Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

మూలిగే నక్కపై తాటికాయ …విద్యుత్ చార్జీల వడ్డనకు తెలంగాణ సర్కార్ సిద్ధం!

మూలిగే నక్కపై తాటికాయ …విద్యుత్ చార్జీల వడ్డనకు తెలంగాణ సర్కార్ సిద్ధం!
-తెలంగాణ‌లో విద్యుత్ చార్జీల పెంపు.. ఏప్రిల్ 1 నుంచే అమలు
-గృహ వినియోగంపై యూనిట్‌కు 50 పైస‌ల పెంపు
-ప‌రిశ్ర‌మ‌ల‌కు యూనిట్‌పై రూ.1 పెంపు
-చార్జీల పెంపున‌కు ఈఆర్‌సీ గ్రీన్ సిగ్న‌ల్‌
-ఇప్పటికే బస్సు చార్జీలు , పెట్రో ,డీజిల్ ,గ్యాస్ పెంపుతో పెనుభారం

మూలిగే నక్కపై తాటికాయ పడిన చందంగా ఇప్పటికే బస్సు చార్జీలు , పెట్రో ,డీజిల్ ,గ్యాస్ పెంపుతో పెనుభారం తో ఉక్కిరి బిక్కిరి అవుతున్న ప్రజలపై తెలంగాణ సర్కార్ విద్యుత్ చార్జీల పెంపుకు పచ్చజెండా ఉపబోతుంది. ఇప్పటికే విద్యుత్ రెగ్యూలేటరీ అథారిటీ చేసిన ప్రతిపాదనలు ,ప్రభుత్వ ఆమోదం కోసం సిద్ధంగా ఉన్నాయి. గృహ వినియోగానికి యూనిట్ కు 50 పైసలు , హైటెన్షన్ వినియోగదారులకు యూనిట్ కు 1 రూపాయ పెరగనుంది .

తెలంగాణ‌లో విద్యుత్ చార్జీల పెంపున‌కు రంగం సిద్ధ‌మైపోయింది. విద్యుత్ చార్జీల పెంపున‌కు సంబంధించి ప్ర‌భుత్వం పంపిన ప్ర‌తిపాద‌న‌ల‌కు ఎల‌క్ట్రిసిటీ రెగ్యులేట‌రీ క‌మిష‌న్ (ఈఆర్‌సీ) బుధ‌వారం నాడు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది. విద్యుత్ చార్జీల పెంపు ప్ర‌తిపాద‌న‌ల‌పై రాష్ట్రంలోని ప‌లు ప్రాంతాల్లో బ‌హిరంగ విచార‌ణ చేప‌ట్టిన‌ట్టు తెలిపిన క‌మిష‌న్‌.. చార్జీల పెంపున‌కు అనుమ‌తిస్తున్న‌ట్లు పేర్కొంది.

ప్ర‌భుత్వం నుంచి త‌మ వ‌ద్ద‌కు వ‌చ్చిన ప్ర‌తిపాద‌న‌ల మేర‌కు విద్యుత్ చార్జీల పెంపున‌కు అనుమ‌తిస్తున్న‌ట్లుగా క‌మిష‌న్ చెప్ప‌డంతో విద్యుత్ చార్జీల పెంపుపై ప్ర‌భుత్వం ప్ర‌క‌ట‌న విడుద‌ల చేయ‌డ‌మే త‌రువాయి విద్యుత్ బిల్లుల మోత మోగ‌నుంది. క‌మిష‌న్ వెల్ల‌డించిన మేర‌కు గృహ వినియోగ‌దారుల‌కు యూనిట్‌పై 50 పైస‌లు, పారిశ్రామిక వినియోగంపై యూనిట్‌కు రూ.1 పెర‌గ‌నున్నాయి. ఈ పెరిగిన ధ‌ర‌లు ఏప్రిల్ 1 నుంచి అమ‌ల్లోకి రానున్నాయి.

Related posts

వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ డే ….పత్రికా స్వేచ్ఛలో దిగజారుతున్న భారత్ స్థానం…

Drukpadam

ఖమ్మం జిల్లా వార్తలు …..

Drukpadam

కేరళలో బెంబేలెత్తిస్తున్న టమాటా ఫ్లూ.. లక్షణాలు ఇవే!

Drukpadam

Leave a Comment