Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

ఆ 8 గుర్తులను తొలగించండి…ఈసీకి టీఆర్ఎస్ నేత వినోద్ కుమార్ వినతి!

ఆ 8 గుర్తులను తొలగించండి…ఈసీకి టీఆర్ఎస్ నేత వినోద్ కుమార్ వినతి!

  • మునుగోడు ఉప ఎన్నికలో కారును పోలిన 8 గుర్తులు
  • వాటిని జాబితా నుంచి తొలగించాలంటున్న టీఆర్ఎస్
  • ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాసిన వైనం
  • తాజాగా ఈసీ అధికారులను స్వయంగా కలిసిన వినోద్ కుమార్

కారును పోలిన గుర్తులు 8 ఉండటంతో వాటిని తొలగించాలని టీఆర్ యస్ రాష్ట్ర హైకోర్టు ను ఆశ్రయించింది. అయితే కోర్ట్ ఇప్పటికే గుర్తులు కేటాయించినందున గుర్తులను తొలగించడం సాధ్యంకాదని కేసును కొట్టివేసింది.అయినప్పటికీ టీఆర్ యస్ నేత వినోద్ కుమార్ మంగళవారం ఢిల్లీలో ఎన్నికల కమిషన్ నుకలిసి కారును పోలిన గుర్తులు తొలగించాలని విజ్ఞప్తి చేశారు .

మునుగోడు ఉప ఎన్నికల పోలింగ్ కు సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో టీఆర్ఎస్ ఎన్నికల గుర్తు కారును పోలిన గుర్తులను తొలగించే దిశగా ఆ పార్టీ చర్యలను ముమ్మరం చేసింది. ఇప్పటికే ఈ వ్యవహారంపై కేంద్ర ఎన్నికల సంఘానికి టీఆర్ఎస్ లేఖ రాసింది. అయితే ఆ లేఖపై ఈసీ నుంచి స్పందన రాకపోవడంతో తెలంగాణ హైకోర్టును ఆశ్రయించింది. ఎన్నికల ప్రక్రియ ఇప్పటికే మొదలైన నేపథ్యంలో తాము కలగజేసుకోలేమంటూ హైకోర్టు చెప్పడంతో తాజాగా టీఆర్ఎస్ కేంద్ర ఎన్నికల సంఘం ఉన్నతాధికారులతో భేటీ అయ్యింది.

టీఆర్ఎస్ అధిష్ఠానం ఆదేశాల మేరకు ఆ పార్టీ కీలక నేత, మాజీ ఎంపీ వినోద్ కుమార్ మంగళవారం సాయంత్రం ఢిల్లీలోని కేంద్ర ఎన్నికల సంఘం కార్యాలయానికి వెళ్లారు. మునుగోడు ఉప ఎన్నికల్లో కారు గుర్తును పోలిన 8 గుర్తులను ఫ్రీ సింబల్స్ జాబితాలో ఉంచిన విషయాన్ని ఆయన ఎన్నికల సంఘానికి తెలిపారు. ఈ గుర్తులను స్వతంత్ర అభ్యర్థులకు కేటాయిస్తే తమ పార్టీ అభ్యర్థికి నష్టం జరుగుతుందని ఆయన ఎన్నికల సంఘానికి తెలిపారు. ఈ నేపథ్యంలో కారును పోలిన ఆ 8 గుర్తులను ఫ్రీ సింబల్స్ జాబితా నుంచి తొలగించాలని ఆయన ఎన్నికల సంఘాన్ని కోరారు.

ఏకరీతి గుర్తులను కేటాంచవద్దన్న టీఆర్ఎస్ పిటిషన్ ను కొట్టివేసిన హైకోర్టు

  • కారును పోలిన గుర్తులను ఇతరులకు కేటాయించవద్దన్న టీఆర్ఎస్
  • ఈసీ నుంచి స్పందన రాకపోవడంతో హైకోర్టులో పిటిషన్ వేసిన వైనం
  • మొత్తం 8 గుర్తులను ప్రస్తావించిన అధికార పార్టీ
  • ఎన్నికల ప్రక్రియ మొదలైనందున జోక్యం చేసుకోలేమన్న హైకోర్టు

మునుగోడు ఉప ఎన్నికల ముందు తెలంగాణలో అధికార పార్టీ టీఆర్ఎస్ కు షాక్ తగిలింది. తన ఎన్నికల గుర్తు కారును పోలిన గుర్తులను స్వతంత్ర అభ్యర్థులకు కేటాయించకుండా కేంద్ర ఎన్నికల సంఘానికి ఆదేశాలు జారీ చేయాలన్న టీఆర్ఎస్ పిటిషన్ ను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. ప్రస్తుతం మునుగోడు ఉప ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఈ విషయంలో జోక్యం చేసుకోలేమని కోర్టు తెలిపింది.

మునుగోడు ఉప ఎన్నికల్లో తమ గుర్తు కారును పోలిన గుర్తులను స్వతంత్ర అభ్యర్థులకు కేటాయించడం ద్వారా తమకు నష్టం జరుగుతోందని, ఈ విషయంలో ఇప్పటికే పలు ఎన్నికల్లో తమకు నష్టం జరిగిందని, తాజా ఉప ఎన్నికల్లో అయినా తమ గుర్తును పోలిన గుర్తులను ఇతరులకే కేటాయించరాదంటూ కేంద్ర ఎన్నికల సంఘాన్ని టీఆర్ఎస్ కోరిన సంగతి తెలిసిందే. ఈసీ నుంచి ఎలాంటి స్పందన రాకపోవడం, మునుగోడు ఉప ఎన్నికల పోలింగ్ సమీపిస్తున్న నేపథ్యంలో టీఆర్ఎస్ తాజాగా తెలంగాణ హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే.

టీఆర్ఎస్ దాఖలు చేసిన పిటిషన్ పై తెలంగాణ హైకోర్టు మంగళవారం విచారణ చేపట్టింది. ఈ విచారణ సందర్భంగా తమ పార్టీ గుర్తు కారును పోలినట్టుండే… కెమెరా, చపాతీ రోలర్, డోలీ, రోడ్ రోలర్, సబ్బు పెట్టె, టీవీ, కుట్టు మిషన్, ఓడ గుర్తులను మునుగోడు ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థులకు కేటాయించకుండా ఈసీని ఆదేశించాలని టీఆర్ఎస్ కోరింది. అయితే ఇప్పటికే మునుగోడు ఎన్నికల ప్రక్రియ మొదలైనందున తాము జోక్యం చేసుకోలేమంటూ హైకోర్టు  పేర్కొంటూ.. టీఆర్ఎస్ పిటిషన్ ను కొట్టేసింది.

Related posts

అగ్నిపథ్​ పథకంలో కీలక మార్పు.. వయో పరిమితి పెంపు!

Drukpadam

‘అసాధారణ అధికారాలు’ వాడుకున్న సుప్రీంకోర్టు.. రాజీవ్ గాంధీ హత్యకేసు దోషి పెరారివాలన్ ను విడుదల చేయాలని ఆదేశాలు

Drukpadam

జర్నలిస్టుల సంక్షేమమే టీయూడబ్ల్యూజే జెండా, ఎజెండా:విరహత్అలీ!

Drukpadam

Leave a Comment