Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

ఎమ్మెల్సీ ఎన్నికలో విజేతను నిర్ణయించే విధానం

నల్లగొండ,ఖమ్మం,వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక ఉత్కంఠగా మారింది దీంతో విజేతను ఎలా నిర్ణయిస్తారనే సందేహం కలుగుతుంది.

ఇది ఒక అంచనా మాత్రమే . నాలుగు రౌండ్ల ఓటింగ్ సరళిని పరిశీలిస్తే అభ్యర్థులకు పడుతున్న ఓట్లు, చెల్లని ఓట్లు ప్రతీ రౌండ్ లోనూ ఇంచుమించు ఒకే రకంగా ( స్వల్ప తేడాలతో) వున్నాయి. 7 రౌండ్ల కౌంటింగ్ తర్వాత కూడా ఏ అభ్యర్ధీ విజయానికి కావల్సిన సుమారు 1,82,000 ఓట్లు పొందే పరిస్థితి లేదు. అనివార్యంగా రెండో ప్రాధాన్యత ఓట్లను 71 మంది లో 68 మందిని ఎలిమినేట్ చేసి లెక్కించినా కూడా విజయం సాధించడం కష్టం. ఇదే నాలుగు రౌండ్ల ట్రెండ్ కంటిన్యూ అయితే తప్పక ఎలిమినేట్ అయ్యే వారి ( అతి తక్కువ ఓట్లు వచ్చిన 63 మందితో పాటు, గణనీయంగా ఓట్లు పొందిన ఐదుగురు జయసారధి, రాణి రుద్రమ, సుధాకర్, ప్రేమేందర్, రాములు నాయక్) రెండో ప్రాధాన్యత ఓట్లు కీలకం గా మారనున్నాయి. వీరు ఐదుగురి కి కలిపి వచ్చే సుమారు 95,000 ఓట్లలో రెండో ప్రాధాన్యత ఓట్లు ముగ్గురు అభ్యర్థులు- పల్లా, మల్లన్న, కోదండరాం లలో ఎవరో ఒకరికి ఏకపక్షంగా పడితే తప్ప వారు కూడా విజయం దరిదాపుల్లోకి వెళ్ళడం సాధ్యం కాదు. ఒకవేళ ముందే ఎలిమినేట్ అయ్యే పై ఐదుగురి ఓట్లు ఎక్కువ గా మల్లన్న, కోదండరాం లకు, కొంతమేరకు పల్లాకు పడే అవకాశం ఉందని అనుకున్నా, ఆ ముగ్గురి మధ్య NECK & Neck Contest ఏర్పడే అవకాశం ఉన్నది. ఈ పరిస్థితులలో 71 మందిలో చివరి నుండి 68 మంది ఎలిమినేట్ కావడం తథ్యం గా వున్నది. చివరి వరకూ మిగిలే ముగ్గురి మధ్యే విజయలక్ష్మి దోబూచులాడే అవకాశం ఉంది. ఇందులో కూడా పల్లా/ మల్లన్న / కోదండరాం లలో ఎవరు ఎలిమినేట్ అవుతారు లేదా మల్లన్న, కోదండరాం ల రెండవ ప్రాధాన్యత ఓట్లు ఎవరికి పడతాయనే దానిపై విజయం ఆధారపడి ఉంటుంది. రెండో ప్రాధాన్యత ఓట్లు ఏకపక్షంగా ఎవరో ఒకరికి ఎక్కువగా పడితే తప్ప, పల్లా, మల్లన్న, కోదండరాం లలో ఎవరో ఒకరు ఎలిమినేట్ అవక తప్పదు. చివరి ఇద్దరిలో కోటా ఓట్లు (సుమారు1,82,000) ఎవరూ పొందలేక, చివరికి మిగిలిన ఇరువురిలో అధిక ఓట్లు పొందిన వారు సాధారణ మెజారిటీతో గెలిచే పరిస్థితి కనిపిస్తోంది.

Related posts

తాలిబన్లు హెలికాప్టర్​ నుంచి వ్యక్తిని వేలాడదీశారంటూ వచ్చిన ఆ వార్త ఫేక్​ అట!

Drukpadam

భారత్ దేశం వారిదే కాదు నాకుకూడా చెందుతుంది …. జమియత్ ఉలేమా చీఫ్!

Drukpadam

సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న ఇకలేరు …

Drukpadam

Leave a Comment