గట్టు శ్రీకాంత్ రెడ్డి వైసీపీ కి గుడ్ బై
-త్వరలో జాతీయరాజకీయ పార్టీలో చేరతా
-హుజూర్ నగర్ నుంచి పోటీచేస్తా
-తెలంగాణాలో పార్టీ వద్దని జగన్ అనుకోవటం పై మనస్తాపం
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ విభాగం అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్ రెడ్డి ఆపార్టీ కి గుడ్ బై చెప్పారు. తెలంగాణాలో పార్టీ వద్దని జగన్ అనుకోవడం తనకు మనస్తాపం కలిగించిందన్నారు. బరువెక్కిన హృదయంతోనే తాను రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. తాను 2007 నుంచి రాజశేఖర్ రెడ్డి అభిమానిగా,జగన్ తో సిన్నిహితంగా ఉన్నానని ఆయన మరణం నన్ను ఏంటో కుంగ దీసిందన్నారు. ఆయన మరణం తరువాత తాను జగన్ అభిమానిగా మరి ఆయన పార్టీ పెట్టిన తరువాత అందులో చేరానని తెలంగాణాలో తనకు ఆయన మంచి అవకాశం ఇచ్చి అధ్యక్షుడి ని చేశారని అన్నారు. ఇక్కడ పార్టీ వద్దని అనుకున్న తరువాత ఇక నేను అధ్యక్షుడుగా అవసరం లేదని భావించి రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. తాను వైసీపీ నుంచి వైదొలుగు తున్నప్పటికీ రాజకీయాలలో ఉంటానని పేర్కొన్నారు. తాను జాతీయ రాజకీయ పార్టీలో చేరి ఎన్నికల్లో పోటీచేస్తానని వెల్లడించారు. తెలంగాణాలో వైయస్ షర్మిల పార్టీపై ఆయన మాట్లడుతూ ఆమెకు మంచి జరగాలని కోరుకుంటున్నానని అన్నారు. తాను మాత్రం ఆమె పార్టీలో చేరబోనని జాతీయపార్టీ తోనే తన రాజకీయాలు కొనసాగుతాయన్న గట్టు ఏ పార్టీలో చెర బోతున్నారో చెప్పలేదు. అయితే ఆయన బీజేపీ లో చేరే ఆవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.
previous post
next post