Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

హిందీ వాళ్లనే భారతీయుల్లా.. మిగతావారిని ద్వితీయశ్రేణి పౌరుల్లా చూడొద్దు: స్టాలిన్​

హిందీ వాళ్లనే భారతీయుల్లా.. మిగతావారిని ద్వితీయశ్రేణి పౌరుల్లా చూడొద్దు: స్టాలిన్​

  • అమిత్ షా నేతృత్వంలో హిందీ భాష పార్లమెంటరీ కమిటీ నివేదిక
  • తమిళనాడు సీఎం ఫైర్
  • హిందీని అధికారి భాషగా గుర్తించాలన్న ప్రతిపాదనలు సరికాదని వెల్లడి
  • మరో భాషా యుద్ధానికి తెరతీయవద్దని వ్యాఖ్య

దేశంలో హిందీ భాషను బలవంతంగా రుద్దేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని, ఇది సరికాదని తమిళనాడు ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ పేర్కొన్నారు. దేశంలో మరో భాషా యుద్ధానికి తెరతీయవద్దని వ్యాఖ్యానించారు. దేశంలో హిందీ భాష వినియోగం పెంచడంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా నేతృత్వంలో ఏర్పాటైన పార్లమెంటరీ కమిటీ ఇటీవల సమర్పించిన నివేదికపై స్టాలిన్ మండిపడ్డారు.

హిందీ మాట్లాడే వాళ్లే దేశ పౌరులా?
‘‘హిందీ మాట్లాడే వాళ్లే భారత పౌరులు.. మిగతా వారంతా ద్వితీయ శ్రేణి పౌరులూ అంటూ భేదభావంతో చూడటం దేశాన్ని విభజించి పాలించడమే. ప్రస్తుతం ఇంగ్లీష్ మీడియంలో కొనసాగుతున్న కేంద్ర ప్రభుత్వ విద్యా సంస్థల్లో బోధనను ఇంగ్లీషు నుంచి హిందీ లేదా స్థానిక భాష మాధ్యమానికి మార్చాలని పార్లమెంటరీ కమిటీ ప్రతిపాదించింది. హిందీని అధికారిక భాషల్లో ఒకటిగా గుర్తించాలని ఐక్యరాజ్యసమితిని కోరాలని సూచించింది. ఇది హిందీని బలవంతంగా రుద్దే ప్రయత్నమే” అని స్టాలిన్ ఆరోపించారు.

తమపై మరో భాషా యుద్ధాన్ని రుద్దవద్దని స్టాలిన్ డిమాండ్ చేశారు. హిందీ అమలుపై కేంద్ర ప్రభుత్వ తీరును, పార్లమెంటరీ కమిటీ ప్రతిపాదనలను దక్షిణాది రాష్ట్రాలు ఏవీ ఒప్పుకోబోవని స్పష్టం చేశారు.

Related posts

మునుగోడు ఎన్నికల వాగ్దానాల అమలుదిశగా టీఆర్ యస్ అడుగులు!

Drukpadam

రాహుల్ గాంధీని ఆదిశంకరాచార్యులతో పోల్చిన ఫరూక్ అబ్దుల్లా!

Drukpadam

కాంగ్రెస్ అడ్రెస్స్ గల్లంతేనా ? బీజేపీ దే హవా??… ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు!

Drukpadam

Leave a Comment