Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

శ్రీలంకలో ఎమర్జెన్సీ ఎత్తివేత.. మరింతగా దిగజారిన పరిస్థితి…

శ్రీలంకలో ఎమర్జెన్సీ ఎత్తివేత.. మరింతగా దిగజారిన పరిస్థితి…
-ప్రజల నిరసనలతో దిగొచ్చిన అధ్యక్షుడు
-గత అర్ధరాత్రి నుంచే ఉపసంహరణ ఉత్తర్వులు అమల్లోకి
-నార్వే, ఇరాక్‌లోని రాయబార కార్యాలయాలు మూసివేస్తున్నట్టు ప్రకటన
-ఆయిల్ కొరత …దొరకని నిత్యావసర సరుకులు …మందులు
-మెడికల్ ఎమర్జన్సీ ప్రకటించిన ప్రభుత్వం
-దిక్కుతోచని స్థితిలో ప్రజలు

శ్రీలంక ఒకప్పుడు పర్యాటకులకు స్వర్గధామంగా ఉన్న శ్రీలంక నేడు ఉసూరుమంటుంది. పర్యాటకు ఆదేశానికి రావడం చాలాకాలం నుంచే మానేశారు . ఆర్గాన్ పంటలు పండించాలని అక్కడ తీసుకున్న నిర్ణయం వల్ల ఆహార కొరత తలెత్తింది. ఉన్న విదేశీ మారక నిల్వలు కరిగిపోయాయి. నిత్యావసర సరుకులు , మందులు ,పెట్రోల్, డీజిల్ ,గ్యాస్ కొరత ఏర్పడింది. దీంతో అక్కడ ఆర్థిక పరిస్థితి చిన్నాభిన్నం అయింది. ప్రజలు వీధుల్లోకి వచ్చారు . ప్రభుత్వం పై తిరుగుబాటు ప్రకటించారు . అధ్యక్ష భవనం వైపు పరుగులు తీశారు . దీన్ని గమనించిన అధికార పార్టీలోని ఎంపీ లు ప్రభుత్వానికి బడ్డారు ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించారు . ప్రభుత్వం మైనార్టీలో పడింది. అధ్యక్షుడు గొటబయ రాజపక్స, రాజీనామా చేయాలనే డిమాండ్ ఊపందుకున్నది . అంతకుముందు అధ్యక్షుడు ప్రకటించిన ఎమర్జన్సీని రద్దు చేశారు . అయినప్పటికీ అక్కడ పరిస్థితుల్లో మార్పులేదు .

విదేశీ మారక నిల్వలు తరిగిపోయి తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన శ్రీలంక పరిస్థితి రోజురోజుకు మరింతగా దిగజారుతోంది. నిరసనలు తీవ్ర రూపం దాల్చడం, మంత్రుల మూకుమ్మడి రాజీనామాలతో అధ్యక్షుడు గొటబయ రాజపక్స, ఆయన సోదరుడు, ప్రధానమంత్రి మహీంద్ర రాజపక్సను ఇబ్బందులు చుట్టుముట్టాయి. దీనికితోడు పార్లమెంటులో నిన్న అధికార పార్టీ మెజారిటీ కోల్పోయింది.

మరోవైపు, దేశవ్యాప్తంగా నిరసనలు కొనసాగుతుండడంతో దిగొచ్చిన అధ్యక్షుడు దేశంలో విధించిన అత్యవసర పరిస్థితిని రద్దు చేశారు. గత అర్ధరాత్రి నుంచే ఉపసంహరణ ఉత్తర్వులు అమల్లోకి వచ్చాయి. కాగా, దేశంలో ఆర్థిక పరిస్థితి నానాటికి మరింతగా దిగజారుతోంది. విద్యుత్, పెట్రోలు, డీజిల్, గ్యాస్ వంటివి దొరక్క ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నిత్యావసరాల ధరలు ప్రజలకు అందనంత దూరంలో ఉన్నాయి.

శ్రీలంక ప్రభుత్వం తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 30 నుంచి నార్వే, ఇరాక్‌లోని తమ రాయబార కార్యాలయాలను, ఆస్ట్రేలియాలోని తమ కాన్సులేట్ జనరల్‌ను తాత్కాలికంగా మూసేస్తున్నట్టు ప్రకటించింది. దేశంలో మందులకు కొరత ఏర్పడడంతో హెల్త్ ఎమర్జెన్సీని కూడా ప్రభుత్వం ప్రకటించింది.

Related posts

ఇబ్బందికర పరిస్థితులు ఉన్నా… సెంట్రల్ విస్టా పూర్తికి డెడ్ లైన్ విధించిన కేంద్రం!

Drukpadam

ప్రధాని పదవి నుంచి సోదరుడ్ని తొలగించేందుకు అంగీకరించిన శ్రీలంక అధ్యక్షుడు గొటబాయ రాజపక్స!

Drukpadam

ప్రపంచంలో అతిపెద్ద హిందూ దేవాలయం ఇదే!

Drukpadam

Leave a Comment