Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

సందేహాలు మిగుల్చుతున్న సర్వే రిపోర్టులు !

సందేహాలు మిగుల్చుతున్న సర్వే రిపోర్టులు !
తెలుగు రాష్ట్రాల్లో సర్వే కలకలం
తెలంగాణ రాష్ట్రంలో సర్వే పచ్చిబూటకమనే అబిప్రాయాలు
క్షేత్రస్థాయి పరిశీలన జరగలేదనే అనుమానాలు
టీఆర్ యస్ కు కాంగ్రెస్ కు ఓట్లు తగ్గి బీజేపీ పుంజుకుందనే దానిపై సందేహాలు
హైద్రాబాద్ లో మొదటినుంచి బీజేపీ బలంగానే ఉంది .
ఇక ,ఖమ్మం ,వరంగల్ లో పుంజుకున్న దాఖలాలు లేవు
నాగార్జున సాగర్ ఎన్నికల్లో బీజేపీ మూడవస్థానం
హుజారాబాద్ లో ప్రత్యేక పరిస్థిలో జరిగిన ఎన్నిక
ఈటల తప్ప ఎవరు పోటీచేసిన ఓటమి ఖాయం

వర్షాలు దంచి కొడుతున్నా వాగులు పొంగిపొర్లుతున్నా …. నదులు గ్రామాల్లోకి ,పట్టణాల్లోకి వస్తున్నానిన్నటి రోజున విడుదలైన సర్వే రాజకీయ వర్గాల్లో కాక పుట్టించింది కలకలం రేపింది…. తెలంగాణ లో కేసీఆర్ తిరిగి అధికారంలోకి వస్తాడని చెప్పగా…. ఆంధ్రప్రదేశ్ లో జగన్ గ్రాఫ్ పడిపోయిందని మరో సర్వే పేరుతొ వార్తలు వెలువడ్డాయి….. సర్వే చేసిన సంస్థలకు క్రెడిబులిటీ ఉంది…. అందువల్ల వారు తీసుకున్న అంశాలపై ఆరా తీస్తున్నారు …. గతంలో అనేక సర్వేలు చేసిన చరిత్ర ఆసంస్థది .వారి సర్వేలు అనేకం నిజమైయ్యాయి…. కానీ తెలంగాణపై చేసిన సర్వే పై అనేక సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. …అనుమానాలకు తావిస్తుంది….
తెలంగాణ రాష్ట్రంలో సర్వే పచ్చిబూటకమనే అబిప్రాయాలు ఉన్నాయి ….. క్షేత్రస్థాయి పరిశీలన జరగలేదనే అనుమానాలు బలంగా వ్యక్తం అవుతున్నాయి. …టీఆర్ యస్ కు కాంగ్రెస్ కు ఓట్లు తగ్గి బీజేపీ పుంజుకుందనే దానిపై సందేహాలు కలుగుతున్నాయి…..

 

హైద్రాబాద్ లో మొదటినుంచి బీజేపీ బలంగానే ఉంది .అక్కడ బీజేపీ నుంచి గట్టి పోటి ఉంటుందని మొదటినుంచి అనుకున్నదే అని అంటున్నారు . ఇక ,ఖమ్మంలో బీజేపీ సోదిలో లేదు .వరంగల్ లో పుంజుకున్న దాఖలాలు లేవు .గతంలో హన్మకొండ పార్లమెంట్ , హన్మకొండ అసెంబ్లీ సీట్లను బీజేపీ గెలిచింది. నాగార్జున సాగర్ ఎన్నికల్లో బీజేపీ మూడవస్థానం ..హుజారాబాద్ లో ప్రత్యేక పరిస్థిలో జరిగిన ఎన్నిక … అక్కడ ఈటల తప్ప ఎవరు పోటీచేసినా, ఓటమి ఖాయం అని తెలిసిందే ….మరి ఎక్కడ బీజేపీ, దాని బలం ఏమిటి ? రేపు అధికారంలోకి రావచ్చు ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే మాత్రం అంత సీన్ ఉండదని అంటున్నారు రాజకీయ పండితులు …

తిరిగి టీఆర్ యస్ అధికారంలోకి వస్తుందని సర్వే సారాంశం .కానీ అందులోనే కుటుంబ పాలనా అనే ముద్రవల్ల కేసీఆర్ లేదా , టీఆర్ యస్ బలం తగ్గిపోతుందని గత అసెంబ్లీ ఎన్నికలతో పోల్చితే 8 శాతం పైగా ఓట్లను కోల్పోయిందని చెబుతున్నారు . మరి అదే సందర్భంలో బీజేపీ గత అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం 7 శాతానికి దగ్గరగా ఉండగా ఇప్పడు ఏకంగా 31 శాతం అంటే 24 శాతం పెరిగిందని చెప్పటం పై అనుమానాలకు ఆస్కారం ఇచ్చే విధంగా ఉంది . తెలంగాణపై సర్వే వివరాలు ప్రకటించినప్పటికీ మరి నాగార్జున సాగర్ లో బీజేపీ అభ్యర్థికి వచ్చిన ఓట్ల వివరాలు చెప్పలేదు. పైగా జి హెచ్ ఎం సి ఓట్లు వివరాలు చెప్పి బీజేపీ బలం గురించి చెప్పుకొచ్చారు . ఖమ్మం ,వరంగల్ కార్పొరేషన్ ఎన్నికల గురించి కూడా ప్రస్తావించారు . బీజేపీ దేశంలో అధికారంలో లేనప్పుడే సికింద్రాబాద్ లోకసభ సీటు గెలిచింది. ముస్లిం , హిందూ సెంటిమెంటి తో బీజేపీ హైద్రాబాద్ లో ఎప్పటినుంచో బలగానే ఉంది. దాన్ని బట్టి మిగతా రాష్ట్రమంతా ఇదే ఇదంగా ఉందని అనుకుంటే పొరపాటే అవుతుందనే అబిప్రాయాలు ఉన్నాయి. అయితే అది సర్వే దాని ప్రామాణికాలు దానికి ఉంటాయని అంటున్నారు మరికొందరు …

రాష్ట్రంలో పాత పది జిల్లాలను తీసుకోని 2021 నుంచి 2022 జులై వరకు మూడు సార్లుగా చేసిన సర్వే లో మూడు జిల్లాల్లో కాంగ్రెస్ ,ఐదు జిల్లాలో బీజేపీ టీఆర్ యస్ గట్టి పోటీ ఇస్తుందని రెండు జిల్లాల్లో మాత్రమే త్రిముఖ పోటీ ఉంటుందని సర్వే సారాంశం .. వాస్తవానికి కరీంనగర్ జిల్లా అంతటా ఒకేలా లేదని అంటున్నారు అక్కడ పరిశీలకులుఅదే విధంగా ఖమ్మం ,వరంగల్ నల్లగొండ జిల్లాల్లో కాంగ్రెస్ పరిస్థితి కూడా సర్వే చెప్పినట్లు ఉండకపోవచ్చుఇటీవల ఒక నాయకుడు (బీజేపీకి అనుకూలమైన వ్యక్తి )కలిసి చెప్పిన విషయాలే సర్వే లో వెలుగు చూడటం ఆసక్తిగా ఉంది. సర్వే చెప్పిన విషయాలు బీజేపీ నేతలు అనేక సందర్భాల్లో చెబుతున్నారు . పైగా వివిధ పార్టీల నుంచి బలమైన నాయకులకు వేట ప్రారంభించారు . ఇప్పటికైతే బీజేపీ పరిస్థితి అంత ఆశాజనకంగా లేదని , అంతర్గతంగా వాళ్ళు అంగీకరిస్తున్నదే

అయితే ఇటీవల హైద్రాబాద్ లో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు ముగిసిన తరువాత పెద్ద బహిరంగసభ పెట్టారు .దానిలో ప్రధానితో సహా బీజేపీ ముఖ్యనేతలు ప్రసంగించారు . తరువాత రాష్ట్రంలో అనేక మంది బీజేపీ చేరేందుకు క్యూకడతారని భావించారు . కానీ విచిత్రంగా బీజేపీ సభల తర్వాత కాంగ్రెస్ లోకి వలసలు పెరిగాయి. మరికొందరి కాంగ్రెస్ లో చేరేందుకు సిద్దపడుతున్నారని వార్తలు వస్తున్నాయి. బీజేపీ లో చేరిన మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర రెడ్డి నెలకొక పెద్ద నాయకున్ని బీజేపీ లో చేర్పిస్తామని ఆ ఆపరేషన్ టీం లో ఉన్న ఆయన అనేక సందర్భాలలో చెప్పిన విషయాలే సర్వే రావడం గమనార్హం ….

ఓట్ల శాతాన్ని చెప్పిన సర్వే టీఆర్ యస్ కు 38 .88 శాతం ఓట్లు వస్తాయని చెప్పింది. బీజేపీ కి 30 .48 ,కాంగ్రెస్ కు 23 .71 శాతం ఓట్లు వస్తాయని ,ఇతరులకు 6 .9 శాతం ఓట్లు వస్తాయని చెప్పింది. అంటే మరికొద్ది రోజులు ఆగితే బీజేపీ గ్రాఫ్ గణనీయంగా పెరిగే అవకాశం కూడా లేకపోలేదు . కేసీఆర్ పాలన బాగున్నా కుటుంబ జోక్యం ఎక్కువగా ఉందని ప్రజలు బలంగా అభిప్రాయపడుతున్నారని చెప్పి కొంత కన్ఫ్యూజన్ క్రియేట్ చేసింది. చూద్దాం ఎన్నికల నాటికీ పరిస్థితులు ఎలాఉంటాయో …..

 

Related posts

ఎన్నికలు ఎప్పుడొచ్చినా గెలుపు మాదే: కాంగ్రెస్ ఇంచార్జి మాణిక్యం ఠాకూర్ !

Drukpadam

కర్ణాటక నూతన సీఎం సిద్ధరామయ్యకు ప్రధాని మోదీ శుభాకాంక్షలు…

Drukpadam

విపక్షాల ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన మార్గరెట్ అల్వా!

Drukpadam

Leave a Comment