Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

బాలీవుడ్ ప్రముఖ గాయకుడు కేకే హఠాన్మరణం.. ప్రదర్శన ఇచ్చిన కాసేపటికే విషాదం!

బాలీవుడ్ ప్రముఖ గాయకుడు కేకే హఠాన్మరణం.. ప్రదర్శన ఇచ్చిన కాసేపటికే విషాదం!
-ఆడిటోరియంలో కాన్సర్ట్ అనంతరం అస్వస్థతకు గురైన కేకే
-వెంటనే ఆసుపత్రికి తరలించగా అప్పటికే మరణించినట్టు ధ్రువీకరణ
-తెలుగు, తమిళం, హిందీ సహా పలు భాషల్లో పాటలు పాడిన కేకే
-ప్రధానమంత్రి నరేంద్రమోదీ సహా పలువురి సంతాపం

బాలీవుడ్ ప్రముఖ గాయకుడు కృష్ణకుమార్ కున్నాథ్ హఠాన్మరణం చెందారు. ఆయన వయసు 53 సంవత్సరాలు. కేకేగా చిరపరిచితమైన ఆయన కోల్‌కతాలోని నజురుల్ మంచా ఆడిటోరియంలో ప్రదర్శన ఇచ్చారు. అనంతరం ఆయన అస్వస్థతకు గురికావడంతో వెంటనే ఆయనను సీఎంఆర్ఐ ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు కేకే మరణించినట్టు ధ్రువీకరించారు.

1990లలో ‘పాల్’, ‘యారోన్’ సినిమాల్లో ఆయన పాడిన పాటలు సంచలనం సృష్టించాయి. యువతలో ఆయన పాటలకు విపరీతమైన క్రేజ్ ఉండేది. స్కూల్, కాలేజీ, కల్చరల్ ఈవెంట్స్‌లో ఎక్కువగా ఈ పాటలు వినిపించేవి. హిందీ, తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం, మరాఠి, బెంగాలీ సహా పలు భాషల్లోనూ పాటలు పాడారు.

కేకే మరణవార్త ఆయన అభిమానులను, ప్రముఖులు, సన్నిహితులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆయన మృతికి సంతాపం ప్రకటిస్తూ ట్వీట్లు చేస్తున్నారు. కేకే మృతిపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన పాటలు అన్ని రకాల భావోద్వేగాలను ప్రతిబింబిస్తాయని, అన్ని వయసుల వారిని అలరిస్తాయని అన్నారు. ఆయన పాటల ద్వారా ఎప్పటికీ కేకేను గుర్తుంచుకుంటామని అన్నారు. కేకే కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.

చాలా విచారకరమని, కేకే మృతి వార్త తనను షాక్‌కు గురిచేసిందని బాలీవుడ్ ప్రముఖ నటుడు అక్షయ్ కుమార్ అన్నారు. కేకే మృతి తీరని లోటని పేర్కొన్నారు. కేకే పాటలు, ఆయన గాత్రం ఎప్పటికీ మనతోనే ఉంటాయని గాయకుడు పాపాన్ అంగారాగ్ ట్వీట్ చేశారు. దేవుడు ఆయన కుటుంబానికి ధైర్యాన్ని ప్రసాదించాలని ఆకాంక్షించారు.

కేకే మరణవార్త వినాల్సి రావడం విషాదకరమని, జీవితం ఎంత దుర్భలమైందో ఆయన మరణం మరోమారు గుర్తు చేసిందని టీమిండియా మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ ఆవేదన వ్యక్తం చేశాడు. ఆయన కుటుంబ సభ్యులు, స్నేహితులు, సన్నిహితులకు ప్రగాఢ సంతాపం తెలుపుతున్నట్టు పేర్కొన్నాడు.

Related posts

కరోనా ఉగ్రరూపం నేపథ్యంలో రాష్ట్రాలకు కేంద్రం తాజా మార్గదర్శకాలు

Drukpadam

ఏపీ మంత్రి విశ్వరూప్ కు ముంబై లీలావతి ఆసుపత్రిలో కొనసాగుతున్న చికిత్స ..

Drukpadam

కిమ్ కుమార్తె పై పాశ్చాత్య మీడియా అభ్యంతరకర రాతలు …!

Drukpadam

Leave a Comment