Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

భట్టి పాదయాత్ర జయప్రదం కావాలన్న సోనియా ,రాహుల్!

భట్టి పాదయాత్ర జయప్రదం కావాలన్న సోనియా ,రాహుల్!
పాదయాత్రలో ఉన్న సీఎల్పీ నేత భట్టి కి మాణిక్యం ఠాగూర్ ఫోన్
పాదయాత్రకు సోనియా, రాహుల్ అభినందనలు
భట్టి చేస్తున్న పాదయాత్రకు ఎఐసిసి సంపూర్ణ సహకారం
రాష్ట్ర వ్యాపిత యాత్రగా మారాలన్న మాణిక్యం ఠాకూర్

ప్రజా సమస్యల పరిష్కారంకై సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మల్లు గారు చేపట్టిన పాదయాత్ర ప్రజల నుంచి విశేషమైన స్పందన లభిస్తుందన్న విషయాన్ని తెలుసుకున్న ఏఐసీసీ అధినేత్రి సోనియా గాంధీ , అధినేత రాహుల్ గాంధీ హర్షం వ్యక్తం చేశారని
ఢీల్లి నుంచి ఏఐసీసీ జనరల్ సెక్రటరీ, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇంచార్జీ మాణిక్యం ఠాగూర్ బుధవారం రాత్రి భట్టి విక్రమార్క మల్లుకి అకస్మాత్తుగా ఫోన్ చేయడం చర్చనీయాంశం అయింది. . ఈ పాదయాత్ర మధిర నియోజకవర్గంలో నే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా విస్తరించాలని భట్టి విక్రమార్క చేసే పాదయాత్రకు అధిష్టానం నుంచి సంపూర్ణమైన మద్దతు ఉంటుందని వారు తెలిపారని మాణిక్యం ఠాగూర్ భట్టి విక్రమార్కకి చెప్పారు. మధిర నియోజకవర్గం చింతకాని మండలం రేపల్లెవాడలో పాదయాత్ర సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతున్న సమయంలో
ఠాగూర్ ఢిల్లీ నుంచి ఫోన్ చేసి మాట్లాడారు. ఇదే క్రమంలో ఫోన్ ద్వారా గ్రామ ప్రజలకు మాణిక్యం ఠాగూర్, రాహుల్ గాంధీ పంపిన సందేశాన్ని వినిపించారు . కేంద్రంలోని మోడీ సర్కార్ డీజిల్ పెట్రోల్ గ్యాస్, నిత్యావసర వస్తువుల ధరల పెంపును నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ నిర్వహించే ఆందోళన కార్యక్రమంలో కాంగ్రెస్ శ్రేణులు తో పాటు ప్రజలు భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలను ఎండగడుతూ మండుటెండను సైతం లెక్కచేయకుండా ప్రజా సమస్యల పరిష్కారం కొరకు భట్టి విక్రమార్క చేపట్టిన పాదయాత్ర గురించి అది నేత రాహుల్ గాంధీ తెలుసుకొని అభినందించారని వెల్లడించారు. రాహుల్ గాందీ నేతృత్వంలో తెలంగాణ లో 2023 లో కాంగ్రెస్ ప్రభుత్వం రానున్నదని తెలిపారు. రానున్న రోజుల్లో కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల మీద పోరాటం ఉదృతం చేయాలన్నారు. భట్టి విక్రమార్క మాకు అత్యంత మిత్రుడని తన అనుబంధాన్ని ఈసందర్భంగా గుర్తు చేశారు.
భట్టి తో కలిసి నడుస్తున్న కాంగ్రెస్ శ్రేణులకు ప్రజలకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా జైరాహుల్…జై సోనియమ్మ నినాదాలతో కాంగ్రెస్ కార్యకర్తలు హోరెత్తించడం అది విన్న మాణిక్యం ఠాకూర్ ఆనందం వ్యక్తం చేస్తూ ప్రజలను అభినందించారు .

Related posts

సాయి గణేష్ ప్రాణం తీసిన పాపం బిజెపి నాయకులదే.. టీఆర్ యస్ జిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్సీ తాతా మధు!

Drukpadam

ఈటల న్యూ జర్నీ బిగిన్స్ …గులాబీ దళంనుంచి కాషాయ వనంలోకి…

Drukpadam

బడ్జెట్ పన్ను ప్రతిపాదనలపై నిపుణుల అభిప్రాయాలు…

Drukpadam

Leave a Comment