Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

విషాదం ,విషాదం…ఒకే రోజు రెండు రాష్ట్రాల్లో గాయకుడి ,నాట్యకారుడు మృతి !

విషాదం: పాటలు పాడుతూ గాయకుడు.. గర్భా నృత్యం చేస్తూ యువకుడి మృతి

  • ఒడిశాలో సంగీత విభావరిలో గాయకుడి మృతి
  • మహారాష్ట్రంలో గర్భానృత్యం చేస్తూ ప్రాణాలొదిలిన యువకుడు
  • కుమారుడి మరణవార్త తెలిసి కన్నుమూసిన తండ్రి

దసరా ఉత్సవాల్లో భాగంగా ఒడిశాలోని జయపురంలోని జగత్ జనని ఆలయంలో ఏర్పాటు చేసిన సంగీత విభావరి విషాదాంతమైంది. ఈ  విభావరిలో మురళీ ప్రసాద్ మహాపాత్రా  (59) అనే గాయకుడు రెండు పాటలు పాడారు. ఆపై విశ్రాంతి తీసుకుంటూ ఒక్కసారిగా గుండెపోటుతో కుప్పకూలారు. వెంటనే అప్రమత్తమైన నిర్వాహకులు, కళకారులు, శ్రోతలు వెంటనే ఆయనను  ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే ఆయన మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. కోరాపుఠ్ జిల్లాకు చెందిన మురళి ‘ఖోకా భాయ్’గా అందరికీ సుపరిచితం. మురళీ ప్రసాద్ గత కొంతకాలంగా హృద్రోగ సమస్యలతోపాటు మధుమేహంతో బాధపడుతున్నట్టు ఆయన సోదరుడు బిభూతి ప్రసాద్ మహాపాత్రా తెలిపారు.

కాగా, మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లా విరార్ పట్టణంలో జరిగిన మరో ఘటనలో మనీశ్ నర్జాపీ (35) గర్భా నృత్యం చేస్తూ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. దీంతో ఆయనను వెంటనే ఆసుపత్రికి తరలించారు. అక్కడాయనను పరీక్షించిన వైద్యులు చనిపోయినట్టు నిర్ధారించారు.  కుమారుడి మరణవార్త విన్న మనీశ్ తండ్రి సోనిగ్రా ఆసుపత్రిలో కుప్పకూలి మరణించారు. అయితే, వీరి మరణానికి కారణం ఏమిటన్నది తెలియరాలేదు. పోస్టుమార్టం అనంతరం వారి మృతికి కారణం వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు.

Related posts

గోదావరి వరదలపై భద్రాచలంలో సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు…!

Drukpadam

ముచ్చింతల్ లో ముగిసిన రామానుజ సహస్రాబ్ది వేడుకలు!

Drukpadam

ప్రతి 5 కిలోమీటర్లకు ఒక చార్జింగ్ స్టేషన్..ప్రైవేటు సంస్థలకు అనుమతి..

Drukpadam

Leave a Comment