Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కన్ఫ్యూజన్ లో ఉన్నారా ? కన్ఫ్యూజన్ చేస్తున్నారా ??

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కన్ఫ్యూజన్ లో ఉన్నారా ? కన్ఫ్యూజన్ చేస్తున్నారా ??
-అమిత్ షా తో భేటీ నిజమేనంటాడు… కాంగ్రెస్ ను వీడేదిలేదని అంటాడు
-ఏది నమ్మాలో అర్థం కాక అయోమయంలో అనుయాయిలు
-టీఆర్ఎస్‌ను ఓడించే పార్టీలోనే ఉంటాన‌న్న రాజ‌గోపాల్ రెడ్డి
-కాంగ్రెస్‌ను వీడేది లేదన్న మునుగోడు ఎమ్మెల్యే
-బీజేపీలో చేర‌తారంటూ కోమ‌టిరెడ్డిపై ప్ర‌చారం
-బీజేపీ వలకు రాజగోపాల్ రెడ్డి చిక్కుతారా ? జారుకుంటారా ??

న‌ల్ల‌గొండ జిల్లా మునుగోడు ఎమ్మెల్యేగా కొన‌సాగుతున్న కాంగ్రెస్ నేత కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి కన్ఫ్యూజన్ లో ఉన్నారా ? కన్ఫ్యూజన్ చేస్తున్నారా ?? అనేదానిపై తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తి నెలకొన్నది . ఆయన చాల రోజులుగా బీజేపీలో చేర‌తారంటూ ప్ర‌చారం జరుగుతున్న సంగ‌తి తెలిసిందే. ఇటీవ‌లే కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో కోమ‌టిరెడ్డి భేటీ అయ్యార‌న్న వార్త‌ల‌పై ఆయ‌న తాజాగా స్పందించారు. తాను అమిత్ షాతో భేటీ అయిన మాట వాస్త‌వమేనని కూడా వెల్ల‌డించారు. అదే సందర్భంలో తాను కేసీఆర్ ను ఓడించే పార్టీలో చేరతానని చెబుతుంటారు . ఆయన మాటలను బట్టి ఆయన బీజేపీ లో చేరతారని అనుకునే దానికి బలం చేకూరుతుంది. మరో సందర్భంలో తాను కాంగ్రెస్ ని వీడేది లేదని అంటుంటారు .అయితే . తెలంగాణ‌లో టీఆర్ఎస్‌ను ఓడించే పార్టీలో ఉంటాన‌ని ఆది నుంచి చెబుతూ వ‌స్తున్న కోమ‌టిరెడ్డి… తాను గ‌తంలో చెప్పిన మాట‌కే క‌ట్టుబ‌డి ఉన్నాన‌ని తెలిపారు.

రాజగోపాల్ రెడ్డి ఇటీవల కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా ను కలిశారు . కలిసిన మాట నిజమేనని ఆయన అంగీకరించారు. ఈ సందర్భంగా అమిత్ షా ఎమ్మెల్యే పదవి రాజీనామా చేసి బీజేపీ లో చేరమని సలహా ఇచ్చినట్లు తెలిసింది. అప్పుడు మరో ఎన్నిక వస్తుందని అందులో కూడా బీజేపీ గెలిస్తే టీఆర్ యస్ పని అయిపోయిందని ప్రచారం చేసి లబ్ది పొందవచ్చని బీజేపీ ప్లాన్ . రాజగోపాల్ రెడ్డి బీజేపీకి చెందిన ఝార్ఖండ్ ఎంపీ నిషికాంత్‌ దూబే తో కలిసివెళ్లి అమిత్ షా ను కలిశారు . ఒకవేళ రాజగోపాల్ రెడ్డి బీజేపీ లో చేరితే తెలంగాణలో మరో ఉప ఎన్నిక జరిగే అవకాశాలు ఉన్నాయి.

అమిత్ షా వచ్చే నెల మొదటి వారంలో వరంగల్ లో జరిగే బహిరంగ సభలో పాల్గొనేలా ప్రణాళికలు సిద్దం చేస్తున్నారు. ఆ సభలోనే రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరేలా బీజేపీ పధక రచన చేస్తున్నట్లు సమాచారం . బీజేపీలో చేరేముందే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని అమిత్ షా కోరినట్లు తెలుస్తుంది . అందులో భాగంగానే త్వరలోనే రాజగోపాల్ రెడ్డి తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారని అంటున్నారు . దీని ద్వారా మునుగోడు అసెంబ్లీకి ఉప ఎన్నిక తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. మునుగోడులో ఉప ఎన్నిక జరిగితే రాజగోపాల్ రెడ్డి గెలుపు కష్టం కాదనే అభిప్రాయం బీజేపీ లో ఉంది . దీని ద్వారా కేసీఆర్ సర్కార్ ను మరింత పలచన చేయవచ్చునని బీజేపీ పెద్దలు వ్యూహరచన చేస్తున్నారు . మరి రాజగోపాల్ రెడ్డి బీజేపీ వలలో చిక్కుతారా …జారుకుంటారా? వేచి చూడాల్సిందే! .

Related posts

నేటి భారత్ బంద్ సక్సెస్… రాకేశ్ తికాయత్ ప్రకటన!

Drukpadam

సిద్ధూ తల్లిని కూడా పట్టించుకోని క్రూరుడు… తీవ్ర ఆరోపణలు చేసిన సోదరి!

Drukpadam

కశ్మీర్ నుంచి కన్యా కుమారి వరకు వివక్ష బాధతో ఉన్న వర్గం ఏదైనా ఉందంటే అది దళితజాతే: సీఎం కేసీఆర్!

Drukpadam

Leave a Comment