Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

ఈడీ దాడుల త‌ర్వాత‌…చైనా పారిపోయిన వివో డైరెక్ట‌ర్లు!

ఈడీ దాడుల త‌ర్వాత‌… నేపాల్ మీదుగా రోడ్డు మార్గం ద్వారా చైనా పారిపోయిన వివో డైరెక్ట‌ర్లు!

  • వివో కంపెనీపై మ‌నీ ల్యాండ‌రింగ్ కేసు న‌మోదు
  • మంగ‌ళ‌వారం ఆ కంపెనీ కార్యాల‌యాల్లో ఈడీ సోదాలు
  • దొరికిపోయామ‌న్న భావ‌న‌తో చైనాకు పారిపోయిన‌ జాంగ్‌చెన్ హూ, జాంగ్జీ

చైనా మొబైల్ ఫోన్ల త‌యారీ సంస్థ వివోకు చెందిన ఇద్ద‌రు డైరెక్ట‌ర్లు జాంగ్‌చెన్ హూ, జాంగ్జీ… భార‌త్ నుంచి పారిపోయారు. మ‌నీ ల్యాండ‌రింగ్‌కు పాల్ప‌డుతోంద‌న్న ఆరోప‌ణ‌ల‌పై  వివో కంపెనీపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌రేట్ (ఈడీ) అధికారులు సోదాలు నిర్వ‌హించిన త‌ర్వాత వీరిద్ద‌రూ భార‌త్ నుంచి ప‌రార‌య్యారు. ఈ సంద‌ర్భంగా వీరు భార‌త్ నుంచి పారిపోయేందుకు విమాన‌యానాన్ని కాకుండా రోడ్డు మార్గాన్ని ఆశ్ర‌యించ‌డం గ‌మ‌నార్హం.

వివో కంపెనీల డైరెక్ట‌ర్ల ప‌రారీపై నేష‌న‌ల్ మీడియాలో ఆస‌క్తిక‌ర వార్త‌లు ప్ర‌సార‌మ‌వుతున్నాయి. భార‌త్‌లో కంపెనీని రిజిస్ట‌ర్ చేసే స‌మ‌యంలోనూ జాంగ్‌చెన్ హూ, జాంగ్జీ న‌కిలీ ప‌త్రాల‌నే స‌మ‌ర్పించిన‌ట్లు ఆరోప‌ణ‌లు వినిపిస్తున్నాయి. వివో ఫోన్ల విక్ర‌యాల‌తో భారీగా ఆదాయాన్ని ఆర్జించిన వివో… ప్ర‌భుత్వానికి చెల్లించాల్సిన ప‌న్నును మాత్రం విస్మ‌రించింది. దీంతో ఈ కంపెనీపై అనుమానం వ‌చ్చిన ఈడీ కేసు న‌మోదు చేసుకుని దర్యాప్తు మొద‌లుపెట్టింది.

ఈ క్ర‌మంలో దేశ‌వ్యాప్తంగా ఉన్న కంపెనీ కార్యాల‌యాల మీద ఈడీ అధికారులు మంగ‌ళ‌వారం ఏక కాలంలో సోదాలు చేప‌ట్టారు. ఈ సంద‌ర్భంగా పెద్ద ఎత్తున రికార్డుల‌ను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈడీకి త‌మ మ‌నీ ల్యాండ‌రింగ్ వ్య‌వ‌హారాల‌పై ప‌క్కా ఆధారాలు దొరికిపోయాయన్న భావ‌న‌తో జాంగ్‌చెన్ హూ, జాంగ్జీలు దేశం వ‌దిలి పారిపోయారు.

vivo directors flee india via nepal by road to china

Related posts

లైంగిక క్రూర‌త్వానికి వివాహం లైసెన్స్ కాదు: క‌ర్ణాట‌క హైకోర్టు

Drukpadam

ఈ స్నాక్స్ తో ఆకలి తీరడంతోపాటు ఆరోగ్యం కూడా!

Drukpadam

గొడ్డళ్లు, వేటకొడవళ్లతో నరికి.. వైసీపీ కార్యకర్త దారుణ హత్య

Ram Narayana

Leave a Comment