Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

రాజధానిపై నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వానిదే!: కేంద్రం

రాజధానిపై నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వానిదే!: కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌క‌ట‌న
ప్రస్తుతానికి అమరావతే ఏపీ రాజధాని..
జీవీఎల్ ప్ర‌శ్న‌కు కేంద్రం స‌మాధానం
ఏపీ రాజ‌ధాని ఏద‌ని ప్ర‌శ్న‌
3 రాజ‌ధానుల‌పై ఏపీ స‌ర్కారు వెన‌క్కి తగ్గినట్టు తమ దృష్టికి వచ్చిందన్న కేంద్రం
రాజ్య‌స‌భ‌లో నిత్యానంద‌రాయ్ స‌మాధానం

ఏపీలో రాధాదాని విషయంలో క్లారిటీ లేదని రాజధాని ఏది అని బీజేపీకి చెందిన జీవీఎల్ నరసింహారావు రాజ్యసభలో ప్రశ్నించారు . దానికి సమాధానంగా కేంద్ర హోమ్ శాఖ సహాయమంత్రి నిత్యానందరాయ్ సమాధానమిస్తూ ప్రస్తుతానికి అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధాని .రాజధాని ఎక్కడ ఉండాలి అనేది రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని అంశం .మూడు రాజధానుల విషయంలో ఏపీ ప్రభుత్వం వెనక్కు తగ్గినట్లు ఉందని విన్నాం . ఏదైనా రాష్ట్ర రాజధాని ఎక్కడ ఉండాలని నిర్ణయించేది కేంద్రం కాదు .రాష్ట్ర ప్రభుత్వం మంత్రమేనని మరో మరు స్పష్టం చేశారు.

ఇంతకీ ఏపీ రాజధాని ఏదని, ఆ విష‌యాన్ని నిర్ణయించే అధికారం ఎవరిదని కేంద్ర ప్ర‌భుత్వం స్పష్టత ఇవ్వాలని రాజ్యసభలో బీజేపీ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు ప్ర‌శ్నించారు. రాజధానిపై గందరగోళం నెలకొని ఉందని.. స్పష్టత ఇవ్వాలని కేంద్రాన్ని కోరారు. దీంతో కేంద్రం దానిపై స‌మాధానం చెప్పింది. ప్రస్తుతానికి అమరావతే ఏపీ రాజధాని అని హోంశాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్ తెలిపారు.

రాజధానిపై నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వానిదేన‌ని, త‌మ‌ దగ్గరున్న సమాచారం ప్రకారం ఏపీకి రాజధాని అమరావతే అని వ్యాఖ్యానించారు. ఏపీలో మూడు రాజ‌ధానుల‌పై ఏపీ స‌ర్కారు వెన‌క్కిత‌గ్గిన‌ట్లు త‌మ‌ దృష్టికి వ‌చ్చిందని ఆయ‌న చెప్పారు. కాగా, ఏపీలో మూడు రాజ‌ధానులు ఏర్పాటు చేస్తున్న‌ట్లు ఏపీ ప్ర‌భుత్వం స్పష్టం చేయ‌డంతో అమరావతినే రాజ‌ధానిగా కొన‌సాగించాల‌ని కొన్ని నెలలుగా రాజధాని రైతులు ఉద్యమం చేస్తోన్న విష‌యం తెలిసిందే.

Related posts

‘చంద్రబాబు డైనమిక్’ అంటూ తడబడి.. సవరించుకున్న స్పీకర్ తమ్మినేని!

Drukpadam

సీఎం కేసీఆర్​ పెట్టిన మునుగోడు ‘మెజారిటీ’ పరీక్షలో మంత్రుల ప్రోగ్రెస్​ రిపోర్టు!

Drukpadam

రాహుల్ సిప్లిగంజ్ ఆస్కార్ గెలిస్తే… కేసీఆర్ సర్కారు నిరాశపరిచింది: రేవంత్ రెడ్డి…

Drukpadam

Leave a Comment