Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

పుట్టిన రోజు సందర్భంగా యాదాద్రికి మంత్రి పువ్వాడ అజయ్!

పుట్టిన రోజు సందర్భంగా యాదాద్రికి మంత్రి పువ్వాడ అజయ్!
-జిల్లా ప్రజల తరుపున యాదాద్రి లక్ష్మీనరసింహుడికి కిలో బంగార -విరాళం అందజేయనున్న మంత్రి
-అంతకు ముందు ఖమ్మం లో స్తంభాద్రి గుట్టపై అజయ్ దంపతుల పూజలు
-హాజరు కానున్న అభిమానులు కార్యకర్తలు

ముఖ్య‌మంత్రి కేసీఆర్ పిలుపుమేర‌కు యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ప్రధానాలయ విమానగోపుర స్వర్ణతాపడానికి రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కిలో బంగారం విరాళంగా అందజేయనున్నారు. మంగళవారం తన పుట్టినరోజును పురస్కరించుకుని మంత్రి అజయ్ దంపతులు స్వామివారిని దర్శించుకొని పూజలు నిర్వహించి కిలో బంగారాన్ని సమర్పించనున్నారు. ఖమ్మం జిల్లా ప్రజల త‌ర‌పున కిలో బంగారాన్ని విరాళంగా అందిస్తున్నామని మంత్రి పేర్కొన్నారు.

మంగళవారం ఉదయం 5 గంటలకు ఖమ్మం నగరంలోని లక్ష్మి నరసింహ స్వామివారి ఆలయంలో కిలో బంగారంకు సంప్రోక్షణ పూజా క్రతువును మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ దంపతులు నిర్వహించనున్నారు అనంతరం మధ్యాహ్నం 12 గంటలకు యాదాద్రిపై వెలసిన శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారికి మంత్రి దంపతులు ఖమ్మం జిల్లా ప్రజల తరుపున సమర్పించనున్నారు.

అభివృద్ధికి ఆధ్యాత్మికతను జోడించి సమాజ నిర్మాణానికి పాటుపడుతున్న గొప్ప దార్శనికుడు సీఎం కేసీఆర్‌ అని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కొనియాడారు. యాదాద్రి గొప్ప దేవాలయాన్ని పునర్నిర్మించిన కేసీఆర్‌ చరిత్రలో నిలిచిపోతారన్నారు. ఖమ్మం జిల్లా ప్రజల తరుపున తను కిలో బంగారాన్ని విరాళం అందజేయడం ఆనందంగా ఉందన్నారు. ఆ నరసింహుడి ఆశీస్సులు ఖమ్మం జిల్లా ప్రజల పై ఎల్లప్పుడూ సుసంపన్నంగా ఉండాలని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆకాంక్షించారు.

Related posts

శ్రీవారి భక్తులకు టీటీడీ తీపి కబురు!

Ram Narayana

అమరావతిపై హైకోర్టు ఉత్తర్వులపై పాక్షికంగా స్టే విధించిన సుప్రీంకోర్టు!

Drukpadam

మీ ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఎక్కడ…బీజేపీని ప్రశ్నించిన పీసీసీ చీఫ్

Ram Narayana

Leave a Comment