Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

రేపే వద్దిరాజు రవిచంద్ర రాజ్యసభ సభ్యుడుగా ప్రమాణ స్వీకారం

ఢిల్లీలో అభిమానుల కోలాహలం

ఖమ్మం ఎం పి నామ నాగేశ్వరరావు తో కలిసి ఢిల్లీ చేరుకున్న వద్ధిరాజు

టీఆర్ యస్ రాజ్యసభ సభ్యుడుగా ఏకగ్రీవంగా ఎన్నికైన వద్ధిరాజు రవిచంద్ర రేపు ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు రవిచేత ప్రమాణస్వీకారం చేయించనున్నారు. ఉదయం 11 గంటలకు జరిగే కార్యక్రమానికి కొద్దిమందినే అనుమతించనున్నారు. అయితే ఆయన అభిమానులు కార్యక్రమాన్ని తిలకించేందుకు భారీ ఎత్తున ఢిల్లీకి తరలివచ్చారు. ఖమ్మం ,వరంగల్ జిల్లాలనుంచే కాకుండా ఇతర ప్రాంతాలనుంచి ఆయన హితులు, సన్నిహితులు పెద్ద ఎత్తున తరలిరావడం విశేషం.

టీఆర్ యస్ లోకసభ పక్షనేత ఖమ్మం ఎం పి నామ నాగేశ్వరరావు తో కలిసి వద్ధిరాజు రవిచంద్ర హైద్రాబాద్ నుంచి ఢిల్లీ కి వెళ్లారు. ఆయన వెంట కుటుంబసభ్యులు కూడ ఉన్నారు. వారికి లోకసభ టీఆర్ యస్ పక్షనేత నామ నాగేశ్వరరావు నివాసంలో అతిధ్యం ఇచ్చారు.

Related posts

సీనియర్ పాత్రికేయులు అమర్ నాథ్ అంత్యక్రియలు

Drukpadam

ఇక షావోమీ చౌక కార్లు..! 2024లో విడుదల దిశగా ప్రయత్నాలు…

Drukpadam

ఇవ‌న్నీ నువ్వు నేర్పినవే నాన్నా!: వైఎస్ జ‌గ‌న్

Drukpadam

Leave a Comment