpadam

లాలూతో కేసీఆర్ భేటీ… ఆర్జేడీ అధినేత ఆరోగ్యంపై ఆరా!

Drukpadam

Leave a Comment