Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

భద్రాచలం , పినపాక నియోజకవర్గాలకు వేయి కోట్లు ….సీఎం కేసీఆర్

భద్రాచలం , పినపాక నియోజకవర్గాలకు వేయి కోట్లు ….సీఎం కేసీఆర్
ముంపు ప్రాంతవాసులకు శాశ్విత కాలనీలు …నేనే వచ్చి శంకుస్థాపన చేస్తా
ప్రతి కుటుంబానికి 10 వేల రూపాయలు
భాదితులకు శాశ్విత పరిస్కారం కోసం 1000 కోట్లు
కరకట్ట లీకు కాకుండా చర్యలు
అధికారులకు ప్రజాప్రనిధుల సేవలకు అభినందనలు
మరోసారి భద్రాచలంలో పర్యటిస్తా …

గోదావరి వరద ప్రాంతాల్లో ముంపుకు గురౌతున్న భాదిత కుటుంబాలకు శాశ్విత ప్రాతిపదికన ఎత్తైన ప్రాంతంలో ఇల్లు నిర్మించి ఇస్తామని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు . నేడు భద్రాచలంలో పర్యటించిన సీఎం పునరావాస కేంద్రాల్లో తలదాచుకుంటున్న వారిని పరామర్శించారు . వారితో మాట్లాడి ముంపు ప్రాంతాల్లో నివాసమే ఉండకుండా ఎత్తైన ప్రదేశాల్లో ప్రభుత్వం ఇళ్లను నిర్మించి ఇస్తుంది వెళ్లేందుకు సిద్దమేనా అని అడిగారు . అందుకు భాదితులు సమ్మతి తెలపడంతో వెంటనే వాటి అమలుకు చర్యలు తీసుకోవాల్సిందిగా సీఎం జిల్లా కలెక్టర్ , మంత్రికి ఆదేశాలు జారీచేశారు .

గోదావరి ఉప్పొంగడంతో భద్రాచలం, పినపాక నియోజకవర్గాల ప్రజలు వరద తాకిడికి ఎక్కువగా గురయ్యాయి.వరదల వల్ల ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేయడం ప్రశంసనీయం. మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్లను, ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులకు అభినందనలుభద్రాచలంలో శాశ్వతంగా ముంపు సమస్యను పరిష్కరించాలని నిర్ణయించాం మని సీఎం అన్నారు . వరద ముంపు బాధితులకు శాశ్వత ప్రాతిపదికన కాలనీలను నిర్మిస్తాం .ఎత్తైన స్థలాల్లో రూ.1,000 కోట్లతో శాశ్వత కాలనీలను నిర్మించాలి . భద్రాచలం పట్టణ కాంటూరు లెవల్స్ ను పరిగణలోకి తీసుకోవాలి. కరకట్ట ప్రాంతాల్లోని ముంపు నివాసాలను కూడా తరలించాలి. బాధితులకు శాశ్వత పరిష్కారం ఏర్పాటు చేయాలి. శాశ్వత పరిష్కారం కోసం వెయ్యి కోట్ల నిధులను కేటాయిస్తున్నాం . ముంపు ప్రాంతాల్లో అంటువ్యాధులు ప్రబలకుండా నిరంతరం బ్లీచింగ్ చేయింలి . హెల్త్ డైరెక్టర్ జి.శ్రీనివాసరావుకు సీఎం కేసీఆర్ ఆదేశం .ఇందుకోసం అవసరమైతే ప్రత్యేక నిధులను అందజేస్తాం. ఖమ్మం జిల్లా కలెక్టర్ సహా సీనియర్ అధికారులను భద్రాచలం రప్పించాలి .రాముల వారి ఆలయం ముంపునకు గురికాకుండా శాశ్వత చర్యలు చేపడతాం. భద్రాచలం సీతారాముల పుణ్యక్షేత్రాన్ని ముంపు నుంచి రక్షించి, అభివృద్ధి చేస్తాం.ఇందుకోసం త్వరలోనే మరోసారి భద్రాచలంలో పర్యటిస్తా నని సీఎం కేసీఆర్ అన్నారు . సీతమ్మ పర్ణశాలను కూడా వరద నుంచి కాపాడేందుకు చర్యలు తీసుకుంటాం. ఇంకా వర్షాల ముప్పు పోలేదు. ఈ నెలాఖరుదాకా వానలు కొనసాగుతాయి జాగ్రత్తలు పాటించాల్సిందే అని సీఎం పేర్కొన్నారు .

మారిన వాతావరణ పరిస్థితుల్లో క్లౌడ్ బరస్ట్ లు జరుగుతున్నాయి. పర్యవసానంగా వరద ముంపు పెరుగుతున్నది. నిరంతరాయంగా కురిసే వర్షాల వల్ల తలెత్తే ఉత్పాతానికి నిదర్శనమే ఈ వరదలు. కడెం ప్రాజెక్టు దేవుని దయ వల్ల నిలబడింది. ఈ ప్రాజెక్టుకు నీటి వరద 2 లక్షల 90 వేల క్యూసెక్కులకు మించి దాటలేదు. కానీ ఇపుడు 5 లక్షలకు మించి పోయినా ప్రాజెక్టు నిలబడింది.
వాగులు వంకలు పొంగుతున్నయి, చెరువులు, కుంటలు నిండినయి. వానలు తగ్గినయని ప్రజలు అలక్ష్యం వహించవద్దు.దుమ్మగూడెం చర్ల మండలాల్లో నీటిపారుదలకు సంబంధించిన అంశాలు నా దృష్టికి వచ్చాయి. మొండికుంట వాగు, పాలెం వాగు బ్యాలెన్స్ పనులను పూర్తి చేస్తాం. బాధితులు ఎత్తైన ప్రాంతాల్లో నివాసాలు ఏర్పాటు చేసుకునే పరిస్థితులొచ్చాయి భద్రాచలం, బూర్గంపాడు, పినపాక ప్రాంతాల్లో పలు గ్రామాల్లో వరద సమస్యలు ఉత్పన్నమయ్యాయి.రైతుల పంటలు నీట మునిగాయి. సమీక్షించి తగు సహాయం అందిస్తాం .పునరావాస కేంద్రాల్లో ఉన్న వారిని పరిస్థితులు చక్కదిద్దుకున్న తర్వాతే ఖాళీ చేయించాలి .ఒక్కో కుటుంబానికి 20 కిలోల చొప్పున మరో 2 నెలలపాటు ఉచితంగా బియ్యం అందజేస్తాం. వరద ముంపు బాధిత కుటుంబాలకు తక్షణ సహాయం కింద రూ.10 వేలు అందజేస్తాం. ప్రజలంతా మరో 15 రోజులు జాగ్రత్తగా ఉండాలి. రిలాక్స్ కాకూడదు. అలర్ట్ గా ఉండాలి. హైదరాబాద్ నుంచి మేం ఇచ్చిన ఆదేశాలను అనుసరించి ప్రజలను వరదల నుంచి రక్షించి, ప్రాణహాని జరగకుండా కాపాడిన వారందరికీ అభినదానాలని సీఎం అన్నారు .

Related posts

మతిమరుపా …? అయితే ఈ ఆహారం తీసుకోవాల్సిందే …!

Drukpadam

పసిఫిక్ మహాసముద్రంలో బద్దలైన భారీ అగ్నిపర్వతం… పలు దేశాలకు సునామీ హెచ్చరికలు!

Drukpadam

తెలంగాణలో ఎన్నికలు జాతకాల ఆధారంగా నడుస్తున్నాయి: సుప్రీంకోర్టు!

Drukpadam

Leave a Comment