పరీక్ష చిట్టీ విసిరితే లవ్ లెటర్ అనుకున్న అమ్మాయి… బాలుడ్ని నరికి చంపిన అమ్మాయి సోదరులు
- బీహార్ లో ఘోరం
- సోదరిని పరీక్ష కేంద్రం వద్దకు తీసుకువచ్చిన బాలుడు
- ఆమె కోసం చిట్టీ విసిరిన వైనం
- మరో అమ్మాయి వద్ద పడిన చిట్టీ
- సోదరులకు సమాచారం అందించిన అమ్మాయి
బీహార్ లో ఘోరం …పరీక్షలో సోదరికి కాపీ అందించబోయిన అబ్బాయి పొరపాటున వేరే అమ్మాయి దగ్గర పడ్డ చిట్టి …అబ్బాయిని నరికి చెప్పిన సోదరులు
పరీక్షలకు సరిగా చదవని వారు ఎలాగైనా పాసై పోవాలన్న ఉద్దేశంతో పరీక్ష కేంద్రంలోకి చిట్టీలు తీసుకువస్తుంటారు. ఇలాంటి ఓ చిట్టీ బాలుడి ప్రాణాలను బలిగొంది. ఎగ్జామ్ చిట్టీని లవ్ లెటర్ గా భావించి ఓ అమ్మాయి తన సోదరులకు సమాచారం అందించగా, ఆ చిట్టీ విసిరిన బాలుడ్ని వారు కిరాతకంగా హత్య చేశారు. ఈ ఘటన బీహార్ లోని భోజ్ పూర్ జిల్లాలో జరిగింది.
ఉద్వంత్ నగర్ కు చెందిన దయాకుమార్ (12) తన సోదరిని పరీక్ష కేంద్రం వద్దకు తీసుకువచ్చాడు. సోదరికి సహాయం చేయాలన్న ఉద్దేశంతో, ఆమె పరీక్ష రాస్తుండగా ఓ చిట్టీని ఎగ్జామ్ హాల్లోకి విసిరాడు. అయితే ఆ చిట్టీ మరో అమ్మాయి వద్ద పడింది.
అయితే ఆ అమ్మాయి దాన్ని ప్రేమలేఖగా పొరబడింది. దీనిపై తన అన్నలకు సమాచారం అందించగా, వారు వెంటనే అక్కడికి చేరుకుని దయాకుమార్ ను చితకబాది, ఆపై కిడ్నాప్ చేశారు. ఈ ఘటన జరిగిన నాలుగు రోజుల తర్వాత ఆ బాలుడి శరీర భాగాలు లభ్యం కావడంతో అతడు హత్యకు గురైనట్టు వెల్లడైంది.
ఈ ఘటనతో బాలుడి కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. ఈ హత్యకు పాల్పడినట్టుగా భావిస్తున్న వారిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల్లో కొందరు బాలురు కూడా ఉన్నారు.