Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలు ….తాను బరిలో లేనన్న దిగ్వి జయ్ సింగ్ ..

కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయడంపై క్లారిటీ ఇచ్చిన దిగ్విజయ్ సింగ్

  • అధ్యక్ష పదవికి పోటీ పడటం లేదన్న దిగ్విజయ్ 
  • బరిలో నిలిచిన అశోక్ గెహ్లాట్, శశిథరూర్
  • గెహ్లాట్ గెలుపుకే అధిక అవకాశాలు

కాంగ్రెస్ అధ్యక్ష పదవికోసం పోటీపడదామనుకున్న సీనియర్ కాంగ్రెస్ నేత మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దిగ్వి జయ్ సింగ్ తాను పోటీలో లేనని క్లారిటీ ఇచ్చారు . పార్టీ నిర్ణయాన్ని పాటిస్తానని స్పష్టం చేశారు . దీంతో అధ్యక్ష పదవికోసం రాజస్థాన్ సీఎం అశోక్ గేహలోట్ ఎంపీ శశిథరూర్ మధ్య పోటీ ఖాయంగా కనిపిస్తుంది. అయితే శశిథరూర్ కి కేరళ నుంచే వ్యతిరేకత ఉండటంతో పరిస్థితులు ఎలాఉంటాయనే విషయంపై ఆయన సీనియర్లతో సమాలోచనలు జరుపుతున్నారు . అధ్యక్ష ఎన్నిక నేపథ్యంలో సీనియర్ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తన భారత్ జోడో యాత్రకు ఒకరోజు విరామం ఇచ్చి ఢిల్లీ చేరుకొని నాయకులతో చర్చలు జరిపారు .నామినేషన్లకు గడువు ఈనెల చివరివరకు ఉన్నందున ఎవరు బరిలో ఉంటారనే విషయం అప్పటివరకు సస్పెన్స్ కొనసాగే అవకాశమే కనపడుతుంది.

కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి తాను కూడా పోటీ చేయబోతున్నట్టు జరుగుతున్న ప్రచారానికి దిగ్విజయ్ సింగ్ తెరదించారు. తాను పోటీ పడటం లేదని ఆయన తెలిపారు. మధ్యప్రదేశ్ లోని జబల్ పూర్ లో పత్రికా సమావేశంలో ఆయన మాట్లాడుతూ… తాను పోటీ చేయబోనని… తనకు హైకమాండ్ ఇచ్చే సూచనలను పాటిస్తానని చెప్పారు.

ఇక దిగ్విజయ్ ప్రకటనతో కన్ఫ్యూజన్ మొత్తం తొలగిపోయింది. పార్టీ టాప్ పోస్ట్ కు కేవలం అశోక్ గెహ్లాట్, శశిథరూర్ మాత్రమే పోటీ చేస్తున్నారనే విషయం స్పష్టమయింది. అయితే గాంధీ కుటుంబానికి అత్యంత విధేయుడైన గెహ్లాట్ కే గెలిచే అవకాశాలు ఉన్నాయి. శశిథరూర్ కు మద్దతు తక్కువగా ఉన్నట్టు తెలుస్తోంది.

కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి నిర్దేశిత షెడ్యూల్ ప్రకారం గురువారం ఉదయం నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ప్రకారం ఈ నెల 24 నుంచి మొదలు కానున్న నామినేషన్ల స్వీకరణ ఈ నెల 30తో ముగియనుంది. అక్టోబర్ 1న నామినేషన్ల పరిశీలన జరుగుతుంది. నామినేషన్ల ఉపసంహరణకు అక్టోబర్ 8 వరకు గడువు ఉంది. ఆ తర్వాత బరిలో ఒకరి కంటే ఎక్కువ మంది అభ్యర్థులు ఉంటే… అక్టోబర్ 17న పోలింగ్ నిర్వహిస్తారు. అక్టోబర్ 19న ఫలితాలను వెల్లడిస్తారు.

Related posts

పెరిగిన మంత్రి హరీష్ రావు ప్రాధాన్యత….

Drukpadam

వరంగల్ సభకు రాహుల్‌గాంధీ.. అధికారంలోకి రాకుండా ఎవరూ అడ్డుకోలేరన్న రేవంత్!

Drukpadam

షర్మిల పార్టీ కోసం వడివడిగా అడుగులు

Drukpadam

Leave a Comment