Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

టీఆర్ యస్ ఇకనుంచి బీఆర్ యస్ …భారత రాజకీయ చిత్రపటంపై మరోపార్టీ!

టీఆర్ యస్ ఇకనుంచి బీఆర్ యస్ …భారత రాజకీయ చిత్రపటంపై మరోపార్టీ!
-రేపు టీఆర్ఎస్ కీల‌క స‌మావేశం…హాజ‌రు కానున్న‌ క‌ర్ణాట‌క మాజీ సీఎం, త‌మిళ‌నాడు వీసీకే పార్టీ అధినేత‌
-ఏ రాష్ట్రంలో ఇప్పటివరకు శాఖలు లేకుండానే నేరుగా జాతీయ రాజకీయాల్లోకి కేసీఆర్
-తెలంగాణ అభివృద్ధిని దేశమంతా చాటేందుకు ఏర్పాట్లు
-సొంత విమానం కొనుగోలు …పార్టీ క్యాడర్ ను వివిధ రాష్ట్రాలకు ఇంచార్జిలుగా నియమించే అవకాశం

టీఆర్ యస్ ఇక బీఆర్ యస్ గా మారనున్నది …ఎప్పటినుంచో జాతీయ రాజకీయాల్లోకి రావాలని ఉవిళ్ళూ ఊరుతున్న కేసీఆర్ సొంతపార్టీ పెట్టి బలమైన బీజేపీని ఢీకొనాలని చూస్తున్నారు .అందుకు అనుగుణంగా గత రెండు మూడు సంత్సరాలుగా సీరియస్ ఎఫర్ట్ పెట్టారు.దేశంలో వివిధరాష్ట్రాల్లో పర్యటించారు.సరిహద్దుల్లో చనిపోయిన అమర జవాన్ల కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించారు.బీజేపీ పై యుద్ధం ప్రకటించిన ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకున్నారు. దేశంలో అనేకమంది ఉద్దండులను కాదని కేసీఆర్ పెడుతున్న పార్టీకి ప్రజలనుంచి ఎలాంటి సహకారం ఉంటుంది అనే సందేహాలు లేకపోలేదు.

దసరా పండగ రోజున జాతీయ పార్టీ ప్రకటనకు ఏర్పాట్లు ..

దసరా అంటేనే మంచి ముహూర్తం చెడుపై మంచి విజయం సాధించిరోజు అని అందుకే దానికి విజయదశమి అని పేరు పెట్టారు . అందువల్ల తాను కొత్తగా పెట్టబోయే జాతీయపార్టీకి కేసీఆర్ “భారత రాష్ట్రీయ సమితిగా” నామకరణ చేశారని ఆపార్టీ వర్గాలు తెలిపాయి.దాన్ని దసరారోజున లాంఛనంగా ప్రకటించనున్నారు. దీనికోసం అన్ని ఏర్పాట్లు చేశారు.కేసీఆర్ పార్టీ పేరు ప్రకటించగానే దేశ రాజధాని ఢిల్లీతోపాటు ,వివిధదేశాల్లో పెద్ద ఎత్తున సంబరాలు జరిపేందుకు కేసీఆర్ అభిమానులు ,టీఆర్ యస్ కార్యకర్తలు రెడీగా ఉన్నారు .సంబరాలు అంబరాన్ని అంటనున్నాయి. రాష్ట్ర రాజధాని హైద్రాబాదుతోపాటు తెలంగాణ అంతటా దసరా దీపావళి ఒకేసారి వచ్చిందా అనేట్లుగా పార్టీ ప్రకటన ఉత్సవాలు జరిపేందుకు పథకరచన చేశారు . దేశమంతా బాంబుల మోతతో దద్దరిల్లాలని కేసీఆర్ దిశానిర్దేశం చేశారు .

ఏ రాష్ట్రంలో శాఖలు లేకుండానే జాతీయపార్టీ

కేసీఆర్ దేశమంతా చుట్టినా ఇప్పటివరకు ఏ రాష్ట్రంలోనూ బీఆర్ యస్ లో చేరేందుకు ముందుకు వస్తున్న సూచనలు ఇప్పటివరకు లేవు . అయితే అనేక రాష్ట్రాల్లో ప్రతిపక్షాలతో సంబంధాలు ఉన్నాయి. ప్రధానంగా కర్ణాటకలో జేడీఎస్ నేతలు కుమారస్వామి, తమిళనాడు , యూపీలో ఎస్పీ నేత అఖిలేష్ ఝార్ఖండ్ సీఎం తో సంబంధాలు కలిగి ఉన్నారు .

ఈ స‌మావేశానికి టీఆర్ఎస్‌కు చెందిన కీల‌క నేత‌లందరితో పాటు పొరుగు రాష్ట్రాల‌కు చెందిన రాజ‌కీయ పార్టీల నేత‌లు కూడా హాజ‌రు కానున్నారు. ఈ స‌మావేశానికి జేడీఎస్ నేత‌, క‌ర్ణాట‌క మాజీ ముఖ్య‌మంత్రి కుమార‌స్వామి హాజ‌రు కానున్నారు. త‌మిళ‌నాడుకు చెందిన విడుత్త‌లై చిరుత్తైగ‌ల్ క‌ట్చీ (వీసీకే) అధినేత‌, ఎంపీ తిరుమావ‌ల‌వ‌న్ కూడా హాజ‌రు కానున్నారు.

గాంధీజీ చూపిన అహింసా మార్గంలో కేసీఆర్ రాష్ట్రాన్ని సాధించడమే కాక ప్రజలను కంటికి రెప్పలా చూసుకుంటూ అన్ని విధాలా ప్రగతిపథాన నడిపిస్తున్న కేసీఆర్ సుపరిపాలనలో జరుగుతున్న అభివృద్ధిని చూసి మన సరిహద్దున ఉన్న మహారాష్ట్ర, కర్ణాటకలకు చెందిన పలు గ్రామాల ప్రజలు తాము కూడా తెలంగాణలో కలిసిపోతామంటున్న…… విషయాన్ని టీఆర్ యస్ నేతలు గుర్తు చేశారు. తెలుగులోనే కాక ఇంగ్లీష్,హిందీ భాషల్లో మంచి పట్టు ఉన్న, సుధీర్ఘ రాజకీయ,పాలనానుభవం,దేశ సమకాలీన పరిస్థితులపై లోతైన అవగాహన ఉన్న కేసీఆర్ జాతీయ పార్టీని ఏర్పాటు చేయడం సముచితంగా ఉంటుందని .బిఆర్ఎస్ ఏర్పాటుతో భారత రాజకీయాల్లో గుణాత్మకమైన మార్పు వస్తుందని,పలు ప్రాంతీయ పార్టీలు ఇందులో విలీనం కావడం, మరికొన్ని కూటమిలో చేరడంతో బిఆర్ఎస్ బలమైన రాజకీయ శక్తిగా అవతరిస్తుందని విశ్వాసాన్ని టీఆర్ యస్ నేతలు వ్యక్తం చేస్తున్నారు .

.

Related posts

ఆప్ ఉచిత పథకాలను గుజరాత్ ప్రజలు తిరస్కరించారు ..అమిత్ షా !

Drukpadam

బొత్స సంగతి సరే… చంద్రబాబు దగ్గర నువ్వేం చేస్తున్నావు?: పేర్ని నాని!

Drukpadam

చంద్రబాబు ,అమిత్ షా ఫోన్ సంబాషణపై సజ్జల వ్యంగ్య బాణాలు!

Drukpadam

Leave a Comment