Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

ఎవరు ఏ బట్టలు వేసుకోవాలి అనేదానిపై ప్రభుత్వాలకు ఏంపని …హిజాబ్ పై కేసీఆర్!

ఎవరు ఏ బట్టలు వేసుకోవాలి అనేదానిపై ప్రభుత్వాలకు ఏంపని …హిజాబ్ పై కేసీఆర్!
-హిజాబ్ వివాదంపై కేసీఆర్ కీలక వ్యాఖ్యలు
-ఎవరి ఆచార వ్యవహారాలు వారివి …అది జీవించే స్వేచ్ఛ
-మత కలహాల కోసమే హిజాబ్ పంచాయతీ పెట్టారు
-వీటి వల్ల దేశ యువత భవిష్యత్తు నాశనమవుతుందన్న కేసీఆర్

దేశంలో అత్యంత చర్చనీయాంశంగా మారిన హిజాబ్ అంశాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో ప్రస్తావించారు. మన దేశానికి ఐటీ క్యాపిటల్ గా బెంగళూరు ఉందని, ఆ నగరాన్ని సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియా అని పిలుస్తారని కేసీఆర్ అన్నారు. హైదరాబాద్ రెండో స్థానంలో ఉందని చెప్పారు. ఈ రెండు నగరాల్లో విదేశాలకు చెందిన ఎందరో పని చేస్తుంటారని అన్నారు. బెంగుళూరులో హిజాబ్ పంచాయతీ పెడుతున్నారని… ఎవరు ఏ బట్టలు వేసుకుంటే ప్రభుత్వాలకు ఏం అభ్యంతరమని ప్రశ్నించారు. ప్రజలు తొడుక్కునే వస్త్రాలతో ప్రభుత్వాలకు ఏం పని అని అడిగారు.

మత కలహాలు పెట్టడానికే హిజాబ్ పంచాయతీ పెట్టారని విమర్శించారు. హిజాబ్ లాంటి సమస్యలు, మత కలహాలు ఉంటే పెట్టుబడులు ఎలా వస్తాయని ప్రశ్నించారు. ఇలాంటి వివాదాల వల్ల దేశ యువత భవిష్యత్తు నాశనమవుతుందని అన్నారు. యూపీఏను ఓడించి ఎన్డీయేను గెలిపించినందుకు దేశ పరిస్థితి ఇలా తయారయిందని చెప్పారు. బీజేపీ సంకుచిత వ్యవహారాలు చేస్తోందని అన్నారు. ఈ దేశం ఎటు పోతోందని ప్రశ్నించారు. పెడధోరణి దేశానికి మంచిది కాదని, దీనిపై దేశ, రాష్ట్ర యువత ఆలోచించాలని అన్నారు.

Related posts

ఎం ఎల్ న్యూ డెమోక్రసీ రైతు గర్జనతో ఎరుపెక్కిన ఖమ్మం

Drukpadam

Meet the Nokia 8 — The First Android Flagship From The Iconic Brand

Drukpadam

తుఫాన్ గా మారిన వాయిగుండం ఉత్తరాంధ్రలో భారీ నుంచి అతి భారీ వర్షాలు!

Drukpadam

Leave a Comment