Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

తెలంగాణ సీఎస్ సోమేశ్ కుమార్ పై క్యాట్ ఆగ్రహం!

తెలంగాణ సీఎస్ పై ఐపీఎస్ అధికారి కోర్టు ధిక్కరణ పిటిషన్… సోమేశ్ కుమార్ పై క్యాట్ ఆగ్రహం

  • -విభజన సమయంలో ఐపీఎస్ అధికారి మొహంతిని ఏపీకి కేటాయించిన కేంద్రం
  • -క్యాట్ ను ఆశ్రయించిన మొహంతి
  • -విధుల్లోకి తీసుకోవాలంటూ తెలంగాణకు ఆదేశాలు
  • -ఇప్పటివరకు విధుల్లోకి తీసుకోని వైనం

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత ఏపీ, తెలంగాణ ఏర్పడడం తెలిసిందే. విభజన సందర్భంగా అధికారుల పంపకాలు కూడా జరిగాయి. ఈ క్రమంలో ఐపీఎస్ అధికారి అభిషేక్ మొహంతిని కేంద్రం ఏపీకి కేటాయించింది. అయితే, తన నియామకంపై మొహంతి క్యాట్ (కేంద్ర పరిపాలన ట్రైబ్యునల్)ను ఆశ్రయించారు. దాంతో, మొహంతిని రిలీవ్ చేయాలని క్యాట్ ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. అటు, మొహంతిని విధుల్లోకి తీసుకోవాలని తెలంగాణ ప్రభుత్వానికి కూడా స్పష్టం చేసింది.

నాడు క్యాట్ ఉత్తర్వులను అనుసరించి మొహంతిని ఏపీ సర్కారు రిలీవ్ చేసింది. కానీ, తనను తెలంగాణ ప్రభుత్వం విధుల్లోకి తీసుకోవడంలేదని సీఎస్ సోమేశ్ కుమార్ పై మొహంతి క్యాట్ ను ఆశ్రయించారు. తెలంగాణ సీఎస్ పై కోర్టు ధిక్కరణ పిటిషన్ వేశారు. క్యాట్ ఉత్తర్వులను ఆయన పాటించడంలేదని ఆరోపించారు.

దీనిపై తాజాగా విచారణ జరిపిన క్యాట్… సీఎస్ సోమేశ్ కుమార్ పై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆయన విచారణకు రాకపోవడం పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. గంటలోగా ఆన్ లైన్ విచారణకు హాజరు కాకపోతే నాన్ బెయిలబుల్ వారెంట్ ఇస్తామని స్పష్టం చేసింది. దాంతో, సోమేశ్ కుమార్ విచారణకు హాజరయ్యారు.

తమ ఆదేశాలను కూడా పట్టించుకోకపోవడంపై క్యాట్ అసహనం వెలిబుచ్చింది. ఐపీఎస్ అధికారి మొహంతిని విధుల్లోకి ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించింది. మొహంతి అంశంలో కేంద్రానికి లేఖ రాశామని సోమేశ్ కుమార్ క్యాట్ కు వెల్లడించారు. దాంతో, స్పందించిన క్యాట్… రెండు వారాల్లో మొహంతిని విధుల్లోకి తీసుకోవాలని సీఎస్ ను ఆదేశించింది.

Related posts

కరెంట్ షార్ట్ సర్క్యూట్ తో ఖమ్మంలో భారీ అగ్నిప్రమాదం!

Drukpadam

సీనియర్ న్యాయవాది ప్రవర్తనపై సీజేఐ తీవ్ర ఆగ్రహం!

Drukpadam

దేశంలోనే తొలిసారి.. హైదరాబాద్ ‘గాంధీ’లో కొవిడ్ నుంచి కోలుకున్న 110 ఏళ్ల వృద్ధుడు!

Drukpadam

Leave a Comment