Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

పార్టీ అభివృద్ధికి కృషి చేస్తున్న వారికే టిక్కెట్లు ఇవ్వాలి: కోమటిరెడ్డి

పార్టీ అభివృద్ధికి కృషి చేస్తున్న వారికే టిక్కెట్లు ఇవ్వాలి: కోమటిరెడ్డి
పార్టీలో అసంతృప్తిగా లేను
కష్టపడేవాళ్ళకే టికెట్స్ ఇవ్వాలని కోరుతున్న
డేమేజ్ కంట్రోల్ దిశగా కాంగ్రెస్ నేతలు
సీనియర్లు జూనియర్లు కలిసి పనిచేయాలని సూచన

కాంగ్రెస్ పార్టీ మిషన్ తెలంగాణ ప్రారంభించిందని , రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు మాదే అని కాంగ్రెస్ నేతలకు ఢంకా భజాయించి మరి చెపుతున్నారు . నాయకుల మధ్య వైరాన్ని సొమ్ము చేసుకోవాలని అటు బీజేపీ , ఇటు టీఆర్ యస్ చూస్తున్నాయి . ఇటీవల కాంగ్రెస్ లో పలువు చేరికలతో మంచి ఊపు మీద ఉన్న కాంగ్రెస్ కు చేరికల విషయంలో నేతలమధ్య వస్తున్నా మనస్పర్థలు తొలగించేందుకు రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి మానిక్యం ఠాకూర్ రంగంలోకి దిగారు . అందులో భాగంగా ఆయన నేడు కోమటిరెడ్డి నివాసానికి వెళ్లారు . ఈ సందర్భంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీడియా తో మాట్లాడారు .

మొదటి నుంచి పార్టీలో ఉన్నవారికి, పార్టీ అభివృద్ధికి కృషిచేస్తున్నవారికి మాత్రమే టిక్కెట్లు ఇవ్వాలని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు.కోమటిరెడ్డి తన ఇంట్లో ఏర్పాటు చేసిన టి.కాంగ్రెస్ నేతలు భేటీకి పార్టీ ఇన్‌చార్జి మాణిక్కం ఠాకూర్, బోసురాజు, పలువురు నేతలు హాజరయ్యారు. ఇటీవల పార్టీలో ఎర్ర శేఖర్ చేరికపై కోమటిరెడ్డి అభ్యంతరం తెలిపిన నేపథ్యంలో టి.కాంగ్రెస్ నేతల సమావేశంపై ఆసక్తి నెలకొంది. పార్టీలో చేరికలు, రాహుల్‌ సభ ఏర్పాటు అంశంపై చర్చకు వచ్చే అవకాశం ఉంది..

పార్టీలో చురుగ్గానే ఉన్నా..అసంతృప్తిగా లేను

”మొదటి నుంచి పార్టీలో ఉన్నవారికి, పార్టీ అభివృద్ధికి కృషిచేస్తున్నవారికి టిక్కెట్లు ఇవ్వాలని అధిష్ఠానాన్ని కోరుతున్నా. పీఏసీకి రాలేనని నేను ముందే చెప్పా. 29 మందితో కమిటీ వేస్తే దానికి వెళ్లి..నేను ఏం మాట్లాడతా? పీఏసీ కమిటీ సభ్యులను నలుగురు, ఐదుగురికి కుదించాలి. డాక్టర్ రవి చేరిక చెల్లకపోతే బీల్యా నాయక్ చేరిక ఎలా చెల్లుతుంది? బీల్యా నాయక్ పార్టీకి వ్యతిరేకంగా పోటీ చేసి నష్టం చేశారు పార్టీలో చురుగ్గానే ఉన్నా..అసంతృప్తిగా లేను” అని వెంకటరెడ్డి అన్నారు..

Related posts

కేసీఆర్ పై పోటీకి సై అంటున్న తీన్మార్ మల్లన్న !

Drukpadam

అమేథి లో రాహుల్, ప్రియాంక కవాత్…భారీగా స్పందన!

Drukpadam

సిద్ధిపేట జిల్లా కలెక్టర్ వెంకట్రామిరెడ్డి రాజీనామా.. ఆమోదించిన ప్రభుత్వం!

Drukpadam

Leave a Comment