Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

తిరుపతి రాళ్లదాడిపై ఎన్నికల సంఘానికి టీడీపీ ఫిర్యాదు…

తిరుపతి రాళ్లదాడిపై ఎన్నికల సంఘానికి టీడీపీ ఫిర్యాదు
చంద్రబాబుకు మరింత భద్రతా కల్పించాలిని వినతి
-కేంద్రబలగాలను పంపండి
-లోకసభ ఎన్నికలు -మీదే భాద్యత
-శాంతిభద్రల విషయంలో సరైన చర్యలు తీసుకోవాలి
-టీడీపీ ఎంపీ రామ్మోహననాయుడు

టీడీపీ అధినేత చంద్రబాబుపై తిరుపతిలో జరిగిన రాళ్ల దాడి అంశాన్ని కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్ కు వివరించామని ఎంపీ రామ్మోహన్ నాయుడు వెల్లడించారు. ఇవాళ ఢిల్లీలో సీఈసీని కలిసిన అనంతరం రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ, లోక్ సభ ఎన్నికల వేళ సీఈసీకి ఎక్కువ బాధ్యత ఉంటుందని అభిప్రాయపడ్డారు. రాళ్ల దాడి ఘటనపై సరైన దిశగా విచారణ జరపాలని, ఘటనకు కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. చంద్రబాబు ప్రచారానికి మరింత భద్రత కల్పించాలని అన్నారు. తిరుపతి ఎన్నికలకు కేంద్ర బలగాలను పంపాలని కోరామని తెలిపారు. వైసీపీకి ఓటేయకుంటే పథకాలు ఆగిపోతాయని బెదరిస్తున్నారని రామ్మోహన్ ఆరోపించారు. ఓట్లు దండుకోవాలనే ఆలోచనతోనే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని విమర్శించారు.వైసీపీ అరాచకాలకు తాము భయపడని అన్నారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ మాకు ప్రత్యర్థిగా ఉన్నందునే తమకు ఎన్నికల నిర్వహణపై అనుమానాలు ఉన్నాయని అందువల్ల తమపార్టీ కార్యకర్తలకు నాయకులకు భద్రతా కల్పించాలని కోరారు. ఇందుకోసం ఎన్నికల సంఘం మరింత భాద్యత తీసుకోవాలని కోరినట్లు తెలిపారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పైనే దాడి జరిగితే సామాన్యకార్యకర్తల పరిస్థితి ఏమిటని ఆయన ప్రశ్నించారు. రాష్ట్ర పోలీసులు పక్షపాతంగా వ్యవహరించే అవకాశం ఉన్నందున కేంద్ర బలగాలను పంపాలని కోరినట్లు తెలిపారు. తిరుపతిలో తమ పార్టీ అభ్యర్థి పనబాక లక్ష్మి గెలిచే అవకాశం ఉందని వైకాపా దౌర్జన్యాలకు పాల్పడుతుందని అన్నారు. అందులో భాగంగానే చందరబాబు పై దాడి జరిగిందని అన్నారు. ప్రజలు 22 నెలల జగన్ రెడ్డి పాలనా చూసి విసుగు చెందారని అందువల్ల ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పు ఇవ్వనున్నారని అభిప్రాయపడ్డారు. చంద్రబాబుకు మరింత భద్రతా కల్పించాలని ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు.ఇప్పటికే జడ్ కేటగిరి భద్రతలో ఉన్న చంద్రబాబు కు మరింత భద్రతా కావాలని అన్నారు.

Related posts

ఢిల్లీలో కేసీఆర్‌… బీఆర్ఎస్ కార్యాల‌యాన్ని ప‌రిశీలించిన తెలంగాణ సీఎం!

Drukpadam

నన్ను హత్య చేసేందుకు ప్రయత్నిస్తున్నారు: ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు…

Drukpadam

యూపీ ప్రచారంలో కొత్తపుంతలు..వర్చువల్ సభలు

Drukpadam

Leave a Comment