కృష్ణ అంత్యక్రియలు ఫామ్ హౌస్ లో కాకుండా మహాప్రస్థానంలో చేయడానికి కారణం ఇదే!
- ఇటీవల మహాప్రస్థానంలో కృష్ణ భార్య అంత్యక్రియలు
- అందుకే కృష్ణకు కూడా అక్కడే అంత్యక్రియలు
- ఇది కుటుంబ సభ్యుల నిర్ణయమన్న ఆదిశేషగిరిరావు
- కృష్ణ పేరిట మెమోరియల్ ఏర్పాటు చేయాలని నిర్ణయం
సూపర్ స్టార్ కృష్ణ అంత్యక్రియలు నిన్న తెలంగాణ ప్రభుత్వ లాంఛనాలతో జరిగిన సంగతి తెలిసిందే. జూబ్లీహిల్స్ లోని మహాప్రస్థానంలో అంత్యక్రియలను నిర్వహించారు. అయితే, అంత గొప్ప సూపర్ స్టార్ అంత్యక్రియలు సొంత ఫామ్ హౌస్ లో కాకుండా శ్మశానవాటికలో నిర్వహించడంపై పలువురు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు.
దీనిపై కృష్ణ సోదరుడు ఆదిశేషగిరిరావు స్పందిస్తూ… దీనికి ఒక కారణం ఉందని చెప్పారు. కృష్ణగారి భార్య అంత్యక్రియలు జరిగిన చోటే ఆయన కార్యక్రమాలు కూడా చేయాలనే భావనతో మహాప్రస్థానంలో చేశామని తెలిపారు.
మరోవైపు కృష్ణగారి జ్ఞాపకాలు పదిలంగా ఉండేలా ఆయన పేరు మీద ఒక మెమోరియల్ ఏర్పాటు చేయాలని కుటుంబ సభ్యులు నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. ఈ మెమోరియల్ హాల్ లో ఆయన కాంస్య విగ్రహంతో పాటు ఆయన నటించిన 350 చిత్రాల వివరాలు, ఫొటోలు, షీల్డ్ లను ఉంచనున్నట్టు సమాచారం.