చంద్రబాబు త్యాగం అంటే పవన్‌ను సీఎం చేస్తారా?: సజ్జల రామకృష్ణారెడ్డి!
-ఇప్పటికీ పొత్తులోనే చంద్రబాబు, పవన్ ఉన్నారన్న సజ్జల
-జనాలంటే ఈ పార్టీలకు చులకన అని కామెంట్
-చంద్రబాబు ఎన్ని జంప్ లు చేశారో జనానికి తెలుసన్న సజ్జల
ఏపీలో పొత్తులపై చంద్రబాబు ,పవన్ కళ్యాణ్ మాటలపై వైసీపీ ఘాటుగా స్పందించింది. అవసరమైతే పొత్తులకు త్యాగాలకు సిద్ధం కావాలని చంద్రబాబు అనడం అంటే పవన్ కళ్యాణ్ ను సీఎం చేస్తారా ?అని ప్రశ్నించింది. పొత్తులు లేనిది గెలవలేమని నిర్దారణకు వచ్చిన బాబు , పవన్ లు అందరిని కలుపుతామంటున్నారు . బీజేపీ చందరబాబుతో కలిసేది లేదని అంటుంది. అలాంటప్పుడు పవన్ ,బాబుతో దోస్తికోసం బీజేపీ ని వాదులు కుంటారా ? అనేది చర్చనీయాంశంగా మారింది. బీజేపీ తో పొత్తులో ఉన్న పవన్ కళ్యాణ్ దానితో తెగతెంపులు చేసుకొని బాబుతో చెట్టాపట్టాల్ వేసుకునేందుకు సిద్దపడుతున్నారనే సంకేతాలు బీజేపీకి సైతం అందాయని అంటున్నారు . అందుకే ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు తమకు జనంతోనే పొత్తు అని కుండబద్దలు కొట్టారు . దీనిపై వైసీపీ ప్రధాన కార్యదర్శి ,ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణ రెడ్డి స్పందించారు
ఏపీలో వచ్చే ఎన్నికల్లో రాజకీయ పార్టీల పొత్తుల దిశగా సాగుతున్న ప్రచారంపై వైసీపీ ప్రధాన కార్యదర్శి, ఏపీ ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి సోమవారం నాడు స్పందించారు. ఈ సందర్భంగా తాను త్యాగం చేసేంకుకు సిద్ధమంటూ టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించిన సజ్జల…చంద్రబాబే త్యాగం అంటే జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను ముఖ్యమంత్రిని చేస్తారా? అని ప్రశ్నించారు.
ఈ సందర్భంగా సజ్జల మాట్లాడుతూ ఒకరు త్యాగాలకు సిద్ధమంటారు.. మరొకరు తానే సీఎం అంటున్నారు..ఇంకొకరేమో తాము కలవమంటారని ఆయా పార్టీల నుంచి వచ్చిన కామెంట్లను ప్రస్తావించారు. ఎన్నికల సమయంలోనే పొత్తులు కరెక్ట్ కాదన్న సజ్జల… జనాలంటే ఆ పార్టీలకు చులకన అయిపోయారన్నారు.
చంద్రబాబు కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వంలోనే పవన్ కల్యాణ్ నడుస్తున్నారని, పవన్ డైలాగులన్నీ చంద్రబాబు చెబుతున్నవేనని సజ్జల ఎద్దేవా చేశారు. చంద్రబాబు ఎన్ని జంప్‌లు చేశారో అందరికీ తెలుసని, చంద్రబాబు, పవన్ ఇప్పటికీ పొత్తులోనే ఉన్నారని ఆరోపించారు. పవన్ కల్యాణ్ వ్యూహం అంటున్నారని, అసలు వ్యూహం అంటే ఏమిటని సజ్జల ప్రశ్నించారు.