Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

రోప్ వే ప్రమాదం.. తీగలపైనే 14 ప్రాణాలు.. కాపాడుతుండగా జారి పడిపోయిన ఒక వ్యక్తి

రోప్ వే ప్రమాదం.. తీగలపైనే 14 ప్రాణాలు.. కాపాడుతుండగా జారి పడిపోయిన ఒక వ్యక్తి

  • ఝార్ఖండ్ రాష్ట్రంలోని త్రికూట పర్వతాలపై ప్రమాదం
  • 30 మందిని కాపాడిన వాయుసేన
  • కొనసాగుతున్న సహాయక కార్యక్రమం
  • ఒక వ్యక్తిని కాపాడుతుండగా విషాదం

ఝార్ఖండ్ రాష్ట్రంలోని దియోగఢ్ వద్ద త్రికూట పర్వతాలపై ఆదివారం సాయంత్రం జరిగిన రోప్ వే ప్రమాదంలో 30 మందిని భారత వాయుసేన కాపాడింది. మంగళవారం ఉదయానికి మరో 14 మంది పర్యాటకులు రోప్ వే మార్గంపై కేబుల్ కార్లలోనే చిక్కుకుని ఉన్నారు. వారిని రక్షించే రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది.

ఈ ప్రమాదంలో ఇద్దరు మరణించారు. ప్రమాదం జరిగినప్పుడు ఒకరు మరణించారు. వాయుసేన హెలికాప్టర్ లోకి వ్యక్తిని తాడు సాయంతో తీసుకెళ్లే ప్రయత్నంలో చేయి జారడంతో అతడు కిందపడిపోయి ప్రాణాలు కోల్పోయాడు. రోప్ వే మార్గంలో రెండు కేబుల్ కార్లు ఢీకొనడమే ఈ ప్రమాదానికి కారణం.

శ్రీరామనవమి సందర్భంగా త్రికూట పర్వతాల్లోని బాబా బైద్యనాథ్ ఆలయాన్ని దర్శించుకునేందుకు శని, ఆదివారాల్లో వందల సంఖ్యలో భక్తులు వచ్చారు. రోప్ వే మార్గం ద్వారా ఆలయానికి చేరుకోవచ్చు. ప్రమాదంపై దర్యాప్తునకు సీఎం హేమంత్ సోరేన్ ఆదేశించడం గమనార్హం.

Related posts

‘ఉచిత’ హామీలపై మద్రాసు హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు…

Drukpadam

పాకిస్థాన్‌ను వణికించిన భారీ భూకంపం.. 20 మంది మృతి…

Drukpadam

జగన్ సొంత గ్రామంలో చంద్రబాబుకు ఘన స్వాగతం

Ram Narayana

Leave a Comment