Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

పాలేరుపై కందాలకు ఫుల్ క్లారిటీ…

పాలేరుపై కందాలకు ఫుల్ క్లారిటీ
మాది కమ్యూనిస్ట్ కుటుంబమేఎం ఎల్ పార్టీతో సంబంధాలు
చిన్నప్పటినుంచి నలుగురికి సహాయం చేయడమే మా నైజం
పొలం దగ్గరకు అన్నం తీసుకోని పొతే నలుగురికి పెట్టేవాళ్ళం
సహాయం కోసం వచ్చినవారికి శక్తి మేరకు చేస్తాను
చనిపోయిన ప్రతి కుటుంబానికి 10 వేల సొంత నిధులతో సహాయం
పాలేరు సీటు కమ్యూనిస్టులకు ఇస్తారనేదానిపై నర్మగర్భ వ్యాఖ్యలు
పాలేరు లో టీఆర్ యస్ సభ్యత్వం 80 వేలు చేర్పించిన ఘనత
సీఎం దృష్టిలో కందాల అంటే ఒక నమ్మకం, విశ్వాసం

కందాల ఉపేందర్ రెడ్డి పాలేరు ఎమ్మెల్యేరాజకీయాలపై ఫుల్ క్లారిటీతో ఉన్నారు . ఎమ్మెల్యేగా మొదటి ప్రయత్నంలోనే విజయం సాధించారు . గెలిచిన మొదట్లో పబ్లిక్ మీటింగ్ లలో మాట్లాడేందుకు కొంత తడబడిన ఆయన , తరవాత పరిపక్వత సాధించారు . ప్రస్తుతం పాలేరు నియోజకవర్గం కమ్యూనిస్టులకు ఇస్తారనే చర్చజరుగుతున్న సందర్భంగా శుక్రవారం ఖమ్మంలో విలేకర్లుతో చిట్ చాట్ నిర్వహించారు.

సందర్భంగా అనేక విషయాలను విలేకర్లతో పంచుకున్నారు . ఆయన మాటల్లో పాలేరు కమ్యూనిస్టులకు ఇచ్చే అవకాశమే ఉండదని అర్థం వచ్చేలా మాట్లాడారు .వారితో పొత్తు ఉంటుందంటూనే సీఎం కేసీఆర్ అన్ని చూసుకుంటారని నర్మగర్బంగా పేర్కొన్నారు . తాను బతికున్నంత వరకు పాలేరులోనే పోటీ చేస్తానని కుండబద్దలు కొట్టారు . ఆయన నియోజకవర్గంలో ప్రజలకు చేస్తున్న సహాయాలు గురించి విలేకర్లు ప్రస్తహించగా, సహాయం చేసేందుకు మనసుంటే మార్గం ఉంటుందన్నారు . రేపు అనేదాని గురించి తాను ఎప్పుడు ఆలోచించలేదని ఉన్నదాంట్లో ఎంతమందికి ఉపయోగపడతామనే లక్ష్యంతో ముందుకు పోవడమే తన కర్తవ్యంగా భవిస్తాన్నారు . తమది కూడా కమ్యూనిస్ట్ కుటుంబమేనని ఎం ఎల్ పార్టీలో తమ వాళ్ళు పనిచేశారని,తమ దగ్గర ప్లినరీ సమావేశాలు కూడా జరిగాయని , తమవాళ్లు దళాల్లో కూడా తిరిగారని అన్నారు . పేదల పక్షపాతిగా ప్రజలతో కలిసి పోవడం , పేదవారికి సహాయపడటం ,వారి కష్టసుఖాల్లో పాలుపంచుకోవడం చిన్నప్పటినుంచే అలవడిందందన్నారు .

గత ఎన్నికల్లో టీఆర్ యస్ కు చెందిన మాజీమంత్రి తుమ్మల నాగేశ్వరరావుపై కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేసి అనూహ్య విజయం సంగతి విదితమే .రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు నేపథ్యంలో కొద్దీ నెలల్లోనే ఆయన కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పి టీఆర్ యస్ లో చేరిన సంగతి తెలిసిందే . టీఆర్ యస్ లో ఎందుకు చేరాల్సి వచ్చిందో ఆయన చెప్పిన కారణాలు కన్విన్సింగ్ గానే ఉన్నాయి.ప్రజలకు మంచి చేయాలనే తపనే తనను టీఆర్ యస్ లో చేరేలా చేసిందని అన్నారు . గత 4 సంవత్సరాలుగా నియోజకవర్గంలో తనకంటూ ప్రత్యేకతను చాటుకున్న కందాల సీఎం కేసీఆర్ దృష్టిలో మంచి మార్కులే సంపాదించారు . పార్టీలకు అతీతంగా చనిపోయిన ప్రతి పేద కుటుంబానికి 10 వేల రూపాయలు ఇచ్చే స్కీమ్ ఆయనకు ప్రజల్లో మంచి ఆదరణ తెచ్చిపెట్టింది. బహుశా దేశంలోనే పక్కాగా ఇలా ఎమ్మెల్యే తన సొంత డబ్బులను పంపిణ చేస్తున్నట్లు ఎక్కడ వినలేదంటే ఆశ్చర్య పోవాల్సిన పనిలేదు . ఇదే కాకుండా పేద పిల్లలకు ఉన్నత చదువులకోసం ,జబ్బు చేసిన పేదలకు సీఎం రిలీఫ్ ఫండ్ కాకుండా వ్యక్తిగతంగా ఆదుకోవడం , దేవాలయాలు ,చర్చులు , మసీదులకు సహాయం చేయడం నిత్యకృత్యంఇక పార్టీ పరంగా 80 వేల సభ్యత్వం చేర్పించి రాష్ట్రంలో నాలుగైదు నియోజకవర్గాల సరసన పాలేరు ను చేర్చారు . కందాల అంటే సీఎం కేసీఆర్ కు ఒక నమ్మకం విశ్వాసం….అందుకు అనుగుణంగా కందాల నియోజకవర్గ ప్రజలతో మమేకం అవుతున్నారు …..

Related posts

పంజాబ్ కాంగ్రెస్ పరిణామాలపై ఎంపీ మనీశ్ తివారి తీవ్ర ఆవేదన!

Drukpadam

రఘురామ బెయిల్ పిటిషన్ పై సుప్రీంకోర్టులో కౌంటర్ దాఖలు చేసిన ఏపీ సర్కారు…

Drukpadam

ఒమిక్రాన్ విజృంభించినా సభలు, సమావేశాలు ఆపబోం.. వర్చువల్‌గా చేపడతాం: బీజేపీ

Drukpadam

Leave a Comment