కారులో తరలిస్తున్న రూ. 65 లక్షలు సీజ్
-ప్రకాశం జిల్లా ఉలవపాడు వద్ద పోలీసుల తనిఖీలు
-ఆగకుండా వెళ్లిపోయిన కారు
-వెంబడించి పట్టుకున్న పోలీసులు
-కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు
కారులో తరలిస్తున్న 65 లక్షల రూపాయలను ప్రకాశం జిల్లా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఉలవపాడు వద్ద జాతీయ రహదారిపై పోలీసులు నిన్న వాహనాల తనిఖీ చేపట్టారు. ఈ క్రమంలో ఒంగోలు నుంచి నెల్లూరువైపు ఓ కారు ఆగకుండా వెళ్లింది. దీంతో అప్రమత్తమైన పోలీసులు కారును వెంబడించి కావలి పరిధిలోని ముసునూరు టోల్‌గేట్ వద్ద అదుపులోకి తీసుకున్నారు. అనంతరం కారును తనిఖీ చేశారు.
కారులో ఉన్న ప్రకాశం జిల్లా తెట్టు గ్రామానికి చెందిన వెంకటేశ్వర్లు వద్ద రూ. 25 లక్షలు, ఒంగోలుకు చెందిన శ్రీమన్నారాయణ వద్ద రూ. 40 లక్షలు లభించాయి. ఆ సొమ్ముకు సంబంధించి వారు ఎలాంటి పత్రాలు చూపించకపోవడంతో స్వాధీనం చేసుకున్నారు. వారిని అదుపులోకి తీసుకుని కారును సీజ్ చేశారు.కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. వీరు ఎక్కడకు వెళ్ళుతున్నారు. అంత డబ్బు ఎందుకు తీసుకొని పోతున్నారనేది తెలియరావాల్సి ఉంది. కారుతో పటు నిందితులిద్దరిని పోలీస్ స్టేషన్ కు తరలించారు .