Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

అభివృద్ధిలో ఒక్క గ్రామాన్ని కూడా వదలలేదు.. మంత్రి పువ్వాడ..

అభివృద్ధిలో ఒక్క గ్రామాన్ని కూడా వదలలేదు.. మంత్రి పువ్వాడ..

ఖమ్మం నియోజకవర్గం రఘునాధపాలెం మండలంలోని ప్రతి గ్రామాన్ని శోధించి మరి అభివృద్ది చేసుకున్నామని, అరకొరగా మిగిలిఉన్న అభివృద్ది కూడా చేసుకుందామని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు.

రఘునాధపాలెం మండలం VV పాలెం గ్రామంలో రూ.53లక్షలతో పలు అభివృద్ది పనులను (13పనులు)రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప్రారంభించారు.

ఆనంతరం గ్రామంలో నూతనంగా మంజూరైన ఆసరా పెన్షన్ ఆర్డర్స్ కాపీలు, గుర్తింపు కార్డ్స్ ను వారు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లడుతూ..ఎన్నడు లేని విధంగా రఘునాధపాలెం మండలంలోని ప్రతి గ్రామంలో వెతికి వెతికి మరీ సీసీ రోడ్లు వేశామని అన్నారు. ప్రజా అవసరాలకోసం నిధులు ఖర్చు చేయడంలో వెనుకాడమని స్పష్టం చేశారు.

ఒకప్పుడు వివి పాలెం గ్రామం ఎలా ఉంది.. నేడు సమీకృత భవనం అయిన కలెక్టరేట్ వచ్చినాక ఎలా ఉందో ప్రజలు గమనించాలన్నారు. దాదాపు ఖమ్మం నగరం వివి పాలెం కలిసిపోయాయని అన్నారు.

తెలంగాణ ప్రభుత్వం వచ్చాక అత్యధిక నిధులు మంజూరు చేయడం జరుగుతుందని, గ్రామాల అభివృద్ది కోసం సింహ భాగంలో రఘునాథపాలెం మండలంకే కేటాయించామని వివరించారు.

మన గ్రామాల అభివృద్ధికి ప్రజాప్రతినిధులు, నాయకులు కలిసికట్టుగా ఉండి సమస్యలపై పని చేయాల్సిన బాధ్యత ఉందన్నారు.

రాష్ట్రంలోనూ లేని విధంగా తెలంగాణలో ఆసరా పింఛన్లు ఇస్తున్నట్టు తెలిపారు. ఒక్క తెలంగాణలో మాత్రమే సీఎం కేసీఆర్‌ గారి హయాంలో పింఛన్‌ లబ్ధిదారులకు ప్రతినెలా రూ.2,016 చొప్పున అందజేస్తున్నట్టు చెప్పారు.

పెన్షన్ల పంపిణీలో మనమే నెంబర్ వన్ అని, అందరికీ సంక్షేమం అందాలని ముఖ్యమంత్రి కేసీఅర్ తాపత్రయం అని అన్నారు.

వయసు 65 నుండి 57కు కుదించి మరింత మందికి ఆసరా గా నిలిచారని, వృద్ధులు, వితంతువులు, వికలాంగులు, ఒంటరి మహిళలు, బీడీ కార్మికులు తదితర వర్గాల వారికి పెన్షన్లను అందిస్తూ ముఖ్యమంత్రి కేసీఅర్ తన పెద్ద మనసు చాటుకున్నారని అన్నారు.

జిల్లాలో ఇప్పటికే 1.50 లక్షల మందికి వివిధ రకాల ఆసరా పెన్షన్లు అందుతుండగా, కొత్తగా 49 వేల మందికి పెన్షన్ల జాబితాలో చోటు కల్పించడం గర్వకారణమన్నారు.

పెన్షన్లు పంపిణీ చేయడంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే నెంబర్ వన్ గా ఉందని, తెలంగాణ తరహాలో దేశంలోని మరే ఇతర రాష్ట్రాల్లో పెన్షన్ల పంపిణీ జరగడం లేదని మంత్రి పువ్వాడ స్పష్టం చేశారు.

గతంలో పెన్షన్ అంటే ప్రభుత్వ ఉద్యోగాలు చేసి పదవి విరమణ పొందిన వారికి ఇవ్వడం మనకి తెలుసని, తెదేపా హాయంలో రూ.70 ఇవ్వగా కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రూ.200 ఇచ్చారని అది కూడా సకాలంలో ఇచ్చిన దాఖలాలు లేవన్నారు.

ముఖ్యమంత్రి కేసీఅర్ పెద్ద మనసుతో ప్రకటించడంతో పాటు నిర్విరామంగా కొనసాగించడం వారికే సాధ్యమైందన్నారు.

తద్వారా నేడు సమాజంలో వృద్దులకు, వికలాంగులకు పెన్షన్ల ద్వారా గౌరవ, మర్యాదలు కల్పించబడ్డాయని అన్నారు. వయసు పైబడిన వారు చివరి దశలో ఇతరులపై ఆధారపడకుండా గౌరవప్రదమైన జీవనం గడిపేందుకు 57 సంవత్సరాలు నిండిన వారికి కూడా పెన్షన్లు అందిస్తున్న ఘనత సీఎం కేసీఆర్ కే దక్కిందన్నారు.

దేశంలోనే మరెక్కడా లేనివిధంగా బీడీ కార్మికులకు తెలంగాణ రాష్ట్రంలో పెన్షన్లు అందిస్తున్నారని పేర్కొన్నారు.సీఎం కెసిఆర్ నేతృత్వంలో దేశంలో ఎక్కడా లేని విధంగా అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు అవుతున్నాయన్నారు.

తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్‌ అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారన్నారు. నీటి తీరువా లేకుండా ఉచితంగా సాగునీరు, ఉచితంగా వ్యవసాయానికి 24 గంటల కరంటు ఇస్తున్నది ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే ఇస్తున్నామన్నారు.

Related posts

టీఆర్ఎస్ ఆఫీసు ముందు ఆగి కిషన్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు… ఆందుకే మా వాళ్లు ఆవేశపడ్డారు: వినోద్

Drukpadam

ప్రజాస్వామ్య దేశాలు ఇంట‌ర్నెట్‌ విచ్ఛిన్నతకు ఎదురొడ్డాలి: సుందర్‌ పిచాయ్!

Drukpadam

మెక్సికోలో ఘోర ప్రమాదం.. 27 మంది మృతి…

Drukpadam

Leave a Comment