Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

ఖమ్మం ప్రెస్‌క్లబ్ అధ్యక్షులుగా మైసా పాపారావు!

ప్రెస్ క్లబ్ కమిటీకి మంత్రి పువ్వాడ అభినందన

ఖమ్మం నగర ప్రెస్ క్లబ్ నూతన కమిటీని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అభినందించారు. గత 25 సంవత్సరాలుగా కొనసాగుతున్న ప్రెస్ క్లబ్ కు కొత్త కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు ఈ కమిటీని టి యు డబ్ల్యూ జే (ఐజేయు) జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు వనం వెంకటేశ్వర్లు ఏనుగు వెంకటేశ్వరావు లు మంత్రి కి పరిచయం చేశారు. నూతన అధ్యక్షులుగా మైసా పాపారావు, ప్రధాన కార్యదర్శిగా కురాకుల గోపి, ఉపాధ్యక్షులుగా చెరుకుపల్లి శ్రీనివాసరావు , కార్యనిర్వాహక కార్యదర్శిగా వై మాధవరావు, సహాయ కార్యదర్శలుగా మేడి రమేష్ ,ఎల్ సుధాకర్, జనార్దన్ చారి
కోశాధికారిగా నామ పురుషోత్తం ఎన్నికయ్యారని మంత్రికి వివరించారు
ఈ సందర్భంగా మంత్రి కొత్త కమిటీని అభినందిస్తూ శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులు ఆవుల శ్రీనివాస్ ,జిల్లా యూనియన్ నాయకులు మురారి, దూరదర్శన్ రమేష్, జనతా శివ, ఫోటోగ్రాఫర్ అసోసియేషన్ అధ్యక్షులు కమటం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు

ఖమ్మం ప్రెస్‌క్లబ్ అధ్యక్షులుగా మైసా పాపారావు

ప్రధాన కార్యదర్శిగా కూరాకుల గోపి
కోశాధికారిగా నామా *పురుషోత్తం ఎన్నిక

ఖమ్మం నగర ప్రెస్‌క్లబ్ నూతన కమిటీ సోమవారం ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు టీయూడబ్ల్యూజే (ఐజేయు) అధ్యక్షులు వనం వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శి ఏనుగు వెంకటేశ్వరరావు ఒక ప్రకటనలో తెలిపారు. అధ్యక్షులుగా మైసా పాపారావు(ఆంధ్రప్రభ), ప్రధాన కార్యదర్శిగా కూరాకుల గోపి(మారుతి ప్లస్), కోశాధికారిగా నామా పురుషోత్తం(మనం) ఎన్నికైనట్లు వారు తెలిపారు. టియుడబ్ల్యూజె(ఐజెయు) రాష్ట్ర ఉపాధ్యక్షులు కె.రాంనారాయణ సమక్షంలో
సోమవారం జరిగిన సమావేశంలో ఈ కమిటీని ఎన్నుకున్నట్లు వారు తెలిపారు.

 

ప్రెస్ క్లబ్ అధ్యక్షులుగా మైసా పాపారావు(ఆంధ్రప్రభ),
ప్రధాన కార్యదర్శిగా కూరాకుల గోపి(మారుతి ప్లస్),
కోశాధికారిగా నామా పురుషోత్తం(మనం),
ఉపాధ్యక్షులుగా కనకం సైదులు(10 టివి), చెరుకుపల్లి శ్రీనివాసరావు(99 టివి), శీలం శ్రీనివాస్ (నమస్తే తెలంగాణ),
సహాయ కార్యదర్శులుగా ఎన్.జనార్ధనాచారి(నవభూమి), మేడి రమేష్(సూర్య), కమటం శ్రీనివాస్ (వార్త), ఎల్.సుధాకర్(99 టివి),
ఆర్గనైజింగ్ కార్యదర్శిగా ఏగినాటి మాధవరావు(ప్రజాపక్షం),
గౌరవ సలహాదారులుగా ఏ.రవీంద్రశేషు(దక్కన్ క్రానికల్), బి.వి సత్యనారాయణ(హ్యాన్స్ ఇండియా), బండారు రమేష్ (దూరదర్శన్), నర్వనేని వెంకట్రావ్(స్టూడియో ఎన్), మాటేటి వేణుగోపాల్(నమస్తే
తెలంగాణ) ఎన్నికైనట్లు తెలిపారు.
తీర్మానాలు ః అర్హులైన జర్నలిస్టులందరికీ వెంటనే ఇళ్లు, ఇళ్ల స్థలాలు ఇవ్వాలి. దళిత జర్నలిస్టులం
దరికీ దళితబంధు పథకాన్ని వర్తింప చేయాలని సమావేశం తీర్మానించినట్లు తెలిపారు.

 

 

Related posts

పారాసిటమాల్ ట్యాబ్లెట్ ధర ఇకపై రూ. 2.76.. సవరించిన ఎన్‌పీపీఏ!

Drukpadam

ఏపీలో కొత్త జిల్లాల పేర్లలో స్వల్ప మార్పులు…

Drukpadam

548 కిలోల బరువు ఎత్తిన స్ట్రాంగెస్ట్‌ మ్యాన్‌.. 

Drukpadam

Leave a Comment