Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

మరోసారి తెరపైకి కేసీఆర్ మంత్రివర్గ విస్తరణ …సండ్ర వెంకటవీరయ్య పేరు ప్రస్తావన!

మరోసారి తెరపైకి కేసీఆర్ మంత్రివర్గ విస్తరణసండ్ర వెంకటవీరయ్య పేరు ప్రస్తావన!
ఐదుగురిని మంత్రివర్గంలో చేర్చుకుంటారని ఊహాగానాలు
వారిలో జోగు రామన్న , దానం నాగేందర్ , పల్లా రాజేశ్వర్ రెడ్డి ,కవిత ,వినయ్ భాస్కర్
ఉగాది తరువాత ఎప్పుడైనా మంత్రి వర్గ విస్తరణ జరగొచ్చని ప్రచారం ….
ఇప్పటికే ఈటల రాజేందర్ వెళ్లిపోవడం తో ఒకటి ఖాళీ
కొందరిని తప్పిస్తారని ప్రచారంవారిలో ఎవరుంటారో అనేది సస్పెన్స్

 

 

ఎప్పటినుంచో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తన మంత్రివర్గాన్ని విస్తరిస్తారని ప్రచారం జరుగుతుంది. ఈటల రాజేందర్ ను మంత్రివర్గం నుంచి భర్తరఫ్ చేయడంతో ఒక ఖాళీ ఏర్పడింది. దానితో పాటు మరికొందరిని మంత్రివర్గం నుంచి తప్పించి కొత్తవారికి అవకాశం ఇస్తారని వార్తలు వెలువడుతున్నాయి. కేసీఆర్ మదిలో ఏముందో ఎవరికీ అంతుపట్టని విషయం . ఎవరిని తప్పిస్తారు ? ఎవరికీ అవకాశం ఇస్తారనే దానిపై టీఆర్ యస్ వర్గాలు ఆరా తీస్తున్నాయి. నిజంగా మంత్రివర్గ విస్తరణ ఉంటుందా ? లేక ఉత్తిత్తి ప్రచారమేనా అనే సందేహాలు కూడా లేకపోలేదు. అయితే చాల కాలంగా మంత్రివర్గ విస్తరణ ఉంటుందని వస్తున్నా వార్తలను ఇటు టీఆర్ యస్ గానీ అటు ప్రభుత్వం గానీ ఖండించలేదు . వచ్చే ఏడాది ఎన్నికలు ఉండటంతో ఖాళీని భర్తీ చేయడంతో పాటు నలుగురైదుగురు మంత్రులను మార్చాలనే ఆలోచనలో కేసీఆర్ ఉన్నట్లు వార్త కథనాల సారాంశం

 

 

అయితే మంత్రివర్గ విస్తరణ జరిగితే ఎవరెవరికి స్తానం ఉంటుంది. ఎవరిని తప్పిస్తారోననే చర్చ జరుగుతుంది. ఖమ్మం జిల్లా నుంచి ఇప్పుడు మంత్రివర్గంలో పువ్వాడ అజయ్ కుమార్ ఉన్నారు . ఎస్సీ సామాజికవర్గానికి చెందిన సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య కు అవకాశం ఉంటుందని అంటున్నారు . ఎస్సీ (మాదిగ) సామాజికవర్గం నుంచి మంత్రివర్గంలో ఎవరికీ స్తానం లేదు . అయితే ఇక్కడ నుంచే మరో పేరు కూడా వినిపిస్తున్నది . కేసీఆర్ కు అత్యంత విశ్వాస పాత్రుడిగా ఉన్న ఖమ్మం ,వరంగల్ , నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి కి కూడా అవకాశం ఉందని అంటున్నారు. అయితే ఆయన ఇప్పుడు రైతు సమన్వయ సమితి కన్వీనర్ గా ఉన్నారు. ఇక ఆదిలాబాద్ నుంచి జోగు రామన్న పేరు ప్రచారంలో ఉంది, ఇక్కడ నుంచి ఇప్పటికే ఇంద్రకరణ రెడ్డి మంత్రి వర్గంలో ఉన్నారు . వరంగల్ నుంచి మంత్రివర్గంలో ఎర్రబెల్లి దయాకర్ , సత్యవతి రాథోడ్ ఉండగా , దాస్యం వినయ్ భాస్కర్ , ఎమ్మెల్సీ కడియం శ్రీహరి పేర్లు వినిపిస్తున్నాయి. హైద్రాబాద్ నుంచి దానం నాగేందర్ , ఎమ్మెల్సీ కవిత పేర్లు ప్రచారంలో ఉన్నాయి. అయితే రానున్నది ఎన్నికల కాలం అయినందున కేసీఆర్ మంత్రివర్గం విషయంలో ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటారని అంటున్నారు. ఆయన దగ్గర రికమండేషన్లు సాగవని ఆయన ఎవరిని పక్కన పెట్టాలంటే వారిని పెడతారని అంటున్నారు . ఏప్రిల్ మొదటివారం లేదా రెండవవారం లో మంత్రివర్గ విస్తరణ ఉంటుందా ? ఉండదా ? అనేది చూడాల్సిందే !

Related posts

ఇన్నాళ్లు మంత్రిని కాబట్టి సైలెంట్ గా ఉన్నా: అనిల్ కుమార్ యాదవ్!

Drukpadam

భారతిరెడ్డి పీఏ తన సంతకాన్ని ఫోర్జరీ చేశాడని వంగలపూడి అనిత తీవ్ర ఆరోపణ..

Drukpadam

బీజేపీ వైపు చూస్తున్న ములాయం సింగ్ చిన్న కోడలు!

Drukpadam

Leave a Comment