Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

సాయి గణేష్ ప్రాణం తీసిన పాపం బిజెపి నాయకులదే.. టీఆర్ యస్ ఆరోపణ!

సాయి గణేష్ ప్రాణం తీసిన పాపం బిజెపి నాయకులదే.. టీఆర్ యస్ ఆరోపణ!
-మాయమాటలతో సాయి గణేష్ ను బలిపశువును చేశారు.
-టిఆర్ఎస్ పార్టీ నాయకులపై తప్పుడు ప్రచారం చేస్తే సహించే ప్రసక్తే లేదు..
-టీఆర్ యస్ పార్టీ జిల్లా అధ్యక్షులు , ఎమ్మెల్సీ తాతా మధు

పోలీస్ స్టేషన్ ముందు పురుగుల మందు తాగితే హీరో అవుతావ్ అంటూ ప్రోత్సహించిన బీజేపీ నాయకుల పాత్ర మీద విచారణ జరపాలని టీఆర్ యస్ పార్టీ జిల్లా అధ్యక్షులు , ఎమ్మెల్సీ తాతా మధు డిమాండ్ చేశారు . అలాగే సాయి గణేష్ మృతి పట్ల తప్పుడు ప్రచారాలు చేస్తున్న వారిపై సమగ్ర విచారణ చేసి దోషీలను శిక్షించాలని అన్నారు.

టిఆర్ఎస్ పార్టీ కార్యాలయం తెలంగాణ భవన్ నందు మీడియా సమావేశం లో బిజెపి పార్టీ కార్యకర్త సాయిగణేష్ మృతిపట్ల తప్పుడు ప్రచారాలు చేస్తూ రాజకీయ పబ్బం గడుపుకునేందుకు ప్రయత్నం చేస్తున్న బిజెపి నాయకులపై తీవ్ర స్థాయిలో నిప్పులు చెరిగారు . యువ నేత కేటీఆర్ జిల్లా పర్యటన చేయనున్న నేపథ్యంలో బిజెపి పార్టీ నాయకులు ఆడిన నాటకంలో యువకుడు సాయి గణేష్ బలి పశువు అయ్యాడని అన్నారు . శవరాజకీయాలు చేసి ప్రశాంతంగా ఉన్న ఖమ్మం జిల్లా ప్రజలను భయాందోళనకు గురి అయ్యే విధంగా ప్రయత్నం చేయడం బిజెపి పార్టీ నాయకులు పన్నిన పన్నాగంలో భాగమని ధ్వజమెత్తారు .

జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రి ని ధ్వంసం చేయడం, ఆర్టీసీ బస్సులు ధ్వంసం చేయడం వారి అరాచక సంస్కృతికి నిదర్శనం మన్నారు . రాజకీయ చైతన్యం కలిగిన ఖమ్మం జిల్లా లో బిజెపి ఆటలు సాగవని హెచ్చరించారు. బిజెపి నాయకులు రాజకీయ లబ్ధి కోసంమే రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పైచేస్తున్న తప్పుడు వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు .

ఈ కార్యక్రమంలో ఖమ్మం మేయర్ పూనుకొల్లు నీరజ, జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజ్, డిసిసిబి చైర్మన్ కూరాకుల నాగభూషణం, విత్తనాభివృద్ధి చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు, సుడా చైర్మన్ బచ్చు విజయ్ కుమార్,జిల్లా రైతు సమన్వయ కన్వీనర్ నల్లమల వెంకటేశ్వరరావు , నగర టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు పడాల నాగరాజు, ఖమ్మం రూరల్ పార్టీ అధ్యక్షులు బెల్లం వేణు, కార్పొరేటర్ మురళి మరియు టిఆర్ఎస్ నాయకులు మందడపు మనోహర్, రావూరి సైదా బాబు, కోటేశ్వరరావు, ముత్యాల అప్పారావు తదితరులు పాల్గొన్నారు.

Related posts

ఉత్తమ్ , భట్టిపై విహెచ్ ధ్వజం …

Drukpadam

కొత్త కేంద్ర మంత్రులకు ప్రధాని హితోపదేశం!

Drukpadam

పంజాబ్ లో కాంగ్రెస్ కు 20 సీట్లు దాటితే గొప్పే …మాజీ సీఎం అమరిందర్!

Drukpadam

Leave a Comment