Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
క్రైమ్ వార్తలురాజకీయ వార్తలు

వ‌య‌నాడ్‌లోని రాహుల్ గాంధీ కార్యాల‌యంపై దుండగుల దాడి… 

వ‌య‌నాడ్‌లోని రాహుల్ గాంధీ కార్యాల‌యంపై దుండగుల దాడి… 
-వ‌య‌నాడ్ ఎంపీగా కొన‌సాగుతున్న రాహుల్ గాంధీ
-న‌గ‌రంలోని రాహుల్ కార్యాల‌యంపై దుండ‌గుల దాడి
-సీపీఎం ప్ర‌భుత్వ‌మే బాధ్య‌త వ‌హించాల‌న్న కేసీ వేణుగోపాల్‌
-నిందితుల‌పై చ‌ర్య‌లు తీసుకోవాల‌న్న రేవంత్ రెడ్డి
-ఈ త‌ర‌హా ఘ‌ట‌న‌ల‌ను కాంగ్రెస్ పార్టీ స‌హించ‌బోద‌ని హెచ్చ‌రిక‌

కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీకి చెందిన కార్యాల‌యంపై శుక్ర‌వారం గుర్తు తెలియ‌ని వ్య‌క్తులు దాడికి దిగారు. కేర‌ళ‌లోని వ‌య‌నాడ్ నుంచి రాహుల్ గాంధీ ఎంపీగా గెలిచిన సంగతి తెలిసిందే. ఈ క్ర‌మంలో వ‌య‌నాడ్‌లో ఆయ‌న త‌న కార్యాల‌యాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఈ కార్యాల‌యంపై శుక్ర‌వారం సాయంత్రం కొంద‌రు వ్య‌క్తులు మూకుమ్మ‌డిగా దాడికి దిగారు. ఈ దాడిలో కార్యాల‌యంలోని సామాగ్రి ధ్వంసం అయ్యింది.

ఈ దాడిపై కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా స్పందించింది. ఈ దాడికి చెందిన దృశ్యాలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ కాగా… కేర‌ళ‌లోని సీపీఎం ప్ర‌భుత్వ‌మే ఈ దాడికి బాధ్య‌త వ‌హించాల‌ని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. కేర‌ళ పోలీసుల క‌ళ్లెదుటే దుండ‌గులు దాడికి దిగార‌ని కేర‌ళ‌కు చెందిన కాంగ్రెస్ పార్టీ రాజ్య‌స‌భ స‌భ్యుడు కేసీ వేణుగోపాల్ ఆరోపించారు. వెర‌సి ఈ దాడి వెనుక సీపీఎం ఉంద‌ని ఆయ‌న ఆరోపించారు.

ఇదిలా ఉంటే… ఈ వీడియోను త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో పోస్ట్ చేసిన టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఘట‌న‌పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. దాడికి పాల్ప‌డ్డ వారిపై కేర‌ళ సీఎం పిన‌ర‌యి విజ‌య‌న్ త‌క్ష‌ణ‌మే చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఆయ‌న డిమాండ్ చేశారు. ఈ త‌ర‌హా ఘ‌ట‌న‌లు పున‌రావృతం కాకుండా చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని ఆయన కేర‌ళ స‌ర్కారును కోరారు. ఇలాంటి ఘ‌ట‌న‌ల‌ను కాంగ్రెస్ పార్టీ స‌హించ‌బోద‌ని కూడా రేవంత్ రెడ్డి హెచ్చ‌రించారు.

Related posts

కురుక్షేత్ర యుద్దాన్ని తలపిస్తున్న శాసనసభ …సింహగర్జన చేస్తున్న భట్టి ..

Ram Narayana

రాహుల్ ,ప్రియాంక వెంటే నా ప్రయాణం …నవజ్యోత్ సింగ్ సిద్దు ….

Drukpadam

నవీన్ రెడ్డి మాటలు నమ్మొద్దు… అతడిని నేను పెళ్లి చేసుకోలేదు: వైశాలి!

Drukpadam

Leave a Comment