Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఢిల్లీ బాట…

తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఢిల్లీ బాట…
జగ్గారెడ్డి పై చర్యలతో అలర్ట్
ఢిల్లీకి బయలుదేరిన విహెచ్
పీసీసీ నేతలు సైతం
తనపై చర్యలతో రేపు మాట్లాడతానన్న జగ్గారెడ్డి

జగ్గారెడ్డి పై చర్యలకు కాంగ్రెస్ పార్టీ ఉపక్రమించడంతో సీనియర్ల ఢిల్లీ బాట పట్టారు . ఎంతవరకు నిజమో తెలియదు కానీ సీనియర్ నేత విహెచ్ సోనియాగాంధీ అపాయింట్మెంట్ అడిగినట్లు ప్రచారం జరుగుతుంది. దీంతో ఆయన అందరికంటే ముందుగానే ఢిల్లీకి పయనమైయ్యారు . పీసీసీ నేతలను కూడా ఢిల్లీకి రావాలని హైకమాండ్ ఆదేశించడంతో నేతలు ఢిల్లీ బాట పట్టారు . పార్లమెంట్ సమావేశాల్లో ఉన్న నేతలు కొందరు అక్కడే ఉన్నారు . తెలంగాణ లోని అసమ్మతి వాదులు హైకమాండ్ ను కలిసి ఎలాంటి వాదనలు వినిపిస్తారు . హై కమాండ్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ ఉంటుందనేది ఆశక్తిగా మారింది.

తెలంగాణ కాంగ్రెస్ లో నెలకొన్న గందరగోళం తారాస్థాయికి చేరుకుంది. ఇది కాంగ్రెస్ నావను ముంచుతుందా ? తెలుస్తుందా ? అనేది ఆశక్తిగా మారింది. రెండు రోజుల క్రితం కొంతమంది సీనియర్ నేతలు, కాంగ్రెస్ లాయలిస్టుల పేరుతొ హైద్రాబాద్ లోని ఒక హోటల్ లో సమావేశం వేర్పాటు చేశారు . ఈ విషయం అధిష్టానం దృష్టికి రావడంతో రంగంలోకి దిగిన రాష్ట్ర ఇంచార్జిలు అసమ్మతినేతలకు ఫోన్ చేసి సమావేశం వేర్పాటు చేయవద్దని కోరారు . అయినప్పటికీ సమావేశం నిర్వహించారు . దానికి పట్టుమని ఆరుగురు కూడా వెళ్లలేదు .

రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ గా నియమించిన దగ్గరనుంచి అసమ్మతి కొనసాగుతూనే ఉంది. అయితే కొంత మంది నాయకులు సర్దుకున్న మరికొందరి ధోరణిలో మార్పు లేకపోవడం తలనొప్పికి మారింది. ప్రతి చిన్న దానికి ఆలగడం ,విమర్శలు చేయడం షరా మాములుగా మారింది. అంతవరకూ ఒకే అనుకున్న విమర్శలు శృతిమించటం పార్టీకి నష్ట దాయకంగా మారటంతో పార్టీ హైకమాండ్ కూడా సీరియస్ గా తీసుకున్నది . గాంధీ కుటుంబానికి లాయలిస్ట్ గా చెప్పుకునే విహెచ్ సైతం పీసీసీ అధ్యక్షుడికి వ్యతిరేకంగా పావులు కదుపుతున్నారు . ఆయనతో పాటు సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి కూడా రేవంత్ పై ఒంటికాలిపై లేస్తున్నాడు . ఆయన టీఆర్ యస్ లోకి వెళ్లుతున్నారనే ప్రచారం కూడా జరిగింది. కానీ ఆయన పార్టీలోనే ఉంటూ పీసీసీ చీఫ్ పై ఆరోపణలు చేయడం కొంతమందికి మింగుడు పడటం లేదు . దీంతో తెలంగాణ కాంగ్రెస్ దాదాపు రెండుగా చీలింది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో సత్తాచాటాలని చూస్తున్న కాంగ్రెస్ కు అంతర్గత తగాదాలు తలనొప్పిగా మారాయి. ఇదే ధోరణి కొనసాగితే కాంగ్రెస్ మరింత బలహీనపడటం ఖాయం …..

Related posts

రాహుల్ గాంధీ బుజ్జగింపుతో పంతం వీడిన డీకే…!

Drukpadam

టీఆర్ఎస్ పార్టీకి గట్టు గుడ్ బై!

Drukpadam

రాజస్థాన్ లో కొత్త పార్టీ లేనట్లే.. ఎలాంటి ప్రకటన చేయని సచిన్ పైలట్

Drukpadam

Leave a Comment