వరదలతో వడోదర వాసులను భయపెట్టిన మొసళ్లు!
- భారీ వర్షాలతో విశ్వామిత్ర నదికి వరదలు
- పొంగి ప్రవహించిన నది
- నది నుంచి బయటకు కొట్టుకువచ్చిన మొసళ్లు
- అపార్ట్ మెంట్ ఆవరణల్లోకి ప్రవేశం
గుజరాత్ రాష్ట్రంలోని వడోదర లో వర్షాలకు నగరం సముద్రంలా మారింది. ఎక్కడ చుసిన వరదల యంతో నగర ప్రజలు భీతిల్లి పోయారు . విద్యాలయాలకు , ఆఫీసులకు ,ఫ్యాక్టరీలకు వెళ్లిన వారు తిరిగి రావడానికి ఇబ్బందులు పడ్డారు . వారికోసం రెస్క్యూ టీం లు రంగంలోకి దిగాయి. ఎన్డీఆర్ఫ్ బృందాలు ప్రజల రక్షణ చర్యల్లో పాల్గొన్నాయి. నగరం వరదల్లో ముసళ్ల కనిపించడంతో ప్రజలు ఠారెత్తారు. బతుకు జీవుడా అనుకుంటూ పరుగులు తీశారు . భారీ వర్షాలతో పక్కనే ఉన్న విశ్వామిత్ర నదికి వరదలు వచ్చాయి. నది పొంగి ప్రవహించడంతో ఒక్కసారిగా వడోదర నగరంలోకి వరదలు వచ్చి ఇల్లు మునిగిపోయాయి. ప్రజలు భీతిల్లి పోయారు విశ్వామిత్ర నది నుంచి ముసళ్ళుకూడా నగరంలోకి ప్రవేశించాయి. .
గుజరాత్ లోని వడోదర వాసులను మొసళ్లు వణికించాయి. ఇటీవలి భారీ వర్షాలతో విశ్వామిత్ర నది పొంగి ప్రవహించింది. విశ్వామిత్ర నది 250 మొసళ్లకు ఆశ్రయమిస్తోంది. నదికి వరదలు రావడంతో ఆ నీరు వడోదరలోని లోతట్టు ప్రాంతాలను ముంచెత్తింది. నీటితోపాటు మొసళ్లు కూడా పట్టణంలోకి కొట్టుకువచ్చాయి. అపార్ట్ మెంట్ వాసులు.. తమ ఇంటి ఆవరణలోకి మొసళ్లు వచ్చాయంటూ అటవీ అధికారులకు సమాచారం ఇచ్చారు.
దాంతో వాటిని పట్టుకునేందుకు పలు బృందాలను అధికారులు ఏర్పాటు చేశారు. ఇలా కొట్టుకువచ్చిన మొసళ్లలో చిన్నవి, పెద్దవి కూడా ఉన్నాయి. డ్రైనేజీల్లో ఎన్నో కిలోమీటర్ల మేర అవి కొట్టుకుపోయాయి. రంగంలోకి దిగిన అటవీ సిబ్బంది పలు ప్రాంతాల్లో మొసళ్లను బంధించి తీసుకెళ్లారు.