Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

మోడీతో భేటీకి కేసీఆర్ ఆశక్తి ..నేడు ఎర్రవల్లి లో మంత్రులు అధికారులతో తర్జన భర్జన …

మోడీతో భేటీకి కేసీఆర్ ఆశక్తి ..నేడు ఎర్రవల్లి లో మంత్రులు అధికారులతో తర్జన భర్జన …
-ఎన్నికల్లో బీజేపీ విజయాలతో కేసీఆర్ వైఖరిలో మార్పు వచ్చిందా …వూహాత్మకమా ?
-టీఆర్ఎస్ ఎల్పీ సమావేశానికి పిలుపునిచ్చిన సీఎం కేసీఆర్…
-తప్పనిసరిగా రావాలంటూ ఎంపీలు ,ఎమ్మెల్యేలు ,ఎమ్మెల్సీలకు ఆదేశాలు
-ఈ నెల 21న టీఆర్ఎస్ శాసనసభాపక్ష సమావేశం
-అదే రోజున ఢిల్లీ వెళ్లనున్న కేసీఆర్ బృందం
-ధాన్యం కొనుగోళ్లపై కేంద్రంతో మాట్లాడనున్న సీఎం, మంత్రులు

కేసీఆర్ ప్రధాని మోడీని కలిసేందుకు ఆశక్తి కనబరుస్తున్నారు .ఇది వూహాత్మకమా ? లేక ప్రశాంత్ కిషోర్ వ్యూహంలో భాగమా ? అనేది తెలియదు కానీ కేసీఆర్ నిర్ణయాలు త్వరత్వరగా తీసుకుంటున్నారు . ఒకపక్క నిరుద్యోగులకు ఉద్యోగాల నోటిఫికేషన్లు , మరోపక్క ధాన్యం కొనుగోళ్లు పై చకచకా చేర్యాలకు కేసీఆర్ ఉపక్రమించారు. నేడు ఎర్రవల్లి వ్యవసాక్షేత్రం లో ఏర్పాటు చేసిన అత్యవసర సమావేశంలో రాష్ట్రంలో చేపట్టాల్సిన తక్షణ సమస్యలపై అందుబాటులో ఉన్న మంత్రులు , ఎమ్మెల్యేలు ఎంపీలు అధికారాలతో తర్జన భర్జనలు జరిపారు . రాజకీయాలతో పాటు అనేక సమస్యలు ఇందులో ప్రస్తావనకు వచ్చినట్లు ప్రచారం జరుగుతుంది. ఇందులో కేంద్రంలో మంత్రులను మరోసారి కలిసి రబి ధాన్యం కొనుగోలు చేయాలనీ విజ్నప్తి చేయాలనీ నిర్ణయించారు. అయితే ఈసారి సీఎం కేసీఆర్ నాయకత్వంలోనే మంత్రుల అధికారుల బృందం ఢిల్లీలో వెళ్లనున్నది . ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ తో కూడా సమావేశం అవ్వాలని అభిప్రాయపడినట్లు సమాచారం …

ఐదు రాష్ట్రాల ఎన్నికలకు ముందు కేంద్రంలోని బీజేపీపై ఒంటికాలిపై లేచి దేశమంతా తిరిగి బీజేపీకి వ్యతిరేకంగా పావులు కదిపినా కేసీఆర్ లో మార్పు వచ్చిందా అంటే రాజకీయాల్లో ఏమైనా జరగవచ్చునంటున్నారు పరిశీలకులు … రాష్ట్రాల హక్కులను బీజేపీ సర్కార్ హరిస్తుందని , రాష్ట్రాలపై వారి పెత్తనం ఏమిటని ప్రశ్నించి దేశవ్యాపిత ఉద్యమానికి శ్రీకారం చుట్టిన కేసీఆర్ ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ విజయాల అనంతరం కొంత ఆలోచనలో పడ్డారా అనే అభిప్రాయాలూ వ్యక్తం అవుతున్నాయి. చినజీయర్ ఏర్పాటుచేసిన సమతామూర్తి విగ్రహ ఆవిష్కరణ సందర్భంగా ప్రధాని వచ్చినప్పుడు కనీసం ఆయనకు స్వాగతం పలకని కేసీఆర్ తరువాత ప్రధానిని కలవలేదు … ధాన్యం కొనుగోళ్ల అంశంపై కేంద్రంతో అమీతుమీకి తెలంగాణ సర్కారు సిద్ధమవుతోంది. ఈ క్రమంలో మార్చి 21న టీఆర్ఎస్ శాసనసభాపక్ష సమావేశం నిర్వహించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. అదే రోజు ఢిల్లీ వెళ్లి ప్రధానిని కలిసి ధాన్యం కొనుగోళ్లపై నేరుగా ఆయనతోనే మాట్లాడాలని నిర్ణయించారు .

ఈ సమావేశానికి తప్పనిసరిగా హాజరు కావాలంటూ టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, పార్టీ జిల్లా అధ్యక్షులు, జడ్పీ చైర్మన్లు/చైర్ పర్సన్లు, డీసీసీబీ/డీసీఎంస్ అధ్యక్షులు, రైతుబంధు సమితులు జిల్లా అధ్యక్షులకు ఈ మేరకు సీఎంవో నుంచి ఆదేశాలు వెళ్లాయి. ధాన్యం కొనుగోళ్ల అంశానికి సంబంధించి పోరును తీవ్రతరం చేస్తున్నందున అందరూ ఈ సమావేశానికి రావాలని స్పష్టం చేశారు.

కాగా, ఈ సమావేశం అనంతరం అదే రోజున సీఎం కేసీఆర్, మంత్రుల బృందంతో కలిసి ఢిల్లీ వెళతారు. ధాన్యం కొనుగోలు అంశంపై కేంద్ర మంత్రులను, అవసరమైతే ప్రధాని నరేంద్ర మోదీని కలవనున్నారు. పంజాబ్ లో పండిస్తున్న వరి ధాన్యాన్ని కేంద్రం వంద శాతం కొనుగోలు చేస్తున్నందున, తెలంగాణలోనూ అదే తీరున వంద శాతం కేంద్రమే కొనుగోలు చేయాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నారు.

కాగా, యాసంగి ధాన్యాన్ని కొనుగోలు చేయాలన్న డిమాండ్ తో రాష్ట్రంలో నిరసన ప్రదర్శనల విధివిధానాలను ఈ నెల 21న నిర్వహించే టీఆర్ఎస్ ఎల్పీ సమావేశంలో నిర్ణయిస్తామని సీఎం కేసీఆర్ వెల్లడించారు.

Related posts

అసెంబ్లీ లో ఫ్రెండ్లీ పార్టీల మధ్య మాటల యుద్ధం …

Drukpadam

రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయం …సర్వే ఆధారంగా టిక్కెట్లు ….రేవంత్ రెడ్డి

Drukpadam

ఊపిరి ఉన్నంతకాలం టీఆర్ఎస్ లోనే : డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్

Drukpadam

Leave a Comment