గోదావరి వరదలపై భద్రాచలంలో సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు !
-క్లౌడ్ బరస్ట్ పై విదేశీ కుట్ర ఉందని అనుమానాలున్నాయన్నకేసీఆర్
-దీన్నిలోతుగా పరిశీలన చేయాలన్న కేసీఆర్
-గతంలోనూ లడక్ , ఉత్తరాఖండ్ లలో క్లౌడ్ బరస్ట్ జరిగిందన్న సీఎం
-గోదావరి పరివాహక ప్రాంతాల్లో సీఎం పర్యటన
-భద్రాచలం బ్రిడ్జి పై గోదావరమ్మకు పూజలు
-శాంతించు తల్లి అని కోరిన సీఎం
-చీరె,సారె సమర్పించిన కేసీఆర్
-భద్రాచలం , పినపాక నియోజకవర్గాలకు 1000 కోట్లు
-ముంపు ప్రాంతాల ప్రజలకు శాశ్విత కాలనీలు
-కరకట్టలు లీకులు లేకుండా చర్యలు
గోదావరి వరదలపై సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు . దీనిలో విదేశీ కుట్ర ఉండవచ్చునని కేసీఆర్ అనుమానం వ్యక్తం చేశారు . గతంలో లడక్ , ఉత్తరాఖండ్ లలో క్లౌడ్ బరస్ట్ జరిగినట్లు ఇక్కడకూడా జరిగి ఉండవచ్చునని అన్నారు . కేవలం గోదావరి పరివాహక ప్రాంతంలోనే ఒక్కసారిగా మేఘాలు విరిగి పడ్డట్లు వర్షలు వచ్చాయని అందుకనే అనుమానం కలుగుతుందని అభిప్రాయపడ్డారు . ఇంతపెద్ద వరదలను ఊహించలేదని సీఎం అభిప్రాయపడ్డారు . ఇంతటి విపత్తులో కూడా ఒక్క ప్రాణనష్టం జరగకుండా చర్యలు తీసుకున్న అధికార యంత్రాంగాన్ని ప్రజాప్రతినిధులను జిల్లా మంత్రిని అభినందిస్తున్నట్లు చెప్పారు . నిజంగా ఇది తమాషాగా అనిపిస్తుంది ఇంతటి పెద్ద ఎత్తున వరదలు రావడంపై అనుమానాలు ఉన్నాయని అన్నారు . కడెం ప్రాజెక్ట్ కు 5 లక్షలకు పైగా వరదలు రావడంతో , వచ్చిన వరదలు చూస్తే ప్రాజెక్ట్ ఉంటుందా పోతుందా అనే అనుమానాలు ఉన్నాయని కానీ దేవుడి దయవల్లనే అది నిలిచిందని తాను అభిప్రాయపడుతున్నట్లు సీఎం చెప్పారు . గోదావరికి వరదలు రావడం లోతట్టు ప్రాంతాల ప్రజలు నిరంతరం ఇదే ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని వారికీ శాశ్విత ప్రాతిపదికన ఇల్లు నిర్మించి ఇవ్వాలని అన్నారు . నన్నపనేని స్కూల్ లో పునరావాస కేంద్రాన్ని తాను సందర్శించానని వారు అంతా కూడా తమకు శాశ్వత పరిస్కారం కావాలని కోరుకుంటున్నారని అందువల్ల వారికీ మంచి ఎత్తైన ప్రాంతాల్లో ఇల్లు నిర్మించేందుకు చర్యలు చేపట్టాలని జిల్లా కలక్టర్ ,మంత్రికి పురమాయించారు .
భద్రాచలం , పినపాక నియోజకవర్గాల్లో శాశ్విత పరిస్కారం కోసం సింగరేణి ,ప్రభుత్వం కలిసి 1000 కోట్ల రూపాయలతో 3 నుంచి 4 వేల ఇళ్లతో కాలనీలు నిర్మించి వారిని ఖాళీ చేయించాలని అన్నారు . కాలనీ ల శంకుస్థాపనకు తానే స్వయంగా వస్తానని అప్పుడు కరకట్ట , స్లువీస్ గురించి కూడా ఆలోచన చేద్దామని అన్నారు . వరదలు అయిపోయినట్లు కాదని మళ్ళీవరదలు వచ్చే అవకాశం ఉందని సీఎం అభిప్రాయపడ్డారు .
ముంపు గ్రామల్లో అంటువ్యాదులు ప్రబలకుండా తక్షణ చర్యలు సీఎం ఆదేశాలు
ముంపు ప్రాంతాల్లో అంటువ్యాదులు రాకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని ,హెల్త్ క్యాంపు లు పెట్టాలని మందులు కొరత లేకుండా చూడాలని వెంట వచ్చిన రాత్రి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు ను మెడికల్ అండ్ హెల్త్ డైరెక్టర్ జి .శ్రీనివాసరావు ను ఆదేశించారు . ఆయన్ను నిన్ననే ప్రభుత్వ కొత్తగూడెం ,భద్రాచలం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ క్యాంపులకు ప్రత్యేక అధికారిగా నియమించింది.
ఖమ్మం జిల్లా కలెక్టర్ కూడా పుంపు ప్రాంతాల్లో సాధారణ పరిస్థితులు వచ్చేవరకు ఇక్కడే ఉండాలి
ఖమ్మం జిల్లా కలెక్టర్ వెరీ వచ్చారా ? రాలేదా ? ఆయన కూడా సీనియర్ అధికారి ఇక్కడే ఉండాలి సాధారణ పరిస్థితులు వచ్చేవరకు ఇక్కడ ఉండి పర్వేక్షణ చేయాలనీ సీఎం ఆదేశించారు . సి ఎస్ కు కూడా ఆ విధంగా చూడాలని అవసరమైతే మరికొంతమంది అధికారులను ఇక్కడకు డెప్యూటీ చేయాలనీ అన్నారు . తాను మళ్ళీ ఇక్కడకు వస్తానని ఇక్కడ నిర్మించబోయే కాలనీలకు తానే శంకుస్థాపన చేస్తానని అన్నారు . సీఎం వెంట మంత్రి హరీష్ రావు , ఎర్రబెల్లి దయాకర్ రావు , పువ్వాడ అజయ్ కుమార్ , ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వరరెడ్డి ,తాతా మధుసూదన్ రావు , కడియం శ్రీహరి , మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు , మాజీ స్పీకర్ మధుసూదన చారి , ఎమ్మెల్యేలు పొదెం వీరయ్య , రేగా కాంతారావు , వనమా వెంకటేశ్వరరావు , సండ్ర వెంకటవీరయ్య , మెచ్చ నాగేశ్వరరావు ,ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి , సోమేశ్ కుమార్ , డీజీపీ మహేందర్ రెడ్డి , పంచాయతీ రాజ్ కార్యదర్శి హనుమంతరావు , ప్రభుత్వ ఉన్నతాధి కారులు పాల్గొన్నారు .