బీజేపీ ని తరిమి కొట్టకపోతే దేశం ఆగం,ఆగం ….బీజేపీపై కేసీఆర్ నిప్పులు!
-ఇందుకు అన్ని శక్తులు ఏకం కావాలి
-అన్ని రంగాల్లో బీజేపీ పాలన విఫలం
-సంపద కొద్దీ మంది చేతుల్లో పెట్టిన ఘనత బీజేపీదే
-దొంగలను దేశం దాటించారు …వారు లండన్ లో తలదాచుకున్నారు
-సంస్కరణల పేరుతొ పేదలపై భారాలు వేస్తున్నారు
-రాజ్యాంగానికి దళిత సంఘాలకు సంబంధం ఏమిటి ?
దేశంలో బీజేపీ లో పాలన తరిమి కట్టకపోతే దేశం ఆగం ఆగం అవుతుందని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అన్నారు . ఆదివారం సాయంత్రం ప్రగతిభవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీజేపీ విధానాలపై నిప్పులు చెరిగారు . దేశానికి మోడీ పాలన శరాఘాతం అని పేర్కొన్నారు. బీజేపీని తరిమి కొట్టేందుకు అన్ని శక్తులు ఏకం కావాలని పిలుపు నిచ్చారు. దేశంలో మార్పు కోసం శాంతి యుతంగానే పోరాడాలని అన్నారు. మనకు జాతీయ నాయకులూ అంబెడ్కర్ , మహాత్మాగాంధీ , సుభాష్ చంద్రబోస్ లాంటి వారు చేసిన పోరాటాలను కేసీఆర్ గుర్తు చేశారు . మార్పు కోసం శాంతి పూర్వకంగానే వెళ్లాలని అన్నారు . దేశంలో అనేక రాష్ట్రాల నాయకులూ , ముఖ్యమంత్రులు తనకు టచ్ లో ఉన్నారని చెప్పారు . త్వరలో మమతా బెనర్జీ హైద్రాబాద్ వస్తున్నారని ,తాను మహారాష్ట్ర సీఎం కలిసేందుకు ముంబై వెళతానని తెలిపారు . దేశంలో సంపదను కొద్దీ మాది చేతుల్లో పెట్టి పేదలను మరింత పేదలను చేస్తున్నారని దుయ్యబట్టారు .
దేశంలో 4 లక్షల మెగావాట్స్ విద్యుత్ అదనంగా ఉంది. ….40 కోట్లా దళితులకు బడ్జెట్ ఎంత కేవలం 12 కోట్లా ? …బడ్జెట్ ప్రజలకు ఉపయోగంగా లేదు .దేశాన్ని నడిపే పద్దతి మంచిగా లేదు . ప్రజలను బీజేపీ గోల్ మాల్ చేస్తుంది .అన్నిటిని అమ్ముతున్నారు. పబ్లిక్ రంగ సంస్థలన్నీ అమమకానికి పెట్టారు . ప్రవేట్ వాడి చేతిలోకి పోయాక అందరికి ఇబ్బందే … వాడి దయ మీద ఆధారపడాల్సిందే అని కేసీఆర్ అన్నారు . ….మొత్తం కార్పొరేటీకరణ … ప్రధానివి అన్ని గోల్ మాల్ మాటలే ……ఎవరిని పిచ్చోళ్ళని చేయడానికి అబద్దాలు ఆడుతున్నారని అని నిలదీశారు .
విద్యుత్ సంస్కరణలు తెస్తే పేదలకు సబ్సిడీలు ఇవ్వలేము …
బీజేపీ పాలనా నాశనం అయింది. అవినీతి కంపు తో ఉంది. .. ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారు . నిరుద్యోగం పెరిగిపోతుంది .పరిశ్రమలు మూత పడుతున్నాయి. 77 శాతం సంపద 10 శాతం చేతుల్లో ఉంది. 23 శాతం సంపద మాత్రమే 90 శాతం మంది దగ్గర ఉంది. ధనవంతులు మరింత ధనవంతులు అవుతున్నారు . పేదలు మరింత పేదల అవుతున్నారు . ఇవి అన్ని ఎం ఓ సి లెక్కలే .. నిరుద్యోగం పెరిగింది. ఆకలి లో మనదేశం 101 స్థానాల్లో ఉంది … 16 లక్షల పరిశ్రమలు మూతపడ్డాయి. ఇది మోడీ ఆదర్శ పాలనకు నిదర్శనమని విమర్శలు గుప్పించారు . …పరిశ్రమల ఉత్పత్తి దెబ్బతిన్నది . ..4 . 4 శాతం నుంచి 0 . 4 శాతానికి పడి పోయింది. బీజేపీ వాట్స్ అప్ యూనివర్సిటీ లో మాత్రం దేశం ప్రగతి లో దూసుకుపోతోందని తప్పుడు ప్రచారంలో చేస్తుందని దుయ్యబట్టారు .
బ్యాంకు లను లూటీ చేసే గజ దొంగలులకు అండగా కేంద్రం ఉంటుంది. సంస్కరణలు అంటూ పేదలకు సబ్సిడీలు వద్దని అంటున్నారు . 33 మంది బ్యాంకు లను ముంచారు . వారు లండన్ పోయి ఉండేందికు టికెట్స్ కొని ఇచ్చారు . 15 లక్షలు ప్రతి ఖాతాలో వేస్తామని అన్నారు . ఎక్కడ వేశారు ఎవరి ఖాతాలో వేశారో చెప్పాలని డిమాండ్ చేశారు .
విజయ మాల్యా , నిరవ్ మోడీ , చోక్సి లాంటి దోపిడీ దొంగలను వదిలి …నన్ను జైల్లో వేస్తారా వేయండి …దమ్ముంటే వేయండి ..అంటూ కేసీఆర్ సవాల్ విసిరారు ..
సిగ్గులేని పార్టీ బీజేపీ ..గెలవకపోయిన ,పరిపాలిస్తాం పరిపాటిగా మారింది .కర్ణాటక , మధ్యప్రదేశ్ గోవా , మణిపూర్ , మహారాష్ట్ర గెలవలేదు కానీ అధికారంలోకి వచ్చేందుకు దొడ్డి దార్లు వెతుకున్నది . మహారాష్ట్రలో దొడ్డి దారినపోతే కర్రు కాల్చి వాత పెట్టారు నిజామా కదా ? .ఓటమిని అంగీకరించే సహనం ఉండాలి …గెలిస్తే గర్వం …ఓడితే అసహనం …ఇప్పుడు బీజేపీ గొడ్డలి భుజాన పెట్టుకొని తిరుగుతుంది. యూపీ ఎన్నికలు అయిపోగానే పెట్రోల్ రేట్లు పెంచుతుంది. ఏమాత్రం మర్యాద లేని పార్టీ … అప్రజాస్వామికంగా ,వ్యవహరిస్తోంది. ఇది అధికారంలో ఉంటె ప్రజలకు ,ప్రజాస్వామ్యానికి నష్టం . దీన్ని పారదోలాలి అందుకు ప్రజలు సహకరించాలని అన్నారు
రఫెల్ డీల్ రాహుల్ గురించి రాహుల్ గాంధీ మొత్తుకున్నాడు .మేము కూడా సుప్రీం కోర్ట్ లో కేసు వేస్తాం …రాహుల్ గాంధీ మాట్లాడితే ఆయనపై విమర్శలు చేస్తున్నారు .మలేషియా కూడా రఫెల్ యుద్ధ విమానాలు కొన్నది .కానీ రేటు మనకన్నా తక్కువకు ధరకు కొన్నది ఇది మన తెలివి అని ఎద్దేవా చేశారు ….ఎవరు దొంగ …ఎవరు జైలుకు పోవాలి … ఇవి అన్ని కఠోరా సత్యాలు కదా ? అని ప్రశ్నించారు .
మోడీ అమెరికాలో ప్రసంగం …వేల అబద్దాలు … ట్రాంప్ కోసం ప్రచారం చేసి మోడీ అతి పెద్ద తప్పు చేశారు . అమెరికా ఎన్నికలంటే అహమ్మదాబాద్ మున్సిపల్ ఎన్నికలా? ఏ ప్రధాని అయినా విదేశీ ఎన్నికల్లో ప్రచారం చేస్తారా ? ఇది ఎలాంటి రాజనీతి , ఏమి సందేశం ఇవ్వాలని అనుకున్నారు . మనదేశం పరువు పోలేదా ?సిగ్గు పడాలి .
40 కోట్ల మంది దళితులకు బడ్జెట్ లో కేవలం 12 వేల కోట్లేనా ? దళితులను ఉద్ధరిస్తాం అని అధికారంలోకి వచ్చిన బీజేపీ వారికీ నిధుల కేటాయింపులో తగిన న్యాయం చేసిందా అంటే లేదు . ఈ బడ్జెట్ దేశంలో ౪౦ కోట్ల మంది దళితులు ఉంటె కేవలం 12 వేల కోట్లేనా ? ఇదెక్కడి న్యాయం అని నిలదీశారు .
కర్ణాటక లో ఏమి జరుగుతుంది. … మత కలహాలు పెడతావా ? ఇదేనా మీ రాజకీయం … మనది లౌకిక రాజ్యం …అన్ని మతాలు , అన్ని భాషలు .. అన్ని కులాలు ఉన్నాయి. పరస్పరం గౌరవించుకోవడం మన నీతి … అందుకు భిన్నంగా బీజేపీ వ్యవహరిస్తోంది .
రాజ్యాంగం ఎందుకు మార్చాలని అన్నాను …
దేశంలో దళిత శాతం 19 శాతం పెరిగింది. రిజర్వేషన్లు పెంచాలి
రాష్ట్రల హక్కులు హరిస్తుంది. దానికి కొత్త రాజ్యాంగం కావాలి
బీసీ ల కుల గణన కావాలి …
దళితుల సబ్ ప్లాన్ ఎత్తివేసింది . దానికోసం కొత్త రాజ్యాంగం కావాలి
అంబెడ్కర్ స్పిరిట్ ఉందా ? దళితులమీద దాడి జరుగుతుంది. అందరికి రక్షణ ఉండాలి ..
అంతర్జాతీయ ట్రాక్ స్పీడ్ 105 కి..మీ మనదేశంలో 45 కి ..మీ మాత్రమే …
చైనా లాగా మన దేశం బాగు పడాలి …దానికోసం
తెలంగాణ లాగా మారడానికి కొత్త రాజ్యాంగం కావాలి వద్దా ?
నేను పిచ్చోడినా ? ఆలోచించకుండానే రాజ్యాంగం మార్చాలని అంటానా?
కొత్త పార్టీ ఎందుకు పెట్టకూడదు ..పెడితే తప్పా? అవసరం ఉంటె పెడతా …
నేను కాంగ్రెస్ కు మద్దతు ఇవ్వడంలేదు …
నేను కాంగ్రెస్ కు మద్దతు ఇవ్వడంలేదు … ఒక వ్యక్తిపై ఒక నిబద్దత ,దేశం కోసం త్యాగం చేసిన కుటుంబంపై ఒక సీఎం నిందలు వేస్తారా ? సర్జికల్ స్ట్రైక్ గురించి ప్రశ్నించారు . నేను కూడా ప్రశ్నిస్తున్నాను ఎక్కడ సర్జికల్ స్ట్రైక్ జరిగిందో చూపమంటున్నాను …నన్నుకూడా అంటారా ? అని ప్రశ్నించారు .
అవసరం అయితే పార్టీ పెడతాం …
అవసరం అయితే పెడతాం .అన్ని శక్తులను ఏకం చేసే ప్రయత్నం జరుగుతుంది. జాతీయనాయకులు ,ప్రాంతీయ నాయకులూ టచ్ లో ఉన్నారు అని కేసీఆర్ అన్నారు .