Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
సినిమా వార్తలు

హీరోయిన్లపై ట్రోలింగ్స్ …తమ్మారెడ్డి భరద్వాజ్ స్పందన ….

ట్రోలింగ్ జరగడానికి కారణాలు ఇవే: తమ్మారెడ్డి భరద్వాజ!

  • సోషల్ మీడియా వచ్చాక స్వేఛ్ఛ ఎక్కువైందన్న తమ్మారెడ్డి 
  • వ్యక్తిగత విషయాలు పబ్లిక్ లో పెడుతున్నారంటూ వివరణ 
  • పెళ్లిని .. హనీమూన్ ను కమర్షియల్ గా మారుస్తున్నారని వెల్లడి  

ఈ మధ్య కాలంలో హీరోలు .. హీరోయిన్లు ఎక్కువగా ట్రోలింగ్ కి గురవుతున్నారు. ముఖ్యంగా హీరోయిన్స్ లో చాలామంది ఏదో ఒక సందర్భంలో ట్రోలింగ్ బారిన పడుతున్నారు. రీసెంట్ గా రష్మిక ట్రోలర్స్ బారిన పడింది. దాంతో ట్రోలింగ్ గురించి తాజా ఇంటర్వ్యూలో తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ .. ” రష్మిక తనకి నచ్చిన డ్రెస్సులు వేసుకుంటుంది .. తన అభిప్రాయం చెబుతుంది. అందుకు ఆమెను తప్పుబట్టేసి ట్రోల్ చేయవలసిన అవసరం ఉందని నేను అనుకోవడం లేదు. రష్మిక ఏం చేస్తే బాగుంటుందని చెప్పే హక్కు ఇతరులకు లేదుకదా” అన్నారు.

” సాధారణంగా ట్రోలింగ్ బారిన పడటానికి కొన్ని కారణాలు ఉంటాయి. ఎవరైతే తమ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలను పబ్లిక్ లో పెడతారో అలాంటివారే ట్రోలింగుకి గురవుతూ ఉంటారు. కొంతమంది అమ్మాయిలు ‘నేను సింగిల్’ అని ఫేస్ బుక్ లో పెడుతుంటారు. ఆమె సింగిల్ గా ఉంటే ఏంటి? .. డబుల్ గా ఉంటే ఏంటి? అసలు ఆ విషయం బయటికి చెప్పడం ఎందుకు? అనవసరమైన విషయాలను పోస్ట్ చేయడం అంటే అవతలవారిని రెచ్చగొట్టడమే కదా?” అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

“ఎవరైనా సరే .. ఏ విషయమైనా సరే .. పర్సనల్ విషయాలను పబ్లిక్ లోకి తీసుకురాకపోవడమే మంచిది. ఇక కొంతమంది పెళ్లి చేసుకుంటే, ఆ వీడియో హక్కులను కూడా టీవీలకో .. డిజిటల్ వారికో అమ్మేస్తున్నారు. నిజం చెప్పాలంటే పెళ్లి అనేది మన కుటుంబానికి సంబంధించిన విషయం. ఇక హనీమూన్ మరింత పర్సనల్ విషయం. ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి హనీమూన్ అనేది పెట్టారు. చివరికి హనీమూన్ కి సంబంధించిన విషయాలను కూడా అమ్మేసుకుని దానిని కూడా కమర్షియల్ గా చేసేస్తున్నారు. సమాజానికి ఏం చెప్పాలనుకుంటున్నట్టు? ఏం చేయాలనుకుంటున్నట్టు? మనం నోరుమూసుకుని కూర్చుంటే .. ఎదుటివారు ఏం మాట్లాడతారు? అందుకు భిన్నమైన పనులు చేస్తే ట్రోల్స్ జరుగుతూనే ఉంటాయి మరి’ అంటూ చెప్పుకొచ్చారు.

Related posts

బలగం చిత్రానికి రెండు అంతర్జాతీయ అవార్డులు!

Drukpadam

అల్లు అర్జున్.. మిమ్మ‌ల్ని చూస్తే గ‌ర్వంగా ఉంది: ప్ర‌కాశ్ రాజ్‌

Ram Narayana

ఇది పవన్ క‌ల్యాణ్ పై దాడి కాదు… థియేటర్ల వ్యవస్థపై దాడి:ఎన్వీ ప్రసాద్

Drukpadam

Leave a Comment