Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

గిరిజన రిజ‌ర్వేష‌న్ల పై కేంద్రం పార్లమెంట్ సాక్షిగా పచ్చి అబద్దాలు :టీఆర్ యస్ లోకసభ పక్ష నేత నామా ఫైర్!

గిరిజనరిజ‌ర్వేష‌న్ల  పై కేంద్రం పార్లమెంట్ సాక్షిగా పచ్చి అబద్దాలు :టీఆర్ యస్ లోకసభ పక్ష నేత నామా ఫైర్!
-కేంద్ర మంత్రిపై టీఆర్ఎస్ ప్రివిలేజ్ నోటీసు..
-మంత్రి బిశ్వేశ్వ‌ర్‌ను బ‌ర్త‌ర‌ఫ్ చేయాల‌ని డిమాండ్
-గిరిజ‌నుల రిజ‌ర్వేష‌న్ల పెంపుపై తెలంగాణ అసెంబ్లీ తీర్మానం
-అలాంటిదేమీ త‌మ‌కు రాలేద‌ని కేంద్ర మంత్రి ప్ర‌క‌ట‌న‌
-అబద్ధం చెప్పి మంత్రి పార్ల‌మెంటును త‌ప్పుదోవ ప‌ట్టించార‌న్న టీఆర్ఎస్‌
-బిశ్వేశ్వ‌ర్ తుడుపై బ‌ర్త‌ర‌ఫ్ కోసం లోక్‌స‌భ‌లో టీఆర్ఎస్ ప‌ట్టు
-స‌భ‌లో నినాదాలు.. ఆ త‌ర్వాత స‌భ నుంచి వాకౌట్
-కేశవరావు ఇతర ఎంపీలతో కలసి మీడియా ముందుకు

అసలే ధాన్యం కొనుగోలు పై కేంద్రంతో తాడోపేడో తేల్చుకోవాలని నిర్ణయించుకున్న టీఆర్ యస్ కు పార్లమెంట్ లో కేంద్రంతో మరో చేదు అనుభవం ఎదురైంది. గిరిజనులకు ఇప్పుడు ఇస్తున్న 6 శాతం రిజ‌ర్వేష‌న్ల ను పెరిగిన జనాభాకు అనుగుణంగా 10 శాతం కు పెంచాలని టీఆర్ యస్ ఎప్పటినుంచో డిమాండ్ చేస్తున్నది . 2017 లో శాసనసభ ప్రత్యేక తీర్మానం చేసి 10 శాతం రిజర్వేషన్ కోసం కేంద్రానికి పంపింది. దీనిపై కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గిరిజనుల రేజర్వేషన్ల పెంపుపై ఏదైనా ఆలోచన ఉందా ? తెలంగాణ ప్రభుత్వం ఇందుకోసం తీర్మానం పంపిందా ని ప్రశ్నించారు . అందుకు కేంద్రమంత్రి తుడు సమాధానమిస్తూ తెలంగాణ రాష్ట్రము నుంచి గిరిజన రేజర్వేషన్ల పంపుపై ఎలాంటి ప్రతిపాదన రాలేదని లోకసభ సాక్షి గా తెలిపారు . దీంతో టీఆర్ యస్ పక్ష నేత నామా నాగేశ్వరరావు జోక్యం చేసుకొని 2017 లోనే శాసనసభ తీర్మానం చేసి పంపిన విషయాన్నీ ప్రస్తావించారు . మంత్రి సభను తప్పుదోవ పట్టిస్తున్నారని మండి పడ్డారు . నామా తో టీఆర్ యస్ ఎంపీ లు గొంతు కలిపారు . మంత్రి చర్యలను ఖండించారు . వెంటనే ప్రివిలైజ్ మోషన్ నోటీసు ఇచ్చారు . సభను తప్పుదోవ పట్టించినందుకు మంత్రి క్షమాపణ చెప్పాలని నామా డిమాండ్ చేశారు . కేంద్రం చర్యలను నిరసిస్తూ టీఆర్ యస్ సభ్యులు వాక్ అవుట్ చేశారు . రాజ్యసభలోను టీఆర్ యస్ సభ్యులు కేశవరావు నాయకత్వం లో నిరసన తెలిపారు . అనంతరం వారి మీడియా తో మాట్లాడారు . పార్లమెంట్ సాక్షిగా కేంద్రం పచ్చి అబద్దాలు ఆడుతుందని నామా నాగేశ్వరరావు ఫైర్ అయ్యారు . గిరిజన రేజర్వేషన్లపై అసెంబ్లీ తీర్మానం చేయడమే కాకుండా కేంద్రానికి పంపిన విషయాన్నీ విస్మరించడం దారుణమని వాపోయారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధానిని కలిసినప్పుడు అనేకసందర్భాలలో గిరిజన రిజర్వేషన్లను ప్రస్తావించిన విషయాన్నీ గుర్తు చేశారు . కేంద్ర తెలంగాణ విషయంలో పక్షపాతంగా వ్యవహరిస్తుందని ధ్వజమెత్తారు . రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయాలపై ఇప్పటికే కేసీఆర్ మార్గదర్శకత్వంలో కార్యాచరణతో ముందుకు వెళుతున్న విషయాన్నీ గుర్తు చేశారు . కేంద్రం మోసాలను ఎండగడతామని రాష్ట్ర ప్రజలకోసం ఎందాకైనా వెళతామని నామా పేర్కొన్నారు .

అంతకు ముందు కేంద్ర గిరిజ‌న శాఖ స‌హాయ మంత్రి బిశ్వేశ్వ‌ర్ తుడును త‌క్ష‌ణ‌మే కేంద్ర కేబినెట్ నుంచి బ‌ర్త‌ర‌ఫ్ చేయాల‌ని డిమాండ్ చేస్తూ టీఆర్ఎస్ ఎంపీలు బుధ‌వారం లోక్‌స‌భ‌లో ఆందోళ‌న‌కు దిగారు. త‌ప్పుడు స‌మాచారం ఇచ్చి పార్ల‌మెంటును మంత్రి త‌ప్పుదోవ ప‌ట్టించార‌ని ఈ సంద‌ర్భంగా టీఆర్ఎస్ ఎంపీలు ఆరోపించారు. అదే స‌మ‌యంలో గిరిజ‌నుల రిజ‌ర్వేష‌న్లు పెంచాల‌ని కూడా ఎంపీలు డిమాండ్ చేశారు. మంత్రిపై చ‌ర్య‌ల‌కు కేంద్రం నుంచి ఎలాంటి ప్ర‌క‌ట‌న రాని వైనానికి నిర‌స‌న‌గా పార్ల‌మెంటు నుంచి వాకౌట్ చేశారు.

గిరిజ‌నుల‌కు రిజ‌ర్వేష‌న్లు పెంచాల‌ని తెలంగాణ అసెంబ్లీ ఓ తీర్మానం చేసి కేంద్రానికి పంపిన సంగ‌తి తెలిసిందే. దీనిపై స్పందించిన కేంద్ర గిరిజ‌న శాఖ స‌హాయ మంత్రి బిశ్వేశ్వ‌ర్ తుడు.. తెలంగాణ అసెంబ్లీ నుంచి ఎలాంటి తీర్మానం రాలేద‌ని ప్ర‌క‌టించారు. దీంతో మంత్రి అబ‌ద్ధం చెప్పార‌న్న విష‌యాన్ని గుర్తించిన టీఆర్ఎస్ ఎంపీలు ఆయ‌న‌పై లోక్ స‌భ‌లో ప్రివిలేజ్ నోటీసు జారీ చేశారు. గిరిజ‌నుల రిజర్వేష‌న్ల‌పై అబ‌ద్ధం చెప్పిన మంత్రి గిరిజ‌నుల‌తో పాటు తెలంగాణ ప్ర‌జ‌ల‌కు క్ష‌మాప‌ణ చెప్పాలని టీఆర్ఎస్ ఎంపీలు డిమాండ్ చేశారు.

Related posts

కర్ణాటక విజయం …ఖమ్మం లో కాంగ్రెస్ సంబరాలు…

Drukpadam

బొత్స ఛాంబ‌ర్‌లో న‌లుగురు మంత్రులు.. ఏం చ‌ర్చించారంటే..!

Drukpadam

బీజేపీ వాళ్లకు ఏ జడ్జీ శిక్ష వేయరు: ప్రియాంక గాంధీ!

Drukpadam

Leave a Comment