Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

ముఖ్యమంత్రి కేసీఆర్‌తో బీజేపీ నేత రాపోలు ఆనందభాస్కర్ భేటీ.. త్వరలోనే టీఆర్ఎస్‌లోకి!

ముఖ్యమంత్రి కేసీఆర్‌తో బీజేపీ నేత రాపోలు ఆనందభాస్కర్ భేటీ.. త్వరలోనే టీఆర్ఎస్‌లోకి!

  • చేనేత రంగ అభివృద్ధికి కేసీఆర్ చేస్తున్న కృషిని అభినందించిన రాపోలు
  • చేనేత రంగాన్ని బీజేపీ నిర్వీర్యం చేసిందని  ఆరోపించిన మాజీ ఎంపీ
  • త్వరలోనే బీజేపీకి రాజీనామా చేసి టీఆర్ఎస్‌లో చేరే అవకాశం

మునుగోడు ఉప ఎన్నిక ముందు బీజేపీకి వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఆ పార్టీ నుంచి ఇప్పటికే ఇద్దరు నేతలు శ్రవణ్‌ కుమార్, స్వామి గౌడ్ బయటకు వచ్చి టీఆర్ఎస్‌లో చేరగా మరో నేత చేరికకు రంగం సిద్ధమైంది. బీజేపీ నేత, మాజీ ఎంపీ రాపోలు ఆనంద భాస్కర్ నిన్న ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావుతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కేసీఆర్‌పై రాపోలు ప్రశంసలు కురిపించారు. చేనేత రంగాన్ని బీజేపీ నిర్వీర్యం చేస్తుంటే కేసీఆర్ మాత్రం చేనేత రంగ అభివృద్ధికి, కార్మికుల సంక్షేమానికి తీసుకుంటున్న చర్యలు భేష్ అని కొనియాడారు.

చేనేత కుటుంబం నుంచి వచ్చిన తాను ఈ విషయంలో బీజేపీ చేస్తున్న నిర్వాకాన్ని చూడలేకపోతున్నానని అన్నారు. రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు అద్భుతంగా ఉన్నాయని పేర్కొన్నారు. బీజేపీకి రాజీనామా చేసి టీఆర్ఎస్‌లో చేరాలన్న తన కోరికను కేసీఆర్ వద్ద రాపోలు బయటపెట్టినట్టు సమాచారం. భారత రాష్ట్ర సమితి ద్వారా జాతీయ రాజకీయాల్లో కేసీఆర్ కీలక పాత్ర పోషించాలని రాపోలు ఆకాంక్షించారు.

Related posts

పార్లమెంట్ సమావేశాల సందర్భంగా ప్రధాని మోడీ అధ్యక్షతన అఖిపక్షం….

Drukpadam

ఒంగోలులో బాలినేని ఫ్లెక్సీ.. రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ!

Drukpadam

బడ్జెట్ పన్ను ప్రతిపాదనలపై నిపుణుల అభిప్రాయాలు…

Drukpadam

Leave a Comment